Live Blog: ఈరోజు (మే-25-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 25 మే, 2020 :

ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 25 May 2020 3:11 AM GMT

    ఈరోజు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమాన రాకపోకలు మొదలవుతున్నాయి.

    ఈరోజు నుంచి జూన్ 30 వరకూ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమానాల వివరాలను ఆదివారం విడుదల చేశారు.

    శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగిస్తాయని తెలుస్తోంది. 



  • 25 May 2020 3:06 AM GMT

    మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్

    - మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది.

    - రాష్ట్ర ప్రస్తుత మంత్రివర్గ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు కరోనా పాజిటివ్ తేలింది.

    - ఈయన తన స్వగ్రామానికి తరచూ వెళ్లి వస్తుండడంతో కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు

    - కాగా మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. 



  • 25 May 2020 2:44 AM GMT

    పేద ముస్లింలకు రంజాన్ తోఫా

    విశాఖపట్నం: పేద ముస్లింలు రంజాన్ పండగను సంతృప్తిగా నిర్వహించుకోవాలని రంజాన్ బహుమతిగా మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ నిర్వహకుడు తోట ముకుంద్ అన్నారు. విశాఖలో మూడు వందల మంది పేద ముస్లింలకు రంజాన్ బహుమతి అందించారు. తాను చదువుకున్న రోజుల నుంచి ముస్లిం కుటుంబాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్లనే వారి పండగలో భాగస్వామిని అవుతున్నాని ముకుంద్ అన్నారు. రంజాన్ బహుమతిగా నిత్యావసరాలను అందిస్తున్నామన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఇప్పటి వరకు 6 వేల మందికి నిత్యావసరాలు అందజేసినట్టు ముకుంద్ వివరించారు.



     


  • 25 May 2020 2:42 AM GMT

    సింహగిరిపై ఉద్యానవనం అభివృద్ధికి శ్రీకారం

    సింహాచలం: సింహగిరిపై స్వామివారి ప్రధాన ఆలయం వెనుక కొండవాలు ప్రాంతంలో ‘శ్రీస్వామి వారి ఉద్యానవనం’ పేరిట దేవతా వృక్షాల వనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు. హిల్‌టాప్‌ రహదారిలో దశాబ్దకాలంగా నిరుపయోగంగా మారిన అతిథి గృహాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో ఈ పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని చదును చేసి తుప్పలు, పిచ్చిమొక్కలు తొలగించామన్నారు. చదును చేసిన ప్రాంతంలో సుమారు 15వేల సంపెంగ, శ్రీచందనం, మారేడు, నేరేడు, పనస, వేప, జువ్వి, రావి వంటి దేవతా వృక్షాలను పెంచుతామన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించామన్నారు.


     

  • 25 May 2020 2:03 AM GMT

    చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకునేందుకే కుట్ర: అచ్చెంనాయుడు

    విశాఖపట్నం: విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. సోమవారం ఒక్కరోజే ఏపీకి విమాన సర్వీసులు బంద్ చేయడం వైసీపీ కుట్రలో భాగమేనన్నారు. ఒక్కరోజే విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందని చెప్పారు.



     


  • ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈద్‌ ముబారక్‌
    25 May 2020 1:53 AM GMT

    ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ "ఈద్‌ ముబారక్"‌

    ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు.

    - రంజాన్‌ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని జగన్‌ ఆకాంక్షించారు.


  • ప్రజలకు తెలంగాణా గవర్నర్, ముఖ్యమంత్రి రంజాన్ శుభాకాంక్షలు
    25 May 2020 1:51 AM GMT

    ప్రజలకు తెలంగాణా గవర్నర్, ముఖ్యమంత్రి రంజాన్ శుభాకాంక్షలు

    తెలంగాణా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఈద్‌- ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) శుభాకాంక్షలు తెలిపారు.

    - పవిత్ర రంజాన్‌ మాసం ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి రంజాన్‌ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పర్వదినం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, మత సహనాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. 

    - ఖురాన్‌ బోధనలు సమాజ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయని గరర్నర్‌ తమిళిసై చెప్పారు. క్రమశిక్షణతో జీవించేందుకు పవిత్రరంజాన్‌ మాస ఉపవాస దీక్షలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

     


  • 25 May 2020 1:36 AM GMT

    హెచ్ఎంటీవీ లైవ్ అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.తెలియచేస్తోంది  



     


Print Article
Next Story
More Stories