Mana Shankara VaraPrasad Garu Trailer Review: వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. సంక్రాంతికి నవ్వుల విందు గ్యారెంటీ!

Mana Shankara VaraPrasad Garu Trailer Review: వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. సంక్రాంతికి నవ్వుల విందు గ్యారెంటీ!
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ట్రైలర్ రివ్యూ. వింటేజ్ చిరు మార్క్ కామెడీ, విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎంట్రీతో సంక్రాంతికి నవ్వుల విందు గ్యారెంటీ!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ సినిమాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇప్పటికే సాంగ్స్, గ్లింప్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

మెగా 'మాస్' ఎలివేషన్ - అనిల్ మార్క్ కామెడీ

దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ ఆరంభంలోనే చిరంజీవి పాత్రను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్ అంటూ భారీ ఎలివేషన్స్ వస్తుంటే.. సీన్ కట్ చేస్తే చిరు ఇంట్లో బట్టలు ఉతుకుతూ, వంట చేస్తూ కనిపించడం నవ్వులు పూయించింది. ఒక పక్క పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా రౌడీల తుక్కురేగ్గొడుతూనే, మరోపక్క భార్య దగ్గర భయపడే భర్తగా 'ఘరానా మొగుడు' నాటి వింటేజ్ చిరంజీవిని గుర్తుచేశారు.

నయనతారతో కెమిస్ట్రీ.. ఫ్యామిలీ డ్రామా!

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో శశిరేఖ పాత్రలో కనిపిస్తున్నారు. చిరు-నయన్ మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్, వారి విడాకుల చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా "నన్ను టార్చర్ పెట్టే అత్తామామల్ని ఆడుకుంటుంటే ఆ హై వేరు" అంటూ చిరు చెప్పే డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం.

విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ!

ట్రైలర్ చివర్లో విక్టరీ వెంకటేష్ హెలికాప్టర్‌లో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. "చూడటానికి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు.. ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి?" అని చిరు అడగ్గా.. "నువ్వు మాస్ కే బాస్ లా ఉన్నావు, ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి?" అని వెంకీ ఇచ్చిన కౌంటర్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

సాంకేతిక విభాగం:

  • మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది.
  • సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి.
  • నిర్మాణం: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

బాటమ్ లైన్:

మొత్తానికి 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ చూస్తుంటే.. అనిల్ రావిపూడి ఈసారి మెగాస్టార్‌తో పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని అర్థమవుతోంది. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో మెగా విన్నర్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి!

Show Full Article
Print Article
Next Story
More Stories