logo
మిక్ఛర్ పొట్లం

వేషము మార్చెను....

వేషము మార్చెను....
X
Highlights

కొన్ని పాటలు మనిషి గురించి, అతని ప్రవర్తన గురించి చాల బాగా వర్ణించాయి, అలాంటి పాటే ఒకటి గుండమ్మకథ సినిమాలోని ఈ ...

కొన్ని పాటలు మనిషి గురించి, అతని ప్రవర్తన గురించి చాల బాగా వర్ణించాయి, అలాంటి పాటే ఒకటి గుండమ్మకథ సినిమాలోని ఈ వేషము మార్చెను పాట...

వేషము మార్చెను

భాషను మార్చెను

మోసము నేర్చెను

అసలు తానే మారెను

అయినా మనిషి మారలేదు

ఆతని మమత తీరలేదు

మనిషి మారలేదు

ఆతని మమత తీరలేదు

క్రూరమృగమ్ముల కోరలు తీసెను

ఘోరారణ్యములాక్రమించెను

క్రూరమృగమ్ముల కోరలు తీసెను

ఘోరారణ్యములాక్రమించెను

హిమాలయముపై జండా పాతెను

హిమాలయముపై జండా పాతెను

ఆకాశంలో షికారు చేసెను

అయినా మనిషి మారలేదు

ఆతని కాంక్ష తీరలేదు

పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను

వేదికలెక్కెను

వాదము చేసెను

త్యాగమె మేలని

బోధలు చేసెను

అయినా మనిషి మారలేదు

ఆతని బాధ తీరలేదు

వేషమూ మార్చెను

భాషనూ మార్చెను

మోసము నేర్చెను

తలలే మార్చెను

అయినా మనిషి మారలేదు

ఆతని మమత తీరలేదు.శ్రీ.కో

Next Story