అలా అలా సా..గిన డియర్ కామ్రేడ్!

అలా అలా సా..గిన డియర్ కామ్రేడ్!
x
Highlights

అర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించి.. గీతా గోవిందంతో స్టార్ గా ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ తాజా సినిమా డియర్ కామ్రేడ్. భారత్ కమ్మ ఈ సినిమాతో దర్శకుడిగా...

అర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించి.. గీతా గోవిందంతో స్టార్ గా ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ తాజా సినిమా డియర్ కామ్రేడ్. భారత్ కమ్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజికి.. మార్కెట్ విలువకూ ఈ సినిమా ఓ లెక్క ఇస్తుందని భావిస్తున్నారు అందరూ. ఈ సినిమా మీద ఇటు విజయ్, అటు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇండస్ట్రీ కూడా ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈరోజు ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాల్ని అందుకుందా? విజయ్ ఆశల్ని నిలబెట్టిందా..?

కథ ఇదీ..

చైతన్య (విజయ్) కాకినాడ కాలేజీలో చదువుతుంటాడు. విప్లవభావాలు ఎక్కువ. కోపమూ ఎక్కువే. దీంతో చాలా మందితో గొడవలు పెట్టుకుంటాడు. ఇక లిల్లీ (రాష్మిక మందన్న) రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్. కాకినాడ స్నేహితురాలి పెళ్లిలో చైతన్యతో ప్రేమలో పడుతుంది. అయితే, చైతన్య కోపం.. గొడవలతో బ్రేక్ అప్ అవుతుంది. దీంతో చైతన్య పిచ్చివాడైపోయి కుటుంబానికి దూరంగా మూడేళ్లు తిరుగుతూ గడిపేస్తాడు. ఈ క్రమంలో మెల్లగా కోలుకుని హైదరాబాద్ చేరుకుంటాడు. ఇక్కడ మళ్లీ లల్లీ కలుస్తుంది. అయితే, ఆమె తీవ్రమైన మానసిక ఇబ్బందుల్లో ఉంటుంది. దాంతో ఆమెకు తోడుగా ఉండి ఆమెను కోలుకునేలా చేస్తాడు. తరువాత ఆమె ఎందుకు అలా అయిందో తెలుస్తుంది. అప్పుడు చైతన్య ఏం చేశాడు? ఎలా లిల్లీకి సహాయపడ్డాడు అనేదే మిగిలిన సినిమా..

ఎవరెలా చేశారంటే..

వైవిధ్యమున్న పాత్రలో విజయ్ తనదైన శైలిలో మెప్పించాడు. కాలేజీ స్టూడెంట్.. లవర్ బాయ్.. విరహంలో ఉన్న యువకుడు ఇలా అన్నిరకాల షేడ్స్ లోనూ చక్కని ప్రతిభ చూపించగలిగాడు. మరో సారి అర్జున్ రెడ్డి చూసిన ఫీలింగ్ కచ్చితంగా వస్తుంది. ఇక రష్మిక నటనలో మరో మెట్టు ఎక్కింది. చాలాబాగా చేసింది. వీరిద్దరి నటనే సినిమాని ఒక స్థాయిలో నిలబెట్టిందంటే అతిశయోక్తి కాదు. మిగిలిన వారంతా ఫర్వాలేదు.

ఇలా వుంది..

ఒక విప్లవభావాలున్న యువకుడు ప్రేమలో పడతే అతని భావాలకు ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ.. మహిళా క్రికెట్ అసోసియేషన్ వేధింపులు ప్రధానంగా సినిమాలో కనిపిస్తాయి. ప్రతి వ్యక్తీ జీవితానికి ఒక కామ్రేడ్ అండగా ఉండాలని చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. కథకు సంబంధించినంత వరకూ మంచి మార్కులే వేయొచ్చు. ఎటొచ్చీ కథనంలోనే లోపం కనిపించింది. చాలా మెల్లగా సినిమా నడుస్తుంది. కొత్తదనం కనిపించదు. అన్ని సీన్లూ ఎక్కడో చూసిన సీన్లలా అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు.

మొదటి అర్థ భాగం మొత్తం హీరో, హీరోయిన్ లవ్ ఇలా నడిపించేశాడు. రెండో భాగంలో అసలు కథని లాగుతూ చూపించాడు. దీంతో కొంత అసహనం ప్రేక్షకుడికి కలుగుతుంది. కొన్ని సీన్ల వరకూ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నేరేషన్ పరంగా జాగ్రత్తలు తీసుకోక పోవడం ఇబ్బంది. సినిమాకి పాటలు ప్రాణం. జస్టిన్ ప్రభాకర్ సంగీతం బావుంది. నేపధ్య సంగీతం చాలా బావుంది. కొన్ని సీన్లలో సంగీతం ప్రాణం పోసింది. కేరళ అందాలతో పాటు నార్త్‌లో తెరకెక్కించిన రోడ్‌ సీన్స్‌ విజువల్స్‌ కూడా మెప్పిస్తాయి. ఎడిటర్‌ కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ప్రతీ సన్నివేశం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories