Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శనివారం, 06 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పాడ్యమి (రాత్రి 10:32వరకు), తదుపరి విదియ సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 6 Jun 2020 2:36 AM GMT

    నేటి నుంచి ఏపీలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం

    ►ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు..

    ► దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే అర్హులకు రేషన్ కార్డు 

    ►రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీ

  • 6 Jun 2020 2:35 AM GMT

    ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటీ విచారణ

    ►నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న హైపవర్ కమిటీ

    ►తొలిరోజు నిపుణుల కమిటీలతో రెండు దశల్లో హైపవర్ కమిటీ భేటీ

    ►రెండో రోజు వీఎంఆర్‌డీఏ ప్రాంగణంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం..

    ►మూడో రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించనున్న హైపవర్ కమిటీ..



  • 6 Jun 2020 2:33 AM GMT

    జూన్ 9 నుంచి కేరళలో దైవ దర్శనాలు

    - కేరళలోనూ జూన్ 9 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

    - కేంద్ర మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు.

    - శబరిమలలో ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.

    - వర్చువల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీని నియంత్రిస్తామని తెలిపారు సీఎం పినరయి విజయన్.



     


  • 6 Jun 2020 1:24 AM GMT

    కరోనా వైరస్ కేసుల్లో ఇటలీకి చేరువలో ఇండియా!

    - రోగుల సంఖ్యలో  ఇటలీని మన దేశం  దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    - శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి.

    - దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి దగ్గరలో నిలిచింది.

    - తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

    - దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే.

    - మరోవైపు, మరణాల సంఖ్యా పెరుగుతోంది.

    .  24 గంటల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు.

    - రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇప్నాపటివరకూ నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.



Print Article
More On
Next Story
More Stories