logo
సినిమా రివ్యూ

Ghani Movie Review: వరుణ్ తేజ్ 'గని' మూవీ రివ్యూ..

Ghani Movie Review Telugu | Telugu Movie News
X

 Ghani Movie Review:వరుణ్ తేజ్ ' గని' సినిమా రివ్యూ

Highlights

Ghani Movie Review:వరుణ్ తేజ్ ' గని' సినిమా రివ్యూ

Ghani Movie Review:

చిత్రం: గని

నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా, నరేష్, తనికెళ్ళ భరణి, తదితరులు

సంగీతం: ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: జార్జ్ సీ విలియమ్స్

నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ

దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి

బ్యానర్: రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ

విడుదల తేది: 08/04/2022

ఈ మధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో కలిసి "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ట్రైలర్ లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా ఇవ్వాళ అనగా ఏప్రిల్ 8, 2022 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎంతా వరకు మెప్పించారో చూసేద్దామా..

కథ: గని (వరుణ్ తేజ్) ఒక బాక్సర్. తన తండ్రి ఒకసారి బాక్సింగ్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ తీసుకొని దొరికిపోయి చీటర్ గా మారిపోయారు. తన తండ్రి కున్న చెడ్డపేరు తో పోరాడి తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకొని బాక్సింగ్ టోర్నమెంట్ను గెలవాలి అనే తన ఆశయాన్ని గని నెరవేర్చుకున్నాడా లేదా అనేది సినిమా. కానీ గని వాళ్ళ అమ్మ (నదియా) కు గని బాక్సర్ అవ్వడం ఇష్టం లేదు. కనుక ఆమె ఎప్పటికప్పుడు గని కి అభ్యంతరాలు పెడుతూ ఉండేది. వీటన్నిటినీ దాటుకొని గని తన కల ఎలా నెరవేర్చుకున్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు: బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా బాగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్ట పడినట్లు తెలుస్తోంది. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ వరుణ్ తేజ్ ఈ సినిమాని తన భుజాలపై తీసుకెళ్లాడని చెప్పుకోవచ్చు. సాయి మంజ్రేకర్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. ఈ సినిమాలో చాలా వరకు తెలిసిన మొహాలు ఉండటం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఉపేంద్ర అ పాత్ర కాసేపే ఉన్నప్పటికీ మంచి ఇంపాక్ట్ ను ఇస్తుంది. జగపతిబాబు విలన్ పాత్రను బాగానే మెప్పించారు. నరేష్ బాక్సింగ్ కోచ్ గా పర్వాలేదనిపించారు. నదియా నవీన్ చంద్ర ల నటన కూడా చాలా బాగుంది.

సాంకేతిక వర్గం: దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమా కోసం ఒక సాదాసీదా కథను ఎంచుకొన్నారు. సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా కథ అలా నెమ్మదిగా ముందుకు వెళ్ళి పోతూ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలావరకు సన్నివేశాలను డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. మొదటి సినిమా తో కిరణ్ కొర్రపాటి ఏమాత్రం మెప్పించలేదని చెప్పుకోవాలి. ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. టైటిల్ సాంగ్ తప్ప ఈ సినిమాలో మిగతా ఏ పాటలు పెద్దగా మెప్పించలేదు. నిర్మాణ విలువలు ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి విలియమ్స్ మంచి విజువల్స్ అందించారు. బాక్సింగ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

టైటిల్ సాంగ్

క్లైమాక్స్

నిర్మాణ విలువలు

బలహీనతలు:

రొటీన్ కథ

రైటింగ్

ప్రాధాన్యత లేని పాత్రలు

ట్విస్ట్ లు లేకపోవడం

అవుట్ డేటెడ్ కథ

చివరి మాట: సినిమా మొదలైన 15 నిమిషాలు బాగానే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత నుంచి కిరణ్ కొర్రపాటి రైటింగ్ చాలా నెమ్మదిస్తుంది. వరుణ్ తేజ్ మరియు సాయి మంజ్రేకర్ ల మధ్య ప్రేమకథ కూడా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటికే ఇలాంటి ప్రేమ కథలు చాలానే చూసినట్లు అనిపిస్తుంది. తల్లి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ ని బాగానే పెట్టారు కానీ అందులో కూడా కొత్తదనం లేదు. సెకండ్ హాఫ్ కూడా యావరేజ్ గా మొదలైనప్పటికీ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చాలావరకూ సన్నివేశాలు అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా గని అన్ని సినిమాలను కలిపిన ఒక నార్మల్ కథగా మిగిలిపోయింది.

బాటమ్ లైన్: మంచి నటీనటులు, నిర్మాణ విలువలు ఉన్నా బోరింగ్ సినిమా "గని".

Web TitleGhani Movie Review Telugu | Telugu Movie News
Next Story