Live Updates:ఈరోజు (జూన్-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు ఆదివారం, 28 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, అష్టమి (రా.12:36 వరకు), ఉత్తర నక్షత్రం (ఉ.08:36వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 27 Jun 2020 11:51 PM GMT

    గుంటూరు జిల్లాలో దారుణం

    - గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు.

    - సహ విద్యార్థిని జీవితంతో ఆడుకున్నారు.

    - మూడు సంవత్సరలుగా తోటి ఇంజనీరింగ్ విద్యార్థినిని అశ్లీల చిత్రాలతో బెదిరింపులకు పాల్పడ్డారు.

    - వాటిని అడ్డు పెట్టుకుని బాధిత యువతిపై పలుమార్లు అత్యాచారం చేశారు.

    - బాధిత యువతి మొదట ఒక స్నేహితుడితో ప్రేమలో ఉండగా అతను మత్తు మందు ఇచ్చి యువతి అశ్లీల వీడియోలు చిత్రీకరించాడు.

    - ఆ తరువాత మరో విద్యార్థి ప్రేమ పేరుతో మళ్లీ అశ్లీల వీడియోలు చిత్రీకరించాడు.

    - ఆ వీడియోలతో ఇద్దరూ బాధిత యువతిని బెదిరిస్తూ పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

    - దీంతో వారి వేధింపులు తాళలేక బాధిత యువతి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.

    - దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

    - డిజిటల్ క్రైం, అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలతో సహా ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. 

  • 27 Jun 2020 11:47 PM GMT

    కర్నూలు

    విషవాయువు లీక్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ మృతి, పలువురికి అస్వస్థత:

    నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.

    ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్‌ లీకైన సంఘటనలో జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి

    ఈ ఘటనలో పలువురు కార్మికులకు అస్వస్తత

    సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

  • 27 Jun 2020 11:46 PM GMT

    *గుంటూరు జిల్లా*

    లాక్ డౌన్ నేపథ్యంలో భాగంగా గుంటూరు జిల్లా మొత్తం భారీగా మద్యం కేసులు నమోదు చేశామని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సహాయ కమిషనర్ శ్రీనివాస్ చెప్పారు.

    లాక్ డౌన్ పెట్టిన మార్చి 22 నుంచి 1,155 కేసులలో 1,309 మందని అరెస్టు చేశామని శ్రీనివాస్ తెలిపారు. 2,212 లీటర్ల సారా, లక్షా 54వేల 590 లీటర్ల బెల్లం ఊట, 1,241 కిలోల నల్లబెల్లాన్ని ధ్వంసం చేశామన్నారు.

    తెలంగాణ నుంచి 3వేల324 లీటర్ల మద్యం, మద్యం గొలుసు దుకాణాల నుంచి వెయ్యి29లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామన్నారు.

    128 అక్రమ మద్యం కేసులలో 133 మంది అరెస్టు చేసినట్లు ప్రకటించారు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పెట్టిన దగ్గర్నుంచి 575కేసులు నమోదు చేసి 744 మందిని అరెస్టు చేశామన్నారు.

    ఎక్కువగా తెలంగాణ నుంచి 2వేల 625లీటర్ల మద్యం, 215 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.



Print Article
More On
Next Story
More Stories