logo
సినిమా రివ్యూ

Happy Birthday Movie Review: `హ్యాపీబర్త్ డే` మూవీ రివ్యూ..

Happy Birthday Telugu Movie Review | Tollywood
X

Happy Birthday Movie Review: `హ్యాపీబర్త్ డే` మూవీ రివ్యూ.. 

Highlights

Happy Birthday Movie Review: `హ్యాపీబర్త్ డే` మూవీ రివ్యూ..

Happy Birthday Movie Review:

చిత్రం: హ్యాపీ బర్త్ డే

నటీనటులు: లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, రాహుల్ రామకృష్ణ, గెటప్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, వైవా హర్ష, తదితరులు

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం

నిర్మాతలు: చిరంజీవి, హేమలత పెదమల్లు

దర్శకత్వం: రితేష్ రానా

బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 08/07/2022

"మత్తు వదలరా" సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రితేష్ రానా తాజాగా ఇప్పుడు మరొక క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "హ్యాపీ బర్త్డే" అనే ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సత్య, నరేష్ అగస్త్య, మరియు వెన్నెల కిషోర్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ తోనే బాగా ఆకట్టుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య తాజాగా ఇవాళ అనగా జులై 8, 2022న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

డిఫెన్స్ మినిస్టర్ రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) గన్ కి సంబంధించిన లా ని మార్చి ఇండియాలో పబ్లిక్ కి గన్స్ ని ఫ్రీగా దొరికేలా చేస్తారు. దీంతో ప్రతి ఒక్కళ్ళు గన్ వాడుతూ ఉంటారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో లైటర్ అనే హౌస్ కీపర్ (నరేష్ అగస్త్య) పని చేస్తు ఉంటాడు. అతని వల్ల కథ చాలా మలుపులు తిరుగుతుంది. మరోవైపు పసుపులేటి హ్యాపీ త్రిపాటి (లావణ్య త్రిపాఠి) పబ్ కి వెళ్ళగా లైటర్ కోసం వెతుకుతున్న వాళ్లు ఈమెను కిడ్నాప్ చేస్తారు. చివరికి కథ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

లావణ్య త్రిపాఠి కి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. తన పాత్రకి లావణ్య పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఇన్ని షేడ్స్ ఉన్న పాత్రలో ఇప్పటిదాకా లావణ్య త్రిపాఠి కనిపించలేదు కాబట్టి ఈ సినిమాలో తన నటన బాగా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. కమెడియన్ సత్య ఈ సినిమాకి హై లైట్ గా చెప్పుకోవచ్చు. సినిమా లో ఉన్న కామెడీ సన్నివేశాలు అన్నిట్ల్లో సత్య కామెడీ చాలా అద్భుతంగా పండింది. వెన్నెల కిషోర్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. నరేష్ అగస్త్య కూడా తన పాత్రకి బాగా సెట్ అయ్యారు. గుండు సుదర్శన్ కూడా చాలా బాగా నటించారు. రాహుల్ రామకృష్ణ, వైవా హర్ష, విద్యుల్లేఖ రామన్ తదితరుల కామెడీ కూడా అక్కడక్కడ బాగానే పండింది. మిగతా నటీనటులు తమ పాత్రలు పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

మొదటి సినిమాతోనే మంచి మార్క్ ను సెట్ చేసిన రితేష్ రానా ఈ సినిమాతో మాత్రం అంతగా మప్పించలేకపోయారని చెప్పుకోవచ్చు. "మత్తు వదలరా" కి లాగానే ఈ సినిమా కూడా మొత్తం కామెడీ ట్రాక్ లోనే నడుస్తుంది. అయితే ఈసారి కామెడీ మొత్తం ఫ్యూచరిస్టిక్ సెట్ లో జరగడం వలన కథ చాలా అన్ రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఇక రితేష్ రానా నెరేషన్ కూడా అంతంత మాత్రం గానే అనిపిస్తుంది. చాలామంది కమెడియన్లతో మీమ్ రిఫరెన్స్ లతో అక్కడక్కడ కామెడీని బాగానే పండించారు కానీ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోలేక పోయారు. కాలభైరవ అందించిన సంగీతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. పాటల సంగతి పక్కన పెడితే కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రాఫి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా స్లో మోషన్ షాట్లు చాలా బాగా వచ్చాయి.

బలాలు:

కొన్ని కామెడీ సన్నివేశాలు

సత్య

వెన్నెల కిషోర్

నేపథ్య సంగీతం

బలహీనతలు:

ఎడిటింగ్

స్లో నేరేషన్

సెకండ్ హాఫ్

చివరి మాట:

సినిమా చాలా బాగా మొదలవుతుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే చాలావరకు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. కానీ కొన్ని చాప్టర్లు మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ప్రీ ఇంటర్వెల్లో సినిమా కొంచెం స్లో అయినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ పరవాలేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. సత్య మరియు వెన్నెల కిషోర్ మధ్య ఒక కామెడీ ట్రాక్ తప్ప సెకండ్ హాఫ్ లో పెద్దగా చెప్పుకోదగ్గ కామెడీ సన్నివేశాలు కూడా ఏమీ లేవు. పైగా కొన్ని కొన్ని చోట్ల కామెడీ డోస్ బాగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది.

బాటమ్ లైన్:

"హ్యాపీ బర్త్ డే" కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రమే హ్యాపీ గా చూడదగ్గ సినిమా.

Web TitleHappy Birthday Telugu Movie Review | Tollywood
Next Story