Good Luck Sakhi Movie Review: గుడ్‌ లక్‌ సఖి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Good Luck Sakhi Movie Review
x

Good Luck Sakhi Movie Review: గుడ్‌ లక్‌ సఖి మూవీ రివ్యూ

Highlights

"మహానటి" సినిమా తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మన్మధుడు 2, మిస్ ఇండియా, పెంగ్విన్ సినిమా లో కనిపించింది కానీ ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు.

చిత్రం: గుడ్ లక్ సఖి

నటీనటులు: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రమాప్రభ, రాహుల్ రామకృష్ణ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్

నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి

దర్శకత్వం: నగేష్ కుకూనూర్

బ్యానర్: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్

విడుదల తేది: 28/01/2021

"మహానటి" సినిమా తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మన్మధుడు 2, మిస్ ఇండియా, పెంగ్విన్ సినిమా లో కనిపించింది కానీ ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇక తన ఆశలన్ని "గుడ్ లక్ సఖి" పైనే పెట్టుకుంది ఈ భామ. స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే అలరించిన ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చి తాజాగా ఇవాళ అనగా 28 జనవరి 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూద్దామా..

కథ:

సఖి (కీర్తి సురేష్) ఒక పల్లెటూరు అమ్మాయి. ఆమెను అందరూ దురదృష్టం గా భావిస్తూ ఉంటారు. అందుకే ఆమెను అందరూ "బ్యాడ్ లక్ సఖి" అని పిలుస్తూ ఉంటారు. మాజీ కల్నల్ జగపతి బాబు ఆ పల్లెటూర్లో స్పోర్ట్స్ బాగా వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్ చాంపియన్స్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. "బ్యాడ్ లక్ సఖి" అతని వద్ద ట్రైనీగా ఎలా మారింది? గోలి రాజు (ఆది పినిశెట్టి) తో ఆమె సంబంధం ఏంటి? సూరి (రాహుల్ రామకృష్ణ) పాత్ర ఈ కథను ఎలా మలుపు తిప్పింది? చివరికి ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

సినిమాలో కీర్తి సురేష్ నటన అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. డిఫరెంట్ లుక్ తో కీర్తి సురేష్ ఈ సినిమాలో తన నటనతో అందర్నీ అలరించింది. షార్ప్ షూటర్ గా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అని సినిమా చూస్తే తెలుస్తోంది. ఆది పినిశెట్టి తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఎప్పటిలాగానే జగపతి బాబు ఈ సినిమాలో కూడా తన నటనతో అందరినీ ఆకర్షించారు. కోచ్ పాత్రలో చాలా బాగా నటించారు. రమాప్రభ నటన ఈ సినిమాకి బాగానే ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. రాహుల్ రామకృష్ణ కామెడీ కూడా అక్కడక్కడా బాగానే పండింది. అంతే కాకుండా సినిమాలో రాహుల్ రామ కృష్ణ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికవర్గం:

డైరెక్టర్ నగేష్ కుకునూర్ కి ఇంతకుముందు కూడా స్పోర్ట్స్ డ్రామాలు తీసిన అనుభవం బాగానే ఉంది. అది ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే "గుడ్ లక్ సఖి" లో సోల్ లేదని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా చాలా సింపుల్ గా నేరేటివ్ చాలా స్లోగా సాగుతుంది. కథను మరింత ఆసక్తికరంగా మార్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ వారు అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యావరేజ్ గా అనిపిస్తుంది. పాటలు సంగతి పక్కన పెడితే నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. చిరంతన్ దాస్ అందించిన విజువల్స్ పర్వాలేదు అనిపించాయి.

బలాలు:

రన్ టైం తక్కువగా ఉండటం

స్పోర్ట్స్ కాన్సెప్ట్

నటీనటులు

బలహీనతలు:

స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడం

స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం

పాత్రలను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం

చివరి మాట:

స్పోర్ట్స్ డ్రామా అయినా సరే కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమా బాగుంటుంది. కానీ "గుడ్ లక్ సఖి" సినిమా లో అదే లేదు. ఆమె కష్టం అంతా బాగానే చూపించారు కానీ అవి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో ప్రేక్షకులు కథ మొత్తం సినిమాకి కనెక్ట్ అవ్వలేక పోతారు. ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ పాత్రలకు బాగానే ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ వారి పాత్రలు కూడా సినిమాకి అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. నగేష్ కుకునూర్ ఇంతకుముందు బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చేశారు కానీ తెలుగులో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. కనుక సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నగేష్ రైటింగ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. రన్ టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కథ ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా కూడా చాలా డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది.

బాటమ్ లైన్:

"గుడ్ లక్ సఖి" ఏమో కానీ "బోరింగ్ సఖి" అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories