Top
logo

Live Updates:ఈరోజు (జూలై-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు మంగళవారం, 21 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పాడ్యమి (రా. 9-46 వరకు) తర్వాత విదియ, పుష్యమి నక్షత్రం (రా.9-40 వరకు) తర్వాత ఆశ్లేష నక్షత్రం.. అమృత ఘడియలు ( సా. 3-19 నుంచి 4-54 వరకు), వర్జ్యం ( ఉ.శేషం 7-23 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-13 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-59 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-38 సూర్యాస్తమయం సా.6-33

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా
  21 July 2020 4:24 PM GMT

  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా

  - ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినీ స్టార్లు, రాజకీయ నేతలు ఇలా కరోనా బారినపడుతున్నారు.

  - ఇక ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే..

  - తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు.

  - గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపదుతున్న అయన కరోనా పరీక్షలు నిర్వహించుకోగా అందులో ఆయనకి కరోనా అని తేలింది.

  - విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అయన పీఏ కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

  - ప్రస్తుతం విజయసాయిరెడ్డి సెల్ఫ్ క్వారంటైన్‌లోకు వెళ్లిపోయారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు.

  - వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. • బుధవారం పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న సీఎం జగన్
  21 July 2020 3:43 PM GMT

  బుధవారం పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న సీఎం జగన్

  - ఇబ్రహీంపట్నంలో పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న వైఎస్ జగన్.

  - రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నటాలని లక్ష్యం.

  - రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇవ్వనున్న ఇళ్ళ పట్టాల లేఔట్లలో కార్యక్రమం నిర్వహించనున్నారు.

  - ప్రతీ మొక్కకు త్రీ గార్డ్ ఏర్పాటు చేసి 80% మొక్కలను కాపాడే భాద్యత సర్పంచ్ లకు కేటాయించనున్నారు. 

  - ప్రతీ ఒక్కరు పది మొక్కలు నాటే విధంగా ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. 

 • 21 July 2020 1:22 PM GMT

  కరోనా ఎఫెక్ట్: మధ్యాహ్నం కల్లా మూతపడుతున్న దుకాణాలు

  విశాఖపట్నం: కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం విశాఖ జిల్లాలో దుకాణాలు మధ్యాహ్నం కల్లా మూతపడుతున్నారు. ప్రతిరోజు 150 నుంచి 200 వరకు కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 209 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1125 కి చేరింది. 1965 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 53 గా ఉంది.

  గత వారం రోజులుగా కరోనా కేసుల పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆయా సెంటర్లలో ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని తెలపడంతోపాటుగా పలు అంశాలపై కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. • 21 July 2020 1:13 PM GMT

  కరోనా వైరస్ నేపథ్యంలో పలు జాగ్రతలతో వ్యాపారాలు నిర్వహించాలి

  ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణములో వ్యాపారస్తులు మరియు పోలీస్ అధికారులతో రాజేంద్రప్రసాద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పెరిగిపోతున్న కరోనా వైరస్ పట్ల ఉయ్యూరు వ్యాపారస్తులు, ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరు మాస్క్ లు ఉపయోగించాలని, సామాజిక దూరం పాటించి,వ్యక్తిగత శుభ్రత పాటించాలని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

  కొందరు వ్యాపారస్తులు లాక్ డౌన్ టైమ్ ను ఉదయం 6గంటల నుండి 10 గంటలవరకు కాకుండా ఉదయం 6 గంటలనుండి 11 గంటలు మార్చాలని కోరారని, చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని వ్యాపారులు కోరారని రాజేంద్రప్రసాద్ అన్నారు. • 21 July 2020 1:08 PM GMT

  16 కేజీల గంజాయి స్వాధీనం నలుగురు అరెస్ట్ చేసిన పోలీసులు

  గుడివాడ: సబ్ డివిజన్ లోని గుడివాడ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4గురు నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ సత్యానందం తెలిపారుు. దీంతో పాటు సుజుకీ మోటర్ సైకిల్, 2000రూపాయలు నగదు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసి 4 గురినిందితులను రిమాండ్ కు పంపీనట్లు డిఎస్పీ సత్యానందం తెలిపారు.

  ఈ కేసు నందు చాకచక్యంగా వ్యవహరించి, ముద్దాయి లను అరెస్ట్ చేసిన సీఐ, ఎస్ఐ లను డిఎస్పీ అభినందించారు.అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గతంలో గంజాయి ముఠా అరెస్ట్ చేసినట్టు త్వరలోనే ఇన్ఫర్మేషన్ పెట్టామని మరో ముఠా అరెస్ట్ చేయబోతున్నట్లు కూడా తెలిపారు. • 21 July 2020 1:05 PM GMT

  70 లీటర్ల సారా స్వాధీనం.. నలుగురి అరెస్ట్

  కోరుకొండ : కోరుకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారినుండి 70 లీటర్ల సారా, రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలా వీరబాబు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు కోరుకొండ గ్రామానికి చెందిన శివ గంగాధర్, కోటి కేశవరం గ్రామానికి చెందిన రాజ్ కుమార్, తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన చిన్నబాబు శ్రీనులను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు.

  సారా అమ్మకాలు జరగడం ద్వారా కరోనా వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సారా అమ్మకాలపై ప్రజలు సమాచారం అందించాలని సిఐ సూచించారు. ఈ దాడులలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. • 21 July 2020 1:01 PM GMT

  కలెక్టర్ ఆదేశాలతో తాడిపత్రికి కరోనా పరీక్షల నిమిత్తం సంజీవిని వాహనం

  తాడిపత్రి: అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణంలోని తేరు బజార్, మెయిన్ బజార్ ప్రాంతాల్లో కరోనా పరీక్షల నిమిత్తం సంజీవిని వాహనం మంగళవారం సైతం వస్తున్నట్లు సంబంధిత డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

  మెయిన్ బజార్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, అనుమానం ఉన్న వారు, 60 ఏళ్ల పైబడిన వారు కరోణ పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా పరీక్షలు చేయించుకోదలచిన ప్రజలు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్లతో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్ తెలిపారు. 

 • 21 July 2020 9:01 AM GMT

  తెనాలి మాజీ శాసనసభ్యులు డాక్టర్ రావి రవీంద్రనాథ్ మృతి.

  తెనాలి మాజీ శాసనసభ్యులు డాక్టర్ రావి రవీంద్రనాథ్ మృతి.

  కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న డాక్టర్ రవీంద్రనాథ్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి.

 • ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారానే రాజధాని ఏర్పాటు: యనమల
  21 July 2020 8:15 AM GMT

  ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారానే రాజధాని ఏర్పాటు: యనమల

  - అమరావతికి నాడు రాష్ట్రపతి అనుమతి తెసుకున్నారా అనడం హాస్యాస్పదం.

  - రాష్ట్రపతి సంతకం ద్వారానే ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం వచ్చింది.

  - రాజధాని గుర్తింపునకు కేంద్రం నిపుణుల కమిటీ ని నియమించింది.

  - నిపుణుల కమిటీ సిఫారస్సుతోనే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయటం జరగడం

  - రాజధాని తరలించాలంటే రాష్ట్రపతి సంతకం, కేంద్రం అనుమతి తప్పనిసరి.

  - ప్రజలను తప్పుదారి పట్టించేలా సలహాదారు వ్యాక్యాలు.

  - ఏపీ రాజధాని కేంద్ర చట్టంతో ముడి పడి ఉన్న అంశం.

  - కేంద్ర చట్టాన్ని ఉల్లంగించి రాష్ట్రం తెచ్చే చట్టానికి రాష్ట్రపతి సంతకం అవసరం.

  - శాసనమండలి సెలెక్ట్ కమిటీ వద్ద రాజధాని అంశం పెండింగ్ ఉంది. 


 • 21 July 2020 7:37 AM GMT

  ఇందూరును వణికిస్తున్న కరోనా..

  ఇందూరును కరోనా భయం వెంటాడుతోంది. ఒక్కొక్కరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది మహమ్మరి బారిన పడటం జిల్లా వాసులను కలవరపెడుతోంది. దీంతో పలు కార్యాలయాలకు తాళాలు వేశారు అధికారులు. అటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

  - పూర్తి వివరాలు 

Next Story