'ఏబీసీడీ' మూవీ రివ్యూ

ఏబీసీడీ మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: ఏబీసీడీ నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, మాస్టర్ భరత్, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్ తదితరులు సంగీతం: జుడా శాండీ ...

చిత్రం: ఏబీసీడీ

నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, మాస్టర్ భరత్, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్ తదితరులు

సంగీతం: జుడా శాండీ

ఛాయాగ్రహణం: రామ్

ఎడిటింగ్‌: నవీన్ నూలి

నిర్మాతలు: మధురా శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

దర్శకత్వం: సంజీవ్ రెడ్డి

బ్యానర్: మధురా ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేదీ: 17/05/2019

గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లు శిరీష్ ఈ మధ్యనే 'ఒక్క క్షణం' సినిమా తో మరొక ఫ్లాప్ ను అందుకున్నాడు. ఈసారి ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అయినా 'ఏ బి సి డి' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మలయాళం సినిమా 'అమెరికన్ బోర్న్ కన్ఫ్యూస్డ్ దేశీ' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అదే టైటిల్ తో వచ్చిన మలయాళం సినిమా కి రీమేక్. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. మధుర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఇవాళ అనగా మే 15న విడుదలైంది. మరి ఈ సినిమా అల్లు శిరీష్ కు ఎంత వరకు ఉపయోగపడబోతుందో చూద్దామా..

కథ:

అమెరికాలో ఉంటూ డబ్బు విలువ అస్సలు తెలియని అవి (అల్లు శిరీష్) మరియు అతని మిత్రుడు మాస్టర్ భరత్ ని ప్లాన్ ప్రకారం గా అవి తండ్రి నాగబాబు ఇండియా కి రప్పిస్తాడు. వారిని బతకాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే అనే పరిస్థితుల్లో పెడతాడు. అమెరికాలో పుట్టి పెరిగిన అవి ఇండియాలో ఉండగలడా? నాగబాబు కొడుకుకి బుద్ధి చెప్పగలిగాడా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

కథ ప్రకారం ఈ సినిమా మొత్తం అల్లు శిరీష్ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒకరకంగా కొంత చాలెంజింగ్ రోల్ అయినప్పటికీ శిరీష్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచాడు. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. రుక్సర్ ధిల్లాన్ కేవలం అందంతో మాత్రమే కాక తన నటనతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అల్లు శిరీష్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. వెన్నెల కిషోర్ కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఎప్పటిలాగానే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. మాస్టర్ భారత్ కామెడీ కూడా సినిమాలో హైలైట్ గా మారుతుంది. ఎప్పుడూ అల్లు శిరీష్ పక్కనే ఉంటూ మాస్టర్ భరత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నాగబాబు పాత్ర చాలా బాగుంటుంది. హర్షవర్ధన్ తదితరులు కూడా వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం :

రీమేక్ సినిమా అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టు దింపకుండా దర్శకుడు సంజీవరెడ్డి తనదైన స్టైల్లో ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేయడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. మధురా ఎంటర్టైన్మెంట్స్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. జుడా శాండీ అందించిన సంగీతం సినిమాకు బాగా సూట్ అయ్యింది. పాటలు పక్కన పెడితే నేపథ్య సంగీతం కూడా బాగుంది. రామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు అతను మంచి విజువల్స్ ను అందించారు. నవీన్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

కామెడీ

నటీనటులు

బలహీనతలు:

సెకండ్ హాఫ్ లో సాగతీత సన్నివేశాలు

కొన్ని రొటీన్ కామెడీ సన్నివేశాలు

చివరి మాట:

మలయాళం సినిమా తో పోలిస్తే ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి సూటయ్యేలా దర్శకుడు కొన్ని చేసిన మార్పులు చేర్పులు అందరికీ అర్థం అవుతాయి. ఆసక్తికరంగా మొదలైన ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం కామెడీ, ఎంటర్టైన్మెంట్, ప్రేమ, స్నేహం, రొమాన్స్ వంటి ఆసక్తికరమైన ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుంది. రెండవ హాఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ కు పెద్దపీట వేసిన దర్శకుడు సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్లు కూడా పెట్టారు. సెకండ్ హాఫ్ లో కథ కొంత స్లో అవ్వడం మైనస్ పాయింట్ అయినప్పటికీ అది మరీ బోర్ కొట్టించే విధంగా ఉండదు. చివరగా ఏబిసిడి అమెరికన్ బోర్న్ కంఫుజ్డ్ దేశీ కామెడీ నచ్చే ప్రేక్షకులందరూ తప్పకుండా చూడవలసిన సినిమా.

బాటమ్ లైన్:

కడుపుబ్బా నవ్వించే 'అమెరికా బోర్న్ కంఫుజ్డ్ దేశీ'.

Show Full Article
Print Article
Next Story
More Stories