Live Updates:ఈరోజు (జూలై-23) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-23) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు గురువారం, 23 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం తదియ (సా. 6-40 వరకు) తర్వాత చవితి, మఘ నక్షత్రం (రా. 8-06 వరకు) తర్వాత పుబ్బ నక్షత్రం.. అమృత ఘడియలు ( సా. 5-47 నుంచి 7-19 వరకు), వర్జ్యం ( ఉ. 8-34 నుంచి 10-06 వరకు తె.వ. 3-40 నుంచి 5-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-57 నుంచి 10-48 వరకు తిరిగి మ. 3-06 నుంచి 3-58 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-33

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 23 July 2020 4:10 PM GMT

    కార్మిక చట్టాలను పటిష్ఠం చేయాలని ధర్నా

    మాడుగుల: నియోజకవర్గంలోని మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు, కూలీలు, కార్మికులు ఆందోళన చేశారు. ప్రజలందరికీ ఉచిత విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

    ఉపాధి హామీ పథకం కూలీలకు 200 రోజులు పని కల్పించి, రూ.600 రోజువారి కూలి అందించాలని.. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న కోరారు. పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించాలని, భూ యజమానికి సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని, డిమాండ్ చేశారు.

  • 23 July 2020 3:00 PM GMT

    పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం

    రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ తరగతులు, పాఠశాలల పునఃప్రారంభం, విద్యా సంవత్సరంపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది.

    - పూర్తి వివరాలు 

  • 23 July 2020 2:01 PM GMT

    కరోనా పేరుతొ నయా దందా

    - కరోనాను తగ్గించే ఇంజక్షన్ అంటూ అమ్మకాలు.

    - ఒంగోలు రిమ్స్ దగ్గర దళారుల దోపిడీ.

    - ఆక్ట్ఎంరా పేరుతొ ఉన్న ఇంజక్షన్ లు అమ్మకాలు.

    - రూ. 80 వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు.

    - జనం ప్రాణాలతో ఆటలాడుతున్న దళారులు.

  • 23 July 2020 1:54 PM GMT

    ఆరోగ్య శాఖ అధికారులపై ఈటల ఫైర్..

    - డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పై ఈటల ఆగ్రహం.

    - కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిందన్న కామెంట్స్ పై మండిపడ్డ ఈటల.

    - సముహవ్యప్తి లేనిదే ఎందుకు ప్రకటించారంటూ నిలదీత.

  • రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి!
    23 July 2020 1:46 PM GMT

    రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి!

    - డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి

    - దాడిపై స్పందించిన డైరెక్టర్ వర్మ.

    - దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 8 మంది యువకులు అరెస్ట్.

    - పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి చేసి ఉండొచ్చు.

    - కొంతమంది పనిలేక పుబ్లిసిటీ కోసం దాడి చేశారు.

    - వచ్చినవాళ్లు వాళ్ళపైనే దాడి చేసుకున్నారు.

    - నాపై తప్పుడు కాసు పెట్టాలని ప్లాన్ చేసారు.

    - నా ఇష్టం వచ్చినట్లు సినిమా తీసే హక్కు నాకుంది.

    - కుక్కలు అరుస్తాయి.. నేను భయపడను.

    - తాట తీస్తానని పవన్ చెప్పాడు.. తీసాడా?

    - ఫిక్షన్ తో ఎలాంటి సినిమానైన తీయవచ్చు.


  • 23 July 2020 1:22 PM GMT

    వరదల్లో తూర్పు గోదావరి జిల్లా లోతట్టు ప్రాంతాలు

    - తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది.

    - రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి.

    - లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

    - ఆదిమ్మ దిబ్బ, కంబాల చెరువు, హై టెక్ బస్సు స్టేషన్, రైల్వే స్టేషన్, రోడ్లు వర్షంతో నీట మునిగాయి.

    - పరిసర ప్రాంతాలలోనే పంట పొలాలు ముంపున పడ్డాయి. 

  • 23 July 2020 12:57 PM GMT

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం..

    - ఏపి హెల్త్ బులిటెన్ విడుదల

    - ఏపిలో రికార్డ్ స్ధాయిలో కరోనా పాజిటవ్ కేసులు

    - గడిచిన 24 గంటల్లో కొత్తగా 7998 కరోనా పాజిటివ్ కేసులు,59మరణాలు

    - దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 72711

    - గడిచిన 24 గంటల్లో మొత్తం 58052 శాంపిల్స్‌ పరీక్ష

    - ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 884

  • 23 July 2020 12:42 PM GMT

    నెల్లూరు లో మళ్లీ లాక్ డౌన్..

    - నెల్లూరు లో మళ్లీ లాక్ డౌన్.

    - రేపటినుండి జూలై 31 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జరీ చేసారు.

    - ఉదయం 7 నుండి 11 వరకు నిత్యావసర సరుకులకు అనుమతి. ఇక ఇప్పటికే కావాలి, ఆత్మకూరు, నయిడుపేట, గూడూరులో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

    - కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు. 

  • 23 July 2020 12:27 PM GMT

    విశాఖ లో బాలుడు కిడ్నాప్

    - విశాఖ లో బాలుడు కిడ్నాప్. 

    - ఏడాదిన్నర గణేష్ ను ఎత్తుకెళ్లిన దుండగులు.

    - ఫుట్ పాత్ మీద తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలున్ని , ఆటోలో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసిన వైనం.. 100 కి ఫోన్ చేయగా అప్రమత్తమైన పోలీసులు.

    - విశాఖ సీపీ ఆదేశానుసారం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.

    - ఆటో నెంబర్; సీసీ పుటేజ్ ఆధారంగా విజయనగరంలో బాలుడిని గుర్తించిన పోలీసులు.

    - సేఫ్ గా బాలుడ్ని తీసుకుని వచ్చిన విశాఖ పోలీసులు.

    - నిందితులు.. అరెస్ట్.

  • 23 July 2020 12:26 PM GMT

    తెలంగాణలోపాఠ్య పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధం

    - కరోనా కారణగా విద్య సంవత్సరం ప్రారంభమే కాలేదు.. కనీ ప్రైవేట్ స్కూల్స్ అన్ లైన్ క్లాసు లతో దూసుకుపొతున్నయి.

    - ఇక ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు వెనకబడి పోతున్నారన్న ఆలోచనతో తెలంగాణ విద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

    - క్లాసుల సంగతి తరువాత చూడడం ముందుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేద్దామని నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు ఆ నిర్ణయమే వివాదాస్పదం అవుతుంది. 

Print Article
Next Story
More Stories