Live Updates:ఈరోజు (జూలై-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు మంగళవారం, 21 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పాడ్యమి (రా. 9-46 వరకు) తర్వాత విదియ, పుష్యమి నక్షత్రం (రా.9-40 వరకు) తర్వాత ఆశ్లేష నక్షత్రం.. అమృత ఘడియలు ( సా. 3-19 నుంచి 4-54 వరకు), వర్జ్యం ( ఉ.శేషం 7-23 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-13 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-59 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-38 సూర్యాస్తమయం సా.6-33

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత!
    21 July 2020 3:31 AM GMT

    మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత!

    - మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) అనారోగ్యంతో కన్నుమూశారు.

    - శ్వాససంబంధ వ్యాధితో కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    - గత నెల జూన్ 11 నుంచి ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అశుతోష్ టాండన్ ట్వీట్ చేశారు.

    - లాల్జీ టాండన్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 22వ గవర్నర్ పనిచేస్తున్నారు.

    - ఏప్రిల్ 12, 1935న లక్నోలో జన్మించిన టాండన్.. బీజేపీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆయన గతంలో బీహార్ కు కూడా గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

  • 21 July 2020 3:26 AM GMT

    ప్రారంభం కానున్న హజ్ యాత్ర

    - ముస్లింలు చేపట్టే హజ్‌యాత్రకు కరోనా వైరస్ నేపథ్యంలో బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

    - అయితే, తక్కువ సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తూ.. ఈ నెల 29వ తేదీ నుంచి హజ్ యాత్రను నిర్వహించనున్నారు.

    - కేవలం వెయ్యి మంది ముస్లిం యాత్రికులకు మాత్రమే హజ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

    - పవిత్ర నగరం మక్కాలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 2.5 మిలియన్ల మంది యాత్రికులు వస్తుంటారు.

    - అయితే ఈ సారి కరోనా వైరస్ కోరలు చాచిన నేపథ్యంలో యాత్రను తగ్గించారు. అత్యంత కఠినమైన ఆంక్షల నడుమ యాత్రను చేపట్టనున్నారు.

    - 65 ఏళ్ల లోపు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

Print Article
Next Story
More Stories