Anubhavinchu Raja: 'అనుభవించు రాజా' మూవీ రివ్యూ

Anubhavinchu Raja Movie Review
x

Anubhavinchu Raja: ‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ

Highlights

Anubhavinchu Raja: ‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ

చిత్రం: అనుభవించు రాజా

నటీనటులు: రాజ్ తరుణ్, కషిష్ ఖాన్, సుదర్శన్, అజయ్, పోసాని కృష్ణ మురళి, తదితరులు

సంగీతం: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్

నిర్మాత: సుప్రియ యార్లగడ్డ, ఆనంద్ రెడ్డి

దర్శకత్వం: శ్రీనివాస్ గావిరెడ్డి

బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్

విడుదల తేది: 26/11/2021

"ఉయ్యాల జంపాల", "సినిమా చూపిస్తా మామ", "కుమారి 21ఎఫ్" వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో రాజ్ తరుణ్. తన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించే రాజ్ తరుణ్ ఈ ఏడాది విడుదలైన "పవర్ ప్లే" సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు తాజాగా "అనుభవించు రాజా" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రాజ్ తరుణ్. కశిష్ ఖాన్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్న ఈ సినిమాలో అజయ్, సుదర్శన్, పోసాని కృష్ణమురళి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఇవాళ అనగా నవంబర్ 26, 2021 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఉందో మెప్పించిందో చూసేద్దామా..

కథ:

రాజ్ తరుణ్ ఒక ఐటీ కంపెనీ కి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ ఉంటాడు. తను పుట్టి పెరిగిన ఊరి లో తనకి తాతల ఆస్తి ఉన్నప్పటికీ అవన్నీ వదులుకుని వచ్చి హైదరాబాద్ లో ఒక సెక్యూరిటీ గార్డుగా పని చేయాల్సిన అవసరం తనకి ఏంటి? అసలు హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది? తన ఆస్తి ఎవరి ఆధీనంలో ఉంది? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

చాలాకాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెన్త్ కామెడీ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజ్ తరుణ్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు రాజ్ తరుణ్. డెబ్యూ సినిమా అయినప్పటికీ కషిశ్ ఖాన్ వెండితెరపై చాలా బాగా కనిపించింది. తన పాత్రతో ఒదిగిపోయి చాలా బాగా నటించింది. మొదటి సినిమా అయినప్పటికీ నటనతో మరియు అందం తో మంచి మార్కులే వేయించుకుంది. అజయ్ నటన ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. సుదర్శన్ కామెడీ ఈ సినిమాలో హైలైట్ గా చెప్పుకోవచ్చు. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికవర్గం:

దర్శకుడు శ్రీనివాస్ గావిరెడ్డి ఈ సినిమా కోసం ఒక మంచి కథని ఎంచుకున్నారు. ముఖ్యంగా సిచ్యువేషనల్ కామెడీ వల్ల సినిమా చాలా సాఫీగా సాగిపోతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథని కూడా చాలా బాగా చూపించారు. కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ సినిమాలో దట్టంగా ఉన్నప్పటికీ నెరేషన్ మాత్రం స్లోగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సంగీతం మరియు నేపధ్య సంగీతం చాలా బాగున్నాయి. ఒకటి రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమాటోగ్రఫీకి కూడా మంచి మార్కులు వేయచ్చు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

కథ, స్క్రీన్ ప్లే

నటీనటులు

నేపథ్య సంగీతం

బలహీనతలు:

క్లైమాక్స్

సెకండ్ హాఫ్

చివరి మాట:

సినిమా మొత్తం సిచ్యువేషనల్ కామెడీనే ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా మొదలైన సినిమా ఫస్టాఫ్ ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత కథ బాగా స్లో అయిపోయినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కామెడీ అంతగా లేకపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ లో కూడా సన్నివేశాలని రష్ చేసినట్లు అనిపిస్తుంది. అయితే సినిమాలోని ఎంటర్టైన్మెంట్ కోసమైనా సినిమాని ఒకసారి చూసేయొచ్చు.

బాటమ్ లైన్:

"అనుభవించు రాజా" అంటూ ప్రేక్షకులను బాగానే అలరించిన రాజ్ తరుణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories