ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా!

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా!
x
Highlights

శ్రీమణి వ్రాసిన ఈ పాట, ఆర్మన్ మాలిక్ పాడిన పాట, ఎస్ ఎస్ థమన్ కూర్చిన సంగీతం తో ఈ మద్య బాగా సంగీతాభిమానులు మెచ్చిన పాట.

శ్రీమణి వ్రాసిన ఈ పాట, ఆర్మన్ మాలిక్ పాడిన పాట, ఎస్ ఎస్ థమన్ కూర్చిన సంగీతం తో ఈ మద్య బాగా సంగీతాభిమానులు మెచ్చిన పాట.

నిన్నిలా నిన్నిలా చూశానే..

క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే..

రెప్ప‌లే వేయ‌నంత క‌నుల‌పండ‌గే..

నిన్నిలా నిన్నిలా చూశానే..

అడుగులే త‌డ‌బ‌డినే నీ వ‌ల్లే..

గుండెలో విన‌ప‌డిందిగా ప్రేమ చ‌ప్పుడే..

నిను చేరిపోయే నా ప్రాణం..

కోరెను నిన్నే ఈ హృద‌యం..

నా ముందుందే అందం.. నాలో ఆనందం..

న‌న్ను నేనే మ‌ర‌చిపోయేలా ఈ క్ష‌ణం..

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..

ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..

ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా

తొలి తొలి ప్రేమే దాచేయికలా..

చిరు చిరు నవ్వే ఆపేయికిలా..

చలి చలి గాలే వీచేంతలా

మరి మరి నన్నే చేరేంతలా

నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వుము

మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా..

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..

ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..

ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా.

ఇప్పటివరకు మీరు ఈ పాట వినకుంటే ఒక సారి వినండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories