Hero Movie: హీరో మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Ashok Gallas Hero Movie Review
x

Hero Movie: హీరో మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Hero Movie: హీరో మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: హీరో

నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్య తదితరులు

సంగీతం: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: సమీర్

నిర్మాత: పద్మావతి గల్లా

దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టీ

బ్యానర్: అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్

విడుదల తేది: 15/01/2021

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు జయదేవ గల్లా తనయుడైన అశోక్ గల్లా ఇప్పుడు "హీరో" అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం తాజాగా ఇవాళ అనగా జనవరి 15 2022న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

అర్జున్ (అశోక్ గల్లా) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. చిన్నప్పట్నుంచి సినిమా హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు సుబ్బు (నిధి అగర్వాల్) మరియు అతని ఆమె తండ్రి జగపతిబాబు అర్జున్ వాళ్ళ పక్కింట్లో ఉంటారు. ఒకసారి అర్జున్ కి కొరియర్ ద్వారా ఒక గన్ దొరుకుతుంది. అది ఎవరు ఎవరి కోసం పంపించారు అని అర్జున్ వెతకటం మొదలు పెడుతూ ముంబై మాఫియా దాకా వెళ్తాడు. అప్పట్నుంచి అర్జున్ మరియు ముంబై మాఫియా ల మధ్య జరిగిన కథే ఈ సినిమా. మధ్యలో జగపతిబాబు ఫ్లాష్బ్యాక్ కథకి ట్విస్ట్ గా మారుతుంది. చివరికి ఏమైంది? అర్జున్ కి గన్ పంపించింది ఎవరు? అసలు జగపతి బాబు ఎవరు? అతనికి ముంబై మాఫియా కి మధ్య సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

మొదటి సినిమా అయినప్పటికీ అశోక్ గల్లా చాలా ఎనర్జిటిక్గా నటించి తన పాత్రకి న్యాయం చేశాడు. లుక్స్ పరంగా కూడా మంచి మార్కులే వేయించుకున్నాడు. అశోక్ కి నటనకి అంత స్కోప్ లేని పాత్ర దొరికినప్పటికీ కామెడీ తో బాగానే అలరించాడు. నిధి అగర్వాల్ పాత్ర సినిమాలో పెద్దగా ఏమీ స్కోప్ ఉండదు అయితే తెరపై కనిపించే అంతసేపు అందంగా కనిపిస్తూ తన అభినయంతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ కి కూడా అంత మంచి పాత్ర కాకపోయినప్పటికీ తన కామెడీ సినిమాకి బాగానే ప్లస్ అయింది. సత్య నటన పర్వాలేదు అనిపిస్తుంది. జగపతి బాబు తన పాత్రకు ప్రాణం పోశారు అని చెప్పుకోవచ్చు. కానీ ఆయనకి వచ్చిన డబుల్ షేడెడ్ రోల్ అంతగా సెట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం:

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కథని కామెడీ తో ముందుకు తీసుకు వెళ్దామని ట్రై చేశాడు. కానీ ఫస్టాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండటం సినిమాకి మైనస్ పాయింట్ గా మారింది. కథలో కూడా అంత పెద్ద ట్విస్టులు లేకపోవడం ప్రేక్షకులకు కొంచెం బోర్ కొట్టిస్తుంది. ఒక చిన్న పాయింట్ చుట్టూ అంత పెద్ద సినిమా కథని నడపడం వల్ల చాలావరకూ సన్నివేశాలు డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంటాయి. ఒకటి రెండు పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయి. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది.

బలాలు:

సింపుల్ కథ, స్క్రీన్ ప్లే

కొన్ని పాటలు

నిర్మాణ విలువలు

అక్కడక్కడా కామెడీ

బలహీనతలు:

రొటీన్ గా అనిపించే కథ

కొన్ని డ్రాగ్ సన్నివేశాలు

సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు

చివరి మాట:

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా కామెడీ తోనే నడుస్తుంది. ఇక అసలు కథ సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. అయితే సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు డ్రాగ్ చేసినట్లు అనిపిస్తాయి. కొంతమంది స్టార్ ల రిఫరెన్స్ బాగానే పండింది అని చెప్పుకోవచ్చు. కానీ కథ అంత ఆకట్టుకునే విధంగా లేదు. సినిమా హీరో గా అవుదామని అనుకునేవాడు మాఫియాతో లింక్ అవ్వడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు బాగానే అనిపించినప్పటికీ స్ట్రాంగ్ కథ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. "హీరో" సినిమా ఒక సింపుల్ కథ తో చిన్న చిన్న ట్విస్టులతో సాగే కామెడీ సినిమా.

బాటమ్ లైన్:

"హీరో" తో హీరోగా పరిచయం అయిన అశోక్ గల్లా తన పర్ఫార్మెన్స్ తో పర్వాలేదు అనిపించి మంచి మార్కులే కొట్టేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories