KGF Chapter 2 Review: కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

KGF Chapter 2 Review | Telugu Movie Review
x

KGF Chapter 2 Review: కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Highlights

KGF Chapter 2 Review: కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

KGF Chapter 2 Review:

చిత్రం: కే జీ ఎఫ్: చాప్టర్ 2

నటీనటులు: యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, మాలవిక అవినాష్, రావు రమేష్ తదితరులు

సంగీతం: రవి బస్రుర్

సినిమాటోగ్రఫీ: భువన గౌడ

నిర్మాత: విజయ్ కిరగందుర్

దర్శకత్వం: ప్రశాంత్ నీల్

బ్యానర్: హాంబలే ఫిల్మ్స్

విడుదల తేది: 14/04/2022

కన్నడ రాకింగ్ స్టార్ గా పిలవబడే యష్ "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా తో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. కన్నడలో మాత్రమే కాక ఈ సినిమా మిగతా భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో రికార్డులను సైతం బద్దలుకొట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు "కే జి ఎఫ్: చాప్టర్ 2" అనే సినిమా తెరకెక్కింది. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్ మరియు ట్రైలర్ లతోనే అంచనాలను మరింతగా పెంచిన ఈ సినిమా తాజాగా ఇవాళ అనగా ఏప్రిల్ 14, 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

"కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా ఎక్కడైతే ముగుస్తుందో "కే జి ఎఫ్: చాప్టర్ 2" అక్కడే మొదలవుతుంది. రాకీ కే జి ఎఫ్ నీ సొంతం చేసుకున్నాడు. కానీ కే జి ఎఫ్ మీద చాలా మందికి కన్ను ఉంది. అందులో వైకింగ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అధీరా (సంజయ్ దత్) కూడా ఒకరు. దీంతో రాఖీ మరియు అధీరా లకు మధ్య యుద్ధం మొదలవుతుంది. శ్రీనిధి శెట్టి ఈ గొడవలో ఎలా ఇన్వాల్వ్ అయింది? ప్రైమ్ మినిస్టర్ కి దీని కి మధ్య సంబంధం ఏంటి? రాకీ మరియు అధీర లలో ఎవరు గెలిచారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

రాకీ పాత్రలో మరెవరు సూట్ అవ్వరు అనే అంత అద్భుతంగా యష్ తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను కనబరిచారు. సినిమా మొత్తం తన అద్భుతమైన నటనతో తన భుజాలపై మోశారు యష్. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో యష్ పాత్ర మరింత ఇంటెన్స్ గా ఉన్నప్పటికీ అందులో సునాయాసంగా ప్రవేశించారని చెప్పుకోవచ్చు. సంజయ్ దత్ నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆధీరా పాత్రలో సంజయ్ దత్ పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మొదటి భాగం లాగానే ఇందులో కూడా శ్రీనిధి శెట్టి కి పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర దొరకలేదు కానీ నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రకాష్ర రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమా కోసం కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్ ల మీద బాగా దృష్టి పెట్టారు. సినిమా కొంచెం బాగానే ఉన్నప్పటికీ ప్రశాంత్ నీల్ నరేషన్ సెకండాఫ్ లో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కథను స్ట్రాంగ్ గా నే రాసుకున్న డైరెక్టర్ అంతే స్ట్రాంగా పాత్రలు మాత్రం డిజైన్ చేయలేకపోయారు అని చెప్పవచ్చు. రవి బస్సు రూట్ సంగీతం ఈ సినిమాకి ఆయువు పట్టు గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. ఇక 19 ఏళ్లకే ఎడిటర్ గా మారిన ఉజ్వల్ కులకర్ణి ట్రైలర్ కట్టుకునే మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు తాజాగా సినిమా కి కూడా ఉజ్వల్ నటన చాలా బాగా వర్కౌట్ అయింది ఇక సినిమా అక్కడక్కడా మాత్రమే బాగుందని తెలుస్తోంది.

బలాలు:

రాకీ నటన

మాస్ ఎలివేషన్లు

నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫీ

బలహీనతలు:

కథలో ఎమోషనలు బాగా తక్కువగా ఉండటం

ముఖ్య విలన్ పాత్ర వీక్ గా ఉండడం

ప్రెడిక్టబుల్ సన్నివేశాలు

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది కానీ కథ ఎస్టాబ్లిష్ చేయడంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ సినిమాలో వైఎస్పార్ కి అంతగా ఎమోషనల్ డెత్ లేకపోయినప్పటికీ ఆధీర ఎంట్రీ. అధీరా ట్రాక్ కొంత వరకు బాగానే అనిపించినప్పటికీ, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. "కే జి ఎఫ్" సాంగ్ సినిమాలలో సినిమా ఎన్ని విభేదాలు ఎదుర్కొన్నప్పటికీ కచ్చితంగా రికార్డుల వర్షం మాత్రం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ విషయంలో ప్రశాంత్ నీల్ మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా మొదటి హాఫ్ చాలా తొందరగా గడిచిపోయిన ఇప్పటికీ రెండవ భాగం మాత్రం బాగా సాగినట్లు గా అనిపిస్తుంది.

బాటమ్ లైన్:

"కే జీ ఎఫ్" స్థాయిని ఒక మోస్తరుగా పెంచిన "కే జి ఎఫ్ చాప్టర్ 2 "

Show Full Article
Print Article
Next Story
More Stories