Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శుక్రవారం, 12 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సప్తమి (రాత్రి 10:51 వరకు), శతభిష నక్షత్రం (మధ్యాహ్నం 06.48 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:50 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 12 Jun 2020 5:05 PM GMT

     అర్థరాత్రి 1గంటలకి KU1617, రేపు ఉదయం 6 కి KU1619 ప్రత్యేక విమానం ద్వారా మొత్తం 580 మంది ఏపి వలస కార్మికులు ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకొని అక్కడి నుండి రాష్ట్రానికి చేరుకోనున్నారు.

    ఇందులో కడప జిల్లావారు: 402 మంది, చిత్తూరు జిల్లా వారు: 142 మంది, అనంతపురం జిల్లా వారు: 36 మంది, నెల్లూరు జిల్లా వారు: 4, కృష్ణ జిల్లా వారు: 1 ఉన్నారు, వీరంతా జిల్లాకి చేరుకున్నాక ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

  • 12 Jun 2020 12:25 PM GMT

    తెలంగాణ ఈఎస్ఐ స్కామ్....

    ఈఎస్‌ఐ కుంభకోణంపై చివరి దశకు చేరుకున్న ఏసీబీ దర్యాప్తు..

    ఈఎస్‌ఐ స్కాంపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్న ఏసీబీ..

    త్వరలో ఏసీబీ కోర్ట్ లో నిందితుల పై చార్జ్ షీట్ వేయనున్న ఏసీబీ...

    ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ దేవికారాణి..

    ఇప్పటికే ఈఎస్‌ఐ కుంభకోణంలో 25 మంది అరెస్ట్‌...

    దేవికారాణి, పద్మ, వసంత, ఇందిరతో పాటు ఓమ్ని మెడి ఎండీ శ్రీహరి..తేజ ఫార్మా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్...

    కరోనా నేపథ్యంలో నింధితులందరు బెయిల్‌పై విడుదల...

    ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఈఎస్‌ఐ కుంభకోణం...

    ఆంద్రప్రదేశ్ లో అరెస్ట్ అయిన నాయకులు,డైరెక్టర్ల పాత్ర పై తెలంగాణ లో అరెస్ట్ అయిన వారికి ఉన్న సంబంధాల పై ఏసీబీ ఆరా...

    తేజా ఫార్మా ,ఓమ్ని మెడి కంపెనీలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ...

    తెలంగాణ లో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం లో డైరెక్టర్ దేవికారాని పాత్ర కీలకం..

    తర్వాలోనే ఛార్జ్ షీట్ ధాఖలు చేయనున్న ఏసీబీ.

  • 12 Jun 2020 12:25 PM GMT

    కరీంనగర్ :బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్

    కరీంనగర్ అభివృద్ధి కలిసి ముందుకు వెళదాం అని గంగులకి చెప్తున్నా

    తమ్ముడిగా నన్ను భావించి ముందుకు కరీంనగర్ అభివృద్ధి వెళదాం ..,కానీ అనవసర రాజకీయాలు చేయడం సరికాదు

    *హైదరాబాద్ లో బిజెపి నాయకులు లక్ష్మణ్ రాంచందర్ రావు అరెస్ట్ ని ఖండిస్తున్న

    *ముఖ్యమంత్రి ఆపాయిన్మెంట్ ఇవ్వరు..వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు ..ఇదో దివాలాకోరు ప్రభుత్వం

    *తెలంగాణ లో జర్నలిస్ట్ మనోజ్ ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే చనిపోయాయిరు

    *జర్నలిస్ట్ లని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం

    *టెస్ట్ లు ఎక్కువగా చేయకుండా ప్రభుత్వం తప్పు చేస్తుంది

  • 12 Jun 2020 11:54 AM GMT

    మంత్రి ఆదిమూలపు సురేష్

    టిడిపి నేతలు తప్పు చేసి బుకాయిస్తున్నారు

    దీనిపై సమాధానం చెప్పాలి

    టిడిపి హయాంలో అవినీతి విచ్చల విడిగా జరిగింది

    కులాల ప్రసక్తి వద్దు

    చట్టం తన పని చేసుకు పోతుంది

    చంద్రబాబు ప్రతి విషయం లో రాజకీయం చేస్తున్నాడు

    అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో రాజకీయం లేదు

    విద్యాశాఖ లో అవినీతి పై కూడా విచారణ జరుగుతుంది

    అవినీతి ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు

  • 12 Jun 2020 11:53 AM GMT

    మాజీ మంత్రి అయ్యనపాత్రుడు కామెంట్స్...

    అచ్చెంన్నాయుడు అరెస్టు కక్షసాధింపు చర్య...

    ఆరెస్టు ప్రక్రియ లో నిబంధనలు ఏసిబి అధికారులు పాటించలేదు.

    అచ్చెంన్నాయుడు ను అరెస్టు చేస్తున్నారని రాత్రి 11 గంటల కు సోషల్ మీడీయా లో వైసీపీ నేతలు ప్రచారం చేసారు...ఉదయం7:30 కి అరెస్ట్ చూపారు ఇది కుట్ర గా భావిస్తున్నాం...

    అవినీతీ కోసం మాట్లాడే అర్హత జగన్ సర్కార్ కి లేదు.

    బీసీలను చిన్నచూపు చూస్తున్నారు..

    ప్రజలకు ఇచ్చిన సంక్షేమపథకాల పై విచారణ చేయిస్తారా

    ఇప్పటివరకు టీడీపే మీద చేసిన ఆవినీతి ఆరోపణలు ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు...

    ఇసుక పాలసీ, ఇళ్లు పట్టాల పంపిణీలో దోపిడి జరుగుతోంది..ఈ అంశాల పై విచారణ ఎందుకు చేయడం లేదు...

    ప్రభుత్వ వైఫల్యాల పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు...

    రాష్ట్రంలో రౌడీరాజకీయం నడుస్తోంది..

  • 12 Jun 2020 11:53 AM GMT

    తూగో తుని మండలం వల్లూరు గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో 90 లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి సరఫరా పధకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా.

  • 12 Jun 2020 11:32 AM GMT

    ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

    ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది.


  • 12 Jun 2020 6:16 AM GMT

    ఢిల్లీ

    రిజర్వ్ బ్యాంకు విధించిన మారిటోరియం సమయంలో రుణాల పై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలయిన సుప్రీంకోర్టు లో పిటీషన్ పై విచారణ .

    మారిటోరియం సమయంలో రుణాలపై వడ్డీ ఏ విధంగా వసూలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తరపున విచారణకు హాజరయిన సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

    వడ్డీ వసూలు చేస్తున్నప్పుడు మారిటోరియం వల్ల ప్రయోజనం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్న.

    రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ అధికారులతో మాట్లాడి అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం అడిగిన సొలిసిటర్ జనరల్.

    తదుపరి విచారణను జూన్ 17 వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • 12 Jun 2020 6:16 AM GMT

    సూర్యాపేట : సూర్యాపేట జిల్లా మునగాల లో డబుల్ బెడ్ రూం ఇళ్ల‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి...అనంతరం‌ కోదాడ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ,నూతనంగా నిర్మించిన మండల‌ పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించిన‌ మంత్రి పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం‌ మల్లయ్య యాదవ్...

  • 12 Jun 2020 6:08 AM GMT

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్డ్ ను ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

    టీడీఎల్పీ ఉపనాయకుడు, రాష్ట్రంలో ప్రముఖ బీసీ కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం.

    అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా అరెస్ట్ చేయడం కుట్రే.

    తెలంగాణ రాష్ట్రంలోనూ ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వస్తే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు..

    ఇక్కడ మాత్రం డిపార్టుమెంట్ విచారణ లేకుండా నేరుగా బీసీ నేతపై కక్ష కట్టి అరెస్ట్ చేయడం బలహీనవర్గాలను వేధించడమే.

Print Article
More On
Next Story
More Stories