చెల్లి పెళ్లైన రెండురోజులకే బావను చంపేశాడు

చెల్లి పెళ్లైన రెండురోజులకే బావను చంపేశాడు
x
Highlights

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన జరిగింది. పెద్దల అంగీకారం లేకుండా తన చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో బావమరిదే బావను హతమార్చిన ఘటన...

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన జరిగింది. పెద్దల అంగీకారం లేకుండా తన చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో బావమరిదే బావను హతమార్చిన ఘటన వెలుగులోకొచ్చింది. మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి ఉపాధి నిమిత్తం నగరానికొచ్చిన అమర్ అనే యువకుడు.. తను అద్దెకుంటున్న ప్రాంతంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆమె పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని తెలిసి.. బెంగళూరు తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆ యువతి అన్నయ్య లక్ష్మణ్‌కు తెలిసింది. తన చెల్లికి ఫోన్ చేసి అండగా ఉంటానని నమ్మించాడు. ఇంటికి రావాలని, అమ్మానాన్నను తాను ఒప్పిస్తానని చెల్లికి సర్ది చెప్పాడు. అన్న మాటలు నమ్మిన యువతి తన భర్తతో కలిసి పుట్టింటికొచ్చింది.

ఈ క్రమంలోనే అమర్‌ను బయటికెళదామంటూ లక్ష్మణ్ తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో అమర్ తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఉదయం 5గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్దామంటూ తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories