Live Updates:ఈరోజు (జూన్-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శుక్రవారం, 26 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, పంచమి (ఉ.07:02 వరకు), ముఖ నక్షత్రం (ఉ.11:25వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:53 pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 26 Jun 2020 3:22 PM GMT

    >> కృష్ణాజిల్లా :

    - తిరువూరు మండలంలో చిక్కుళ్లగూడెం వద్ద రెండు బైకులు ఢీ..

    - బైక్ ప్రయాణిస్తున్న అన్నదమ్ములు..

    - కావేటి తిరుమల నాయుడు (16) అనే బాలుడి మృతి..

    - అన్న నవీన్ కుమార్ కు తీవ్రగాయాలు విజయవాడకు తరలింపు..

  • 26 Jun 2020 12:56 PM GMT

    @రోడ్డు ప్రమాదం@


    - కృష్ణా : పమిడిముక్కల (మ) అవనిగడ్డ - విజయవాడ కరకట్టపై ఐనపూరు వద్ద రోడ్డు ప్రమాదం

    [- ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టిన ద్విచక్రవాహనం

    - భార్యభర్త లకుతీవ్ర గాయాలు, భర్త పరిస్థితి విషమం..ఆసుపత్రికి తరలింపు

    - ఘంటసాల మండలం జోడు గూడెంకు చెందిన దంపతులుగా గుర్తింపు

    - బైక్ పై ప్రమాదంలో ఉన్న వ్యక్తి ...చల్లపల్లిలో సంపటాలమ్మ గుడి ఎదురుగా ఉన్న Tv షాప్ లో మెకానిక్ రమేష్ దంపతులు గా సమాచారం

  • 26 Jun 2020 2:20 AM GMT

    - విశాఖ జిల్లా మునగపాక  మండలం నాగవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

    - గ్రామానికి చెందిన పీ.నర్సింగరావు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ అతన్ని ఢీకొంది. ఈ ఘటనలో నర్సింగరావు అక్కడికక్కడే మరణించాడు.

    - అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    - కుటుంబ పెద్ద మృతి చెందటంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

    - పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • 26 Jun 2020 2:18 AM GMT

    - ఏపీలో ఈరోజు రైతులకు పంటల బీమా సొమ్ము చెల్లింపు

    -  సిఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా జమ చేయనున్నారు.

Print Article
More On
Next Story
More Stories