Top
logo

Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు సోమవారం, 01జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, దశమి (మధ్యాహ్నం 02:57 వరకు), తదుపరి ఏకా దశ.సూర్యోదయం 5:41am, సూర్యాస్తమయం 5:47 pm

ఈరోజు తాజావార్తలు

Live Updates

 • రైతులకు కేంద్రం శుభవార్త.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు!
  1 Jun 2020 2:44 PM GMT

  రైతులకు కేంద్రం శుభవార్త.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు!

  - అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

  - పలు రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

  - 2020-21 మార్కెటింగ్ సీజన్‌లో మద్దతు ధరలను 50 శాతం నుంచి 83 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ తెలిపారు.

  - 14 రకాల ఖరీఫ్ పంటలకు ఇది వర్తించబోతుందని ఆయన వివరించారు.

  - ఈ క్రమంలో ప్రొద్దు తిరుగుడుకు రూ.5885(100 కేజీలకు), హైబ్రిడ్ జొన్నకు రూ.2,620(100 కేజీలకు), మొక్కజొన్నకు రూ.1,850(100 కేజీలు), కందిపప్పుకు రూ.6000(100 కేజీలకు) మద్దతు ధరగా ఉండబోతున్నట్లు పేర్కొన్నారు.

  - అలాగే రైతులు తీసుకున్న రుణాల గడువు పెంచుతామని, ఆగష్టు లోపు రైతులు తీసుకున్న రుణాలు చెల్లించొచ్చని స్పష్టం చేశారు.

    • 1 Jun 2020 2:28 PM GMT

  కృష్ణాజిల్లా నూజివీడు మండలం మొర్సపూడి వద్ద తెలంగాణ నుండి హనుమాన్ జంక్షన్ కు అక్రమ తరలిస్తున్న 456 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు.

  ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక టవేరా వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.

  వీటి విలువ 2లక్షలు ఉంటుంది అని డి.ఎస్.పి బి.శ్రీనివాసులు తెలిపారు

 • 1 Jun 2020 12:52 PM GMT

  కేజీహెచ్​లో ప్రతీ పడకకు ఆక్సిజన్ సదుపాయం

  విశాఖపట్నం: కొవిడ్‌-19 కేసులకు వైద్య సేవలందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేజీహెచ్‌లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన అనంతరం... ప్రతీ పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 1070 పడకల్లో 870 పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సదుపాయం ఉంది. స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో ఒకేసారి 400 మందికిపైగా కేజీహెచ్‌కు తరలివచ్చారు. వారికి తక్షణమే ఆక్సిజన్‌ అందించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రతీ పడకకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడవచ్చని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని... మిగిలిన 570 పడకలకు కేంద్రీకృత ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున తెలిపారు. కేజీహెచ్ ఆసుపత్రి వార్డుల్లో 200 పడకలు, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 370 పడకలకు ఈ సదుపాయం రానుందని... దీని కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.   


 • 1 Jun 2020 12:50 PM GMT

  ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు... మీరైనా ఆదుకోండి సార్!

  నాతవరం: తాండవ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు... న్యాయం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ సమీపంలోని మాధవనగర్ నిర్వాసితులు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయానికి వినతిపత్రం అందించారు. జలాశయం నిర్మాణంలో భూములు పోయిన సుమారు 150 మందికి మాత్రమే పట్టాలిచ్చారని... మిగిలిన వారికి ఇవ్వలేదని వాపోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు భరోసా, విత్తనాలు, ఎరువులు తదితర రాయితీలను పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించినప్పటికీ ప్రయోజనం లేదని అంటున్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.   


 • 1 Jun 2020 12:28 PM GMT

  ఎస్‌ఈసీ వ్యవహారం: సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం

  -ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

  -ఎస్‌ఈసీ పదవీకాలం కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను, జీవోలను కొట్టివేసి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

  -ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.    


 • 1 Jun 2020 9:41 AM GMT

  వలస కార్మికులను పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

  కరీంనగర్ టౌన్: వలస కార్మికులు తరలించడానికి సిద్ధంగా ఉన్నా రైలు. పొట్ట చేత పట్టుకొని కూలీ పనులకు, రాష్ట్రాలు దాటి వచ్చిన కూలీలను లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను, ఈరోజు సాయంత్రం కరీంనగర్ నుండి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. ఫ్లాట్ ఫామ్ పై కరీంనగర్ నుండి బయలుదేరడానికి పట్టాలపై రైలు సిద్ధంగా ఉంది.   


 • 1 Jun 2020 8:34 AM GMT

  అమరావతి

  -సచివాలయానికి కరోనా ఎఫెక్ట్.

  -3, 4 బ్లాకుల్లోకి ఎంట్రీ నిషిద్ధం.

  -సెక్రటేరీయేట్ మొత్తం శానిటైజ్ చేస్తున్న సిబ్బంది.

  -విధులకు హాజరు కాని 3,4 బ్లాకుల్లో పని చేసే సచివాలయ ఉద్యోగులు.

  -మిగతా బ్లాకుల్లోనూ అంతంత మాత్రంగానే ఉద్యోగుల హాజరు.

  -సచివాలయానికి కరోనా తాకిడితో తన రివ్యూలను విజయవాడ ఆర్ అండ్ బి భననంలోని ఏపీటీఎస్ కార్యాలయం నుంచి చేపడుతోన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్జి.

 • 1 Jun 2020 8:33 AM GMT

  కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం.

  సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
 • 1 Jun 2020 8:30 AM GMT

  అమరావతి

  -ఉరి వేసుకుని మహిళా వాలంటీర్ బాంధవి ఆత్మహత్య..

  -గుంటూరు జిల్లా,చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాదం..

  -గ్రామానికి చెందిన మరో వాలంటీర్ శ్రీనివాస్ తో ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు..

  -తమ కుమార్తె ఆత్మహత్య కు వాలంటీర్ శ్రీనివాస్ వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఆరోపణ..

  -వాలంటీర్ శ్రీనివాస్ కు దేహశుద్ధి..

  -పూర్తి దర్యాప్తు చేస్తున్న చుండూరు పోలీస్ స్టేషన్ ఎస్సై

 • 1 Jun 2020 8:29 AM GMT

  -రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్

  -కేంద్ర హోంమంత్రి అమిత్‍షా తో భేటి 

  -పలు అంశాలపై అమిత్‍షా తో చర్చించనున్న సీఎం జగన్

Next Story