Top
logo

Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు బుధవారం, 24 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, తదియ (ఉ.10:13 వరకు), పుష్యమి నక్షత్రం (మ.01:10వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates

 • 24 Jun 2020 3:21 PM GMT

  అమరావతి♦♦

  - స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)

  - ఆంధ్రప్రదేశ్ SEB మరియు ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్

  - విశ్వసనీయ సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో సారా తయారీ స్థావరాలపై ముమ్మర దాడులు 30,200 లీటర్ల ఊటబెల్లం ధ్వసం, భారీగా నాటు సారా స్వాధీనం చేసుకున్న ఎస్‌ఈబీ, ఒడిశా పోలీసులు

  - ఎస్‌ఈబీ ,ఒడిశా పోలీసుల అదుపులో నలుగురు.. అజ్ఞాతం లోకి మరికొంత మంది కీలక సభ్యులు..ముమ్మరంగా గాలిస్తున్న రెండు రాష్ట్రాల పోలీసులు..

  - గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నాటుసారాను తయారీ చేస్తున్న ముఠా..

  - సరిహద్దు గ్రామాల్లో భారీగా నిఘా ను ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీ

  - ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావు నేతృత్వం లో కొనసాగిన జాయింట్ ఆపరేషన్

 • 24 Jun 2020 3:20 PM GMT

  అమరావతి♦♦


  @చంద్రబాబు నాయుడు ట్విట్టర్

  - పార్లమెంటు సభ్యునిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు, ఒక ఎంపీగా ప్రజాసమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు గుర్తింపుగా "సంసద్‌రత్న" అవార్డుకు ఎంపికైన ఎంపీ @RamMNK కు అభినందనలు

  - అతి చిన్న వయసులోనే ఈ అవార్డు అందుకోనున్న ఎంపీగా, ఇది మీకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణం

 • 24 Jun 2020 3:11 PM GMT

  ♦ పి వి పి అరెస్టుకు రంగం సిద్ధం ♦♦


  - మరికాసేపట్లో అరెస్టును అధికారికంగా ప్రకటించనున్న బంజారాహిల్స్ పోలీసులు..

  - ఇప్పటికే పలు సెక్షన్ల కింద పివి పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.

  - వైద్య పరీక్షల నిమిత్తం మరికాసేపట్లో పీవీపీ నీ ఆస్పత్రికి తరలించనున్న పోలీసులు..

  - బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో భూవివాదంలో తరలివచ్చిన పి వి పి.

  - కైలాష్ ఇచ్చిన ఫిర్యాదుపై పీవీపీ పై కేసు నమోదు చేసిన అధికారులు..

 • 24 Jun 2020 2:15 PM GMT

  - రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కామెంట్స్....

  - యు జీ, పి. జీ పరీక్షలు రద్దు అనేది నిర్ణయం కాలేదు.

  - కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే ఇప్పటివరకు ప్రయత్నాలు చేశాం.

  - సాధ్యాసాధ్యాలపై అన్ని యూనివర్సిటీ ల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నాం.

  - అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళతాం.

  - ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గారితో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటం పై తుది నిర్ణయం వెల్లడిస్తాం.

  **** శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.

 • 24 Jun 2020 2:14 PM GMT

  ♦ తూర్పు గోదావరి జిల్లా♦♦ 

  - మారేడుమిల్లి మండలం కుడూరు గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

  - అక్రమ సంబంధం వద్దని భర్త హెచ్చరించినందుకు కర్రలతో బాది గొంతు నులిమి హతమార్చిన భార్య, ఆమె ప్రియుడు.

  - ప్రియుడి వద్ద నుండి నాటు తుపాకి ,విల్లంభులను నాటు సారాను స్వాధీన పరచుకున్న మారేడుమిల్లి పోలీసులు.

 • 24 Jun 2020 10:54 AM GMT

  ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని మహిళలు ఆందోళన

  - ఆకివీడు: మండలం చెరుకుమిల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఎంపిక లాటరీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆకివీడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు.

  - తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ సీజేఎస్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.

  - న్యాయం జరిగేలా చూస్తానని మహిళలకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. • 24 Jun 2020 10:40 AM GMT

  ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్‌ నోటీసు

  -  ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

  -వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరపున షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

  - పది రోజులుగా పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామ రాజు చేస్తున్న వ్యాఖ్యలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

  - వైసీపీ ఎమ్మెల్యేలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేయడం, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై పార్టీ అధినాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

  - పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ షోకాజ్ నోటీసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
 • 24 Jun 2020 10:07 AM GMT

  నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి లో కలకలం

  - కరోన పాజిటివ్ నమోదైన వ్యక్తి ఆస్పత్రి నుండి పరార్.

  - ఆరోగ్యం బాగోక దగ్గు జలుబుతో విజయవాడకు చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అవ్వగా వైద్యపరీక్షల అనంతరం అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పరారైన వ్యక్తి.

  - ప్రభుత్వ వైద్యుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

  - ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

 • 24 Jun 2020 8:55 AM GMT

  ఘాట్ రోడ్ లో లారీ బోల్తా..

  - ఏజెన్సీ ఘాట్​రోడ్డులో సిమెంటు ఇటుకల లారీ బోల్తా పడింది.

  - విశాఖ నుంచి పాడేరు వస్తుండగా యేసు ప్రభు బొమ్మ మలుపు వద్ద అదుపు తప్పింది.

  - ఈ ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

  - క్షతగాత్రులను 108 వాహనంలో మాడుగుల ఆసుపత్రికి తరలించారు.

  - మలుపు వద్ద ట్రాఫిక్​ అంతరాయం కలిగింది.
 • 24 Jun 2020 8:51 AM GMT

  ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలి

  - కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని విశాఖ జిల్లా అనకాపల్లి ట్రాఫిక్​ సీఐ బాబూజీ సూచించారు.

  - మాస్కులు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  - ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని చెప్పారు.

  - నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. Next Story