Avatar 2: 'అవతార్‌ 2' మూవీ రివ్యూ.. అద్భుతమైన విజువల్స్ తో..

Avatar: The Way of Water Movie Review
x

Avatar 2: ‘అవతార్‌ 2’ మూవీ రివ్యూ.. అద్భుతమైన విజువల్స్ తో..

Highlights

Avatar 2: ‘అవతార్‌ 2’ మూవీ రివ్యూ.. అద్భుతమైన విజువల్స్ తో..

చిత్రం: అవతార్: ది వే ఆఫ్ వాటర్

నటీనటులు: సామ్ వర్తింగ్ టన్, జో సల్దాన, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూరే, తదితరులు

సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్

సినిమాటోగ్రఫీ: రస్సెల్ కార్పెంటర్

నిర్మాతలు: జేమ్స్ కామెరూన్, జోన్ లాందు

దర్శకత్వం: జేమ్స్ కామెరూన్

బ్యానర్: లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్, టీజీఎస్ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 16/12/2022

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "అవతార్ 2". జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో 2009లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ సినిమా "అవతార్" కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా గురించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచే లాగా ఎదురు చూశారు. ఇన్నాళ్ల వాళ్ళ ఎదురు చూపులి ఫలించి అవతార్ సినిమాకి సీక్వెల్ అయిన "అవతార్: ది వే ఆఫ్ వాటర్" ఇవాళ అనగా డిసెంబర్ 16, 2022 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం తదితర భాషల్లో భారీ స్థాయిలో విడుదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచి సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

2154 సంవత్సరం లో చంద్ర గ్రహం పరిమాణంలో ఉండే "పండోరా" అనే గ్రహం మీదకి అమెరికా సైన్యం నుండి జాక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) నేవీకి చెందిన నేత్రీతో ఎలా ప్రేమలో పడి అమెరికా సైన్యంపై తిరుగుబాటు చేస్తాడు. ఇది అవతార్ మొదటి భాగం కథ. ఇప్పుడు రెండవ భాగంలో జేక్ సల్లీ, నేతిరి కి నెటెయమ్, లోక్ అనే కొడుకు, టక్ అనే కూతురు, కిరి అనే పెంపుడు కూతురు ఉంటారు. వారితో పాటే స్పైడర్ అనే మానవబాలుడు కూడా ఉంటాడు. పండోరాను ఆక్రమించుకోవాలని అనుకున్న మైల్స్ క్వారిచ్ కొడుకే స్పైడర్. పండోరా ప్రకృతివనరులపై కన్నేసిన కొందరు ఆ గ్రహంపైకి దండెత్తుతారు. వారి నాయకుడు క్వారిచ్ పై జేక్ దాడికి సిద్ధమవుతాడు. మరోవైపు క్వారిచ్ మనుషులు జేక్ పిల్లలను బంధిస్తాడు. జేక్ తన కుటుంబాన్ని విడిపించుకొని మెట్కాయినా వెళ్లగా ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న టోనోవరి, అతని భార్య రోనాల్ ల కూతురు సిరేయాతో అనుబంధం పెంచుకుంటాడు. కానీ ఇది ఆమె అన్న ఓనంగ్ కు నచ్చదు. అప్పుడు ఓనంగ్, లోక్ ను తీసుకువెళ్ళి భయంకరమైన జలచరాలుండే చోట పడేస్తాడు కానీ లోక్ ను పాయకన్ అనే ఒక జలచరం కాపాడుతుంది. జేక్ ను చంపాలి అనుకున్న క్వారిచ్ ఏం చేశాడు? జేక్ కొత్త ప్రాంతంలో ఎలా ఉండగలిగాడు? జేక్ కొడుకు లోక్ కి ఏమైంది? చివరకు ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

చాలావరకు పాత్రలు మొదటి భాగంలో ఉన్నవాళ్లే రెండవ భాగంలో కూడా కనిపించారు ఇక ముఖ్యంగా మరియు ప్రధాన పాత్రలు పోషించిన సామ్ వర్తింగ్ టన్, జో సల్దాన ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించారు. వారి కూతురు పాత్రలో సిగోర్నీ వీవర్ నటన కూడా ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తుంది. స్టీఫెన్ లాంగ్ కూడా క్వారీచ్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. చాలాకాలం తర్వాత టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ నువ్వు వెండి తెర మీద చూడటం. ఆమె నటన కూడా సినిమాకి బాగానే ప్లస్ అయింది. క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూరే కూడా తమ పాత్రలో బాగానే నటించారు. స్పైడర్ పాత్ర పోషించిన నటుడు కూడా తన నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నారు. మిగతా నటీనటులు కూడా సినిమాలో చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

అవతార్ సినిమా కోసం దర్శకుడు జేమ్స్ కామరూన్ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారని చెప్పుకోవాలి. దీనికోసం వాడిన కంప్యూటర్ గ్రాఫిక్స్, 3d టెక్నాలజీ ప్రేక్షకులను కచ్చితంగా అబ్బురపరుస్తాయి. సినిమా కథా కథనం బాగానే ఉన్నాయి. అవి పక్కన పెడితే అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తాయి. వెండి తెర మీద కూడా ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. మొదటి భాగానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని కూడా అద్భుతమైన సాంకేతిక విలువలతో సినిమాని తెరకెక్కించారు. సినిమాని జేమ్స్ కెమెరూన్ అందించిన ఒక విజువల్ ట్రీట్ గా చెప్పుకోవచ్చు. సైమన్ ఫ్రాంగ్లన్ అందించిన సంగీతం కూడా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇక సినిమాటోగ్రాఫర్ రస్సల్ కార్పెంటర్ పనితనం సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ అంతంత మాత్రమే అనిపిస్తుంది. చాలా వరకు కొన్ని సన్నివేశాలను తీసేసి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది.

బలాలు:

సాంకేతిక విలువలు

అద్భుతమైన విజువల్స్

భారతీయతకు దగ్గరగా ఉండే కథ

'టైటానిక్' నటి కేట్ విన్స్లెట్

బలహీనతలు:

ఫస్ట్ పార్ట్ చూసిన వారికే సినిమా అర్థమవుతుంది.

సినిమా నిడివి పెద్దగా ఉండడం

మొదటి అరగంట

చివరి మాట:

సినిమా రన్ టైం మూడు గంటల 12 నిమిషాలు అయినప్పటికీ సినిమాలో ఉన్న అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కొట్టించకుండా చేస్తాయి. అయితే సినిమా చాలా స్లోగానే మొదలవుతుంది. ముఖ్యంగా మొదటి అరగంట చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ కథ మొదలైన తర్వాత మాత్రం కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ చాలా వరకు స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే వాడుకున్నారు డైరెక్టర్. ఇంటర్వెల్ కి ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు అవసరం లేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టించకుండా ఆసక్తిగా సాగుతుంది. అయితే చాలా వరకు కదా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది కానీ వెండి తెర మీద కనిపించే అద్భుతమైన విజువల్స్ కథ ను సైతం డామినేట్ చేశాయి. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఓవరాల్ గా అవతార్ 2, అవతార్ 1 ఉన్నంత ఫ్రెష్ గా లేకపోయినప్పటికీ గ్రాఫిక్స్ పరంగా మాత్రం బాగానే ఉందని చెప్పుకోవచ్చు.

బాటమ్ లైన్:

"అవతార్: ది వే ఆఫ్ వాటర్" అద్భుతమైన విజువల్స్ తో అబ్బురపరిచే సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories