'లవర్స్‌ డే' మూవీ రివ్యూ

లవర్స్‌ డే మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: లవర్స్ డే నటీనటులు: ప్రియ ప్రకాష్ వారియర్, రోషన్ రాహూఫ్, నూరిన్ షెరీఫ్, మిషెల్, అరుణ్ ఏ కుమార్, సియాద్ షాజహాన్, దిల్రూపా అస్వాద్ తదితరులు ...

చిత్రం: లవర్స్ డే

నటీనటులు: ప్రియ ప్రకాష్ వారియర్, రోషన్ రాహూఫ్, నూరిన్ షెరీఫ్, మిషెల్, అరుణ్ ఏ కుమార్, సియాద్ షాజహాన్, దిల్రూపా అస్వాద్ తదితరులు

సంగీతం: షాన్ రెహ్మాన్

సినిమాటోగ్రఫీ: సిను సిద్ధార్థ్

ఎడిటింగ్‌: అచ్చు విజయన్

నిర్మాత: ఔసేపచాన్ వాలకుజి

దర్శకత్వం: ఒమర్ లులు

బ్యానర్: ఔసేపచాన్ మూవీ హౌస్

విడుదల: 14/02/2019

కేవలం ఒక్క కన్నుగీటుతో ప్రియా ప్రకాష్ వారియర్ స్టార్ గా మారడమే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో సోషల్ మీడియా వైరల్ గా మారిన వీడియో తన మలయాళం మొదటి సినిమా 'ఓరు అడార్ లవ్' లోని 'మలరాయ పూవి' పాట లోనిదే. ఆ సినిమా లీక్ లో ప్రియా కన్ను గీటే సీన్, గన్ షాట్ సీన్లు యూట్యూబ్ లో వైరల్ గా మారిన ఇన్నాళ్ళకు ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'లవర్స్ డే' అనే టైటిల్ తో తెలుగులో విడుదల కానున్న ఈ సినిమాకి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాష్ వారియర్, అబ్దుల్ రాహూఫ్ రోషన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా టైటిల్కు తగ్గట్టు గానే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇవ్వాళ విడుదలైంది. మరి కేవలం కన్నుగీటుతో నే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా.

క‌థ:

ఈ సినిమా మొత్తం హై స్కూల్ బ్యాక్ డ్రాప్తో సాగుతుంది. రోషన్ (రోషన్ రాహూఫ్) తొలిచూపులోనే ప్రియా (ప్రియా ప్రకాష్ వారియర్) తో పీకల్లోతు ప్రేమలో పడతాడు. ప్రియా కూడా రోషన్ ను ఇష్టపడుతుంది. కానీ రోషన్ ఆమెకు ఎన్నిసార్లు తన ప్రేమ విషయాన్ని చెప్పినా ఆమె మాత్రం రోషన్ ప్రపోజల్స్ ను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రియా కు ఎలాగైనా నచ్చాలి అన్ని తన వెనక తిరుగుతూ ఉన్న సమయంలో గాధ (నూరిన్ షరీఫ్) సీన్ లోకి ఎంటర్ అవుతుంది. ఈమె సహాయంతో ప్రియ మరియు రోషన్ లు ఒకటవుతారు. అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల రోషన్ మరియు ప్రియా విడిపోతారు. అసలు రోషన్, గాధ మధ్య ఏం జరిగింది? గాధ ప్రియ మరియు రోషన్ ను కలపగలిగిందా? అనేది మనం తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టులు :

ప్రియా ప్రకాష్ వారియర్ నటన ఈ సినిమాకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. మరీ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ గ్లామర్ తో మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను బాగానే మెప్పిస్తుంది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా అయినప్పటికీ తన పాత్రకు తాను నూరు శాతం న్యాయం చేసింది. హీరో రోషన్ నటన చాలా బాగుంది. రోషన్ మరియు ప్రియా ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలలో ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రెండో హీరోయిన్ పాత్రలో కనిపించిన నూరిన్ షెరీఫ్ తన అందచందాలతో నే కాక నటనతో కూడా అలరిస్తుంది. ముఖ్యంగా హీరో కి ఆమెకూ మధ్య వచ్చే సీన్లు చాలా బాగుంటాయి. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ మిషెల్ పర్వాలేదనిపించింది. అరుణ్ ఏ కుమార్ కూడా నటనతో బాగానే ఆకర్షిస్తాడు. సియాద్ షాజహాన్ నటన బావుంది. మిగతా నటీనటులు కూడా తమకున్న పరిధిలో బాగానే మెప్పించారు.

సాంకేతిక వర్గం:

స్నేహం ప్రేమ మధ్య తేడాను చూపించే ప్రయత్నంలో దర్శకుడు కథను ఆసక్తికరంగా మలచ లేకపోయాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, టీనేజ్ రొమాన్స్, క్యారెక్టర్ ల ఇంట్రడక్షన్, ఫ్రెషర్స్ పార్టీ ఇలా సాఫీగా సాగిపోతుంది. కాని సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లోగా,డల్ గా సాగుతూ ఉంటుంది. దర్శకుడు ఎలివేట్ చేయాల్సిన ఎమోషన్ ను సరిగ్గా చూపించ లేక పోవడంతో సినిమా బోరింగ్ గా మారుతుంది. కొన్ని అక్కర్లేని సన్నివేశాలతో ప్రేక్షకులకు చిరాకు వస్తుంది. ఔసేపచాన్ మూవీ హౌస్ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. షాన్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు బాగా సెట్ అయ్యింది. పాటలు పక్కన పెడితే నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. సియాద్ షాజహాన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరింత అందంగా మార్చింది. అచ్చు విజయం ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.

బలాలు:

ఫస్ట్ హాఫ్

హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ

డైలాగులు

బలహీనతలు:

సెకండ్ హాఫ్

కథ బలహీనంగా ఉండటం

చివరి మాట:

బోలెడు అంచనాల మధ్య విడుదలైన ప్పటికీ ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. దర్శకుడు రాసుకున్న కథాకథనాలు చాలా బోరింగ్ గా ఉంటాయి. పైగా కొన్ని సీన్లను సాగదీయడం, బలవంతంగా నవ్వు తెప్పించాలని ప్రయత్నించే రొటీన్ కామెడీతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా నడిపితే, సెకెండ్ హాఫ్ ని స్లోగా డల్ గా నడిపించారు.

బాటమ్ లైన్:

ప్రియ ప్రకాష్ ఫ్యాన్స్ మాత్రమే జరుపుకోగల 'లవర్స్ డే'.

Show Full Article
Print Article
Next Story
More Stories