Top
logo

Live Updates:ఈరోజు (జూన్-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు సోమవారం, 22 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, పాడ్యమి (ఉ.11:58 వరకు), ఆరుద్ర నక్షత్రం (మ.01:31వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates

 • 22 Jun 2020 1:17 AM GMT

  గవరపాలెంలో నిబంధనలు సడలింపులు

  - అనకాపల్లి మండలం గవరపాలెంలో కంటైన్మెంట్ జోన్ ఎత్తేస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ బీవీ.సత్యవతి స్పష్టం చేశారు.

  - ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​తో కలిసి ఆమె... గవరపాలెంలో పర్యటించార.

  - ఈ ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కావటంతో గత 16 రోజులుగా కంటైన్మెంట్ జోన్​ ఏర్పాటు చేశామన్నారు.

  - కరోనా బాధితులు కోలుకొని డిశార్జ్ కావటంతో సడలింపులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

  - వైరస్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.

  - అనంతరం అనకాపల్లి ప్రధాన రహదారిలోని దుకాణాలు తెరుచుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.

 • 22 Jun 2020 1:09 AM GMT

  కొబ్బరి కాయల లోడులో 664 కేజీల గంజాయి పట్టివేత

  -  కాయల లోడులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్న వాహనాన్ని విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు.

  - వీరు తుని నుంచి బీహార్​ రాష్ట్రానికి కొబ్బరి కాయలను లారీలో తరలిస్తుండగా... వేంపాడు టోల్​ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు.

  - లారీతో పాటు డ్రైవర్​, క్లీనర్​ను అదుపులోకి తీసుకున్నారు.

  - వీరి వద్ద నుంచి 664 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

  -  విలువ సుమారు 13.28 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. 
Next Story