Love Today Review: లవ్ టుడే మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Love Today Movie Review
x

Love Today Review: లవ్ టుడే మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Love Today Review: లవ్ టుడే మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: లవ్ టుడే

నటీనటులు: ప్రదీప్ రంగనాధన్, ఇవానా, రవీనా రవి, యోగి బాబు, సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, అక్షయ ఉదయకుమర్, భరత్, ఆదిత్య ఖాతిర్ తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తం

నిర్మాతలు: కల్పతి ఎస్. ఆఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్

దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్

బ్యానర్: ఏ జీ ఎస్ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 25/11/2022

2019లో "కోమలి" అనే సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్ మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూటాంట్ డైరెక్టర్ గా సైమా అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా ఇప్పుడు తానే హీరోగా స్వీయ దర్శకత్వంలో "లవ్ టుడే" అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. నవంబర్ 4 న తమిళ్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్ల దాకా వసూలు చేసింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అయ్యింది. అదే టైటిల్ తో లవ్ టుడే తెలుగు వర్షన్ ఇవాళ అనగా నవంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా.

కథ:

ఉత్తమం ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) మరియు నిఖిత (ఇవానా) సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గా ఒకే కంపెనీలో పని చేస్తూ ఉంటారు. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా చిగురుస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఈ సమయంలో వీరిద్దరి విషయం నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) కు తెలుస్తుంది. అయితే వీరి పెళ్లికి ఒప్పుకోవడానికి వేణు శాస్త్రి ఒక కండిషన్ ను పెడతారు. 24 గంటల పాటు నిఖిత మరియు ప్రదీప్ తమ ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేణు శాస్త్రి చెప్పినట్టుగానే ప్రదీప్ మరియు నిఖిత తమ ఫోన్ లను ఎక్స్చేంజ్ చేసుకుంటారు కానీ అప్పుడే వారి మధ్య గొడవలు మొదలవుతాయి విడిపోదామని కూడా అనుకుంటారు. మరోవైపు ప్రదీప్ సోదరి దివ్య (రవీనా రవి) మరియు డాక్టర్ యోగి (యోగి బాబు) కి పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. కానీ డాక్టర్ యోగి గురించి ప్రదీప్ కుటుంబానికి కొన్ని అనుమానాలు వస్తాయి. చివరికి ప్రదీప్ మరియు నిఖిత కలిసారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

ప్రదీప్ రంగనాథన్ తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రదీప్ నటన సినిమాకి చాలా బాగా సెట్ అయింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఇన్ సెక్యూరిటీస్ ఉన్న ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో ప్రదీప్ చాలా బాగా నటించాడు. ఇవానా కూడా మంచి పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రదీప్ తో తన కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ ఔట్ అయింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. సత్య రాజ్ మరియు రాధికా శరత్ కుమార్ కూడా తమ పాత్రలలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. యోగి బాబు మరియు రవీనా రవి కూడా చక్కటి పర్ఫామెన్స్ అందించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

హీరోగా మాత్రమే కాక ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా కూడా సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దారు. చాలా వరకు కథ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రదీప్ సినిమాని చాలా ఆసక్తికరంగా మలిచిన విధానం సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. చాలావరకు సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ మీదే నడుస్తుంది. మధ్య మధ్యలో వచ్చే ఎమోషన్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రదీప్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో మంచి కామెడీ ఉన్న సన్నివేశాలను రాసుకున్నారు. సినిమాలో చాలా ఫ్రెష్ కామెడీ ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర మరియు కథ ప్రేక్షకుల కు చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా పాటల పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ దినేష్ పురుషోత్తమన్ అందించిన విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.

బలాలు:

కాన్సెప్ట్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కామెడీ

బలహీనతలు:

ప్రెడిక్టబుల్ క్లైమాక్స్

సెకండ్ హాఫ్

చివరి మాట:

ఈ కాలం యువత గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మిగతా ప్రేక్షకులతో పోలిస్తే యువత ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం వాళ్లకి చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. ఒక మంచి కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ కూడా అందిస్తూ కథని ఎంటర్టైనింగ్ గా మార్చడం కష్టమైన పని. కానీ ప్రదీప్ ఈ విషయంలో సఫలమయ్యారు అనే చెప్పుకోవాలి. ఒకవైపు ఎమోషన్లకి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ తో సినిమాని చాలా బాగా ముందుకు నడిపించారు. పెద్ద చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్లు సినిమాలో ఏమీ లేకపోయినప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా "లవ్ టుడే" సినిమా ఒక ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా.

బాటమ్ లైన్:

"లవ్ టుడే" టైటిల్ కి తగ్గట్టు గానే ఈ కాలం ప్రేమ కథ లను ఎంటర్టైనింగ్ వే లో చూపించే సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories