'ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్)‌' మూవీ రివ్యూ

f2
x
f2
Highlights

'పటాస్', 'సుప్రీం', 'రాజాదిగ్రేట్' వంటి మూడు సూపర్ హిట్ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో మన ముందుకు వచ్చేశాడు.

చిత్రం: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

ఎడిటింగ్‌: బిక్కిని తమ్మిరాజు

నిర్మాత: దిల్‌రాజు

దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

విడుదల: 12/01/2019

'పటాస్', 'సుప్రీం', 'రాజాదిగ్రేట్' వంటి మూడు సూపర్ హిట్ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో మన ముందుకు వచ్చేశాడు. ఈ మల్టీస్టారర్ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరియు మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలు పోషించారు. వెంకీ సరసన తమన్నా హీరోయిన్ గా కనిపించగా, మెహరీన్ పిర్జాదా వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు. సంక్రాంతి విడుదలల్లో ఆఖరి సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇవాళ అనగా జనవరి 12 తారీకు తేదీన విడుదలైంది. సంక్రాంతి అల్లుళ్లుగా వెంకీ, వరుణ్ ప్రేక్షకులను బాగా అలరిస్తారని దర్శక నిర్మాతలు విశ్వసిస్తున్నారు. ఈ సినిమా నిజంగానే ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూసేద్దామా..

క‌థ:

హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తున్న వెంకీ (వెంక‌టేష్‌) హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి తరువాత వెంకీ జీవితం ఒక్క‌సారిగా మారిపోతుంది. భార్య‌, అత్త త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంకీ ని ఫ్రస్ట్రేట్ చేస్తాయి. మరోవైపు వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) హ‌నీని ఇష్ట‌ప‌డ‌తాడు. అత్తింటి ప‌రిస్థితులు తెలుసుకబట్టి వెంకీ పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌ ను హెచ్చ‌రిస్తాడు. కానీ వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్టించుకోకుండా హ‌నీని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఈ అక్కాచెల్లెళ్ల మధ్యలో తోడ‌ళ్లులు న‌లిగిపోతుంటారు. ప‌క్కింటి వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) స‌ల‌హా మేరకు ఇద్ద‌రూ యూర‌ప్ పారిపోతారు. ఇది తెలుసుకున్న హారిక‌ హ‌నీలు కూడా యూర‌ప్ వెళ్తారు. ఇక ఈ నలుగురూ ప్ర‌కాష్‌రాజ్ ఇంట్లో వచ్చి పడతారు. ఇంత‌కీ వీళ్లు యూర‌ప్ లో ప‌్ర‌కాష్‌రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగారు? వెంకీ, వరుణ్ భార్యలకు దూరమవుతారా లేక వారి మనసులను మార్చారా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే.

నటీనటులు:

వెంక‌టేష్ చాలా కాలం త‌ర్వాత మళ్ళీ తన స్థాయికి త‌గ్గ కామెడీ పాత్ర‌లో క‌నిపించడం విశేషం. ఇంతకుముందు ఎంత న‌వ్వించారో ఈ సినిమాలో కూడా అంతే బాగా న‌వ్వించారు. ఆయ‌న పాత్రే సినిమాలో హైలైట్‌ గా పరిగణించచ్చు. వ‌రుణ్ తేజ్ కూడా బాగా న‌టించాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడిన వరుణ్ గొంతు కృత్రిమంగా అనిపించింది. మొట్టమొదటిసారిగా ఇలాంటి కామెడీ పాత్ర తీసుకున్నాడు వరుణ్. అంతే కాక వెంకీ స్థాయిలో తన పక్కన నటించడం ఆషామాషీ కాదు కాని వరుణ్ చాలా బాగా మెప్పించాడు. త‌మ‌న్నా చాలా అందంగా ఉండటమే కాక నటన పరంగా కూడా బాగుంది. మెహ‌రీన్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌ పాత్రలు సినిమాలో కీలకం. ఇద్దరు వారి పాత్రలకు న్యాయం చేశారు. వెంక‌టేష్ చాలా కాలం త‌ర్వాత త‌న స్థాయికి త‌గ్గ వినోదం అందించే పాత్ర‌లో క‌నిపించారు. పాత చిత్రాల్లో వెంక‌టేష్ ఎలా న‌వ్వించారో ఈ సినిమాలో అలాగే న‌వ్వించారు. ఇద్ద‌రు తోడ‌ల్లుళ్ల ఫ్ర‌స్ట్రేష‌న్ అనే క‌న్నా, వెంక‌టేష్ ఫ్ర‌స్ట్రేష‌న్ అంటే బాగుంటుందేమో! ఎందుకంటే ఆయ‌న పాత్రే సినిమాలో హైలైట్‌. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడాడు. అయితే, ఆ యాస వ‌రుణ్‌కు కృత్రిమంగా అనిపించింది. త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి క‌థానాయిక‌గా క‌నిపించింది. మెహ‌రీన్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌ పాత్రలు సినిమాలో కీలకం. వారిద్దరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. రఘుబాబు, నాజ‌ర్‌, అన్న‌పూర్ణ‌, వై.విజ‌య, ప్రియదర్శి కూడా బాగానే న‌వ్వులు పంచారు.

సాంకేతిక వర్గం:

ఇద్ద‌రు భార్య బాధితుల జీవితాలను తీసుకుని, వాటిపై కొంచెం కొత్తగా కథ అల్లి, దానికి కామెడీ, ఎంటర్టైన్మెంట్ దట్టంగా జోడించి మన ముందుకు తీసుకువచ్చాడు అనిల్ రావిపూడి. ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే స్క్రీన్‌పై నవ్వుతెప్పించేలా క‌నిపిస్తాయి. 'నువ్వు నాకు న‌చ్చావ్‌', 'మ‌ల్లీశ్వ‌రీ' లాంటి చిత్రాల్లో లాగా వెంక‌టేష్ మళ్ళీ ఇన్నాళ్లకు ఇలాంటి పాత్రతో మన ముందుకు వచ్చాడు. తొలి స‌గం పూర్తిగా వినోదాన్ని పంచింది. ప్ర‌తి సీన్‌ తో ప్రేక్షకులలో న‌వ్వుల‌ పువ్వులు పూయించాడు అనిల్. ఇక యూరోప్ లో సాగిన ద్వితీయార్ధం పర్వాలేదు అనిపించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం అంతగా మెప్పించలేదు. ఎదో ఒకటి రెండు పాట‌లు బాగున్నాయి కానీ సంగీతం ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. కెమెరా ప‌రంగా సినిమా చాలా బావుంది. సమీర్ రెడ్డి అందించిన విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. బిక్కిన తమ్మిరాజు ఎడిటింగ్ బాగానే ఉంది.

బ‌లాలు:

వెంక‌టేష్ కామెడీ

ప్ర‌థ‌మార్ధం

డైలాగ్‌లు

ఎంటర్టైన్మెంట్

బ‌ల‌హీన‌త‌లు:

ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

దేవి శ్రీ సంగీతం

క‌థ‌ బలహీనంగా ఉండటం

చివరి మాట:

కథ పక్కన పెడితే, సినిమా లో కామెడీ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో లాగానే అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. కథ, సంగీతం బలహీనంగా ఉన్నప్పటికి హాయిగా కూర్చుని నవ్వుకోవాలంటే ఈ సినిమా చూసేయండి.

బాటమ్ లైన్:

సంక్రాంతి అల్లుళ్ళు గట్టిగానే నవ్వించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories