Live Updates:ఈరోజు (జూలై-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు సోమవారం, 13 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం అష్టమి(సా. 4-36 వరకు) తర్వాత నవమి, రేవతి నక్షత్రం (ఉ.10-45 వరకు) తర్వాత అశ్విని నక్షత్రం.. అమృత ఘడియలు (తె. 5-21 నుంచి 9-51 వరకు), వర్జ్యం లేదు. దుర్ముహూర్తం (మ. 12-31 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • విశాఖపట్నం ఫార్మాసిటీలో భారీ పేలుడు:భయాందోళనల్లో ప్రజలు
    13 July 2020 6:19 PM GMT

    విశాఖపట్నం ఫార్మాసిటీలో భారీ పేలుడు:భయాందోళనల్లో ప్రజలు

    విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. 

    రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ఈ పేలుడు. సంభవించింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

    దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

     ప్రమాద స్థలానికి చాలా దూరంగా  అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి. 

    మంటల్ని అదుపు చేసేందుకు సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 


  • తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ బులిటెన్ విడుదల
    13 July 2020 4:35 PM GMT

    తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ బులిటెన్ విడుదల

    - ఇవ్వాళ కొత్తగా 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

    - ఇవ్వాళ 9 మరణాలు మొత్తం 365 చేరిన సంఖ్య

    - GHMC-926, రంగారెడ్డి-212, మేడ్చెల్-53, కరీంనగర్-86, నల్గొండ-41, ఖమ్మం-38, కామారెడ్డి-33 కేసులు నమోదు

  • అక్రమ మద్యం 972 సీసాలు పట్టివేత
    13 July 2020 3:43 PM GMT

    అక్రమ మద్యం 972 సీసాలు పట్టివేత

    కృష్ణాజిల్లా: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా షిఫ్ట్ డిజైర్ కారు లో అక్రమo గా తరలిస్తున్న 972 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమ మద్యం రవాణా కు ఉపయోగించిన కార్, ద్విచక్ర వాహనం సీజ్మ ద్యం సుమారు రూ 70 వేలు విలువ మద్యం సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

  • పీసీఐ అనుమతి లేకుండా జర్నలిస్టుల పై కేసులొద్దు..!
    13 July 2020 3:37 PM GMT

    పీసీఐ అనుమతి లేకుండా జర్నలిస్టుల పై కేసులొద్దు..!

    న్యూఢిల్లీ: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం తగదని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు..

    - సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్‌ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు..

    - రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, జీ న్యూస్‌ ఎడిటర్‌ సుధీర్‌ చౌదరిపై ఇలాగే కేసులు పెట్టారని గుర్తుచేశారు. జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే పీసీఐ అనుమతిని తప్పనిసరి చేయాలని కోరారు..

    - ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు..

  • గుత్తి జంక్షన్ వద్ద అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్
    13 July 2020 2:42 PM GMT

    గుత్తి జంక్షన్ వద్ద అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్

    - గుత్తి జంక్షన్ వద్ద అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే....

    - గుంతకల్లు డివిజన్ మరియు ఆర్ఎస్ఎల్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రధాన జంక్షన్లో 4 వైపులా - ముంబై , చెన్నై , బెంగళూరు, సికింద్రాబాద్ లకు రైళ్ళ నిర్వహణ సులభతరం...

    - గుత్తి ప్రధాన యార్డ్ పునర్నిర్మాణ పనులతో పాటు అతిపెద్ద ఎలక్రానిక్ ఇంటర్ లాకింగ్ ( ఇఐ ) వ్యవస్థను జూలై 12 , 2020 న ( నిర్దేశిత లక్ష్యంలోపునే ) దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది...

    - ఈ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థ అత్యంత ఆధునికమైన సిగ్నలింగ్ వ్యవస్థ...

    - గుత్తి స్టేషన్ యార్డు వద్ద ఏర్పాటైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థ దక్షిణ మధ్య రైల్వేలో 4 వ అతిపెద్ద ఇంటరాకింగ్ వ్యవస్థ....

    - మిగిలిన మూడు సికింద్రాబాద్ , విజయవాడ , కాజిపేట స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మూడు యార్లు ఎలక్ట్రానిక్ ఇంటరాకింగ్ వ్యవస్థలు కావు...

    - ఇప్పుడు గుత్తి స్టేషన్ వద్ద ఆధునీకరించిన మరియు పటిష్టం చేసిన సిగ్నలింగ్ వ్యవస్థ దక్షిణ మధ్య రైల్వేలో 343 రూట్లతో అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ స్టేషన్ అవుతుంది.

    - గతంలో గుత్తి స్టేషన్ వద్ద సిగ్నల్ ఆపరేషన్ నియంత్రణ రెండు చివరల ఉండే క్యాబిన్లు మరియు ఒక సెంట్రల్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ ద్వారా జరిగేది...

    - ప్రస్తుతం దీని స్థానంలో ఎలక్రానిక్ ఇంటర్ లాకింగ్ సింగిల్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకే ఆపరేటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది....

    - గుత్తి స్టేషన్ యార్డు వద్ద కేవలం 4 లైన్ల సౌకర్యంతో రైళ్ళ రాకపోకలు నేరుగా జరిగేవి . ఆధునికీకరణ పూర్తి కావడంతో ప్రస్తుతం రైళ్ల నిర్వహణ 11 లైన్ల స్థాయికి పెరిగింది..

    - గుంతకల్లు డివిజన్లో గుత్తి స్టేషన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్‌గా - ముంబై , చెన్నై , బెంగళూరు మరియు సికింద్రాబాద్ / హైదరాబాద్ లవైపు రైళ్ళను నిర్వహించడం జరుగుతున్నది.

  • 13 July 2020 2:37 PM GMT

    ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అంశంపై ముద్రగడ తో చర్చిస్తున్న కాపు జేఎసీ నేతలు..

    తూర్పుగోదావరి: కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తో భేటీ అయిన కాపు జెఎసి నాయకులు ఆరేటి ప్రకాష్ , చిన్నమిల్లి వెంకట్రాయుడు, ఉమామహేశ్వరి, అడ్డాల అనంతబాబు, వేమన శ్రీనివాస్ ములగల శ్రీనివాస్ తదితరులు


  • కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది-వి.హెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత
    13 July 2020 2:36 PM GMT

    కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది-వి.హెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత

    - రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.

    - వెంటిలేటర్లు, ఆక్సీజన్ వంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు.

    - ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.

    - కేసీఆర్ కరోనా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

    - కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే హరితహారం, ప్రాజెక్టుల పేరుతో దృష్టి మల్లిస్తున్నారు.

    - ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వం పై పోరాడాలి

    - తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి..

    - కరోనా పై బీజేపీ, టిఆర్ఎస్ దాగుడు మూతలు ఆడుతున్నాయి..

    - ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణలో లేదు.

    - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ తో కరోనా పై ఎందుకు చర్చించలేదు.

  • నెల్లూరు కోవిడ్ హాస్పిటల్స్ లో నిర్లక్ష్యంపై కొరడా
    13 July 2020 2:32 PM GMT

    నెల్లూరు కోవిడ్ హాస్పిటల్స్ లో నిర్లక్ష్యంపై కొరడా

    నెల్లూరు స్క్రోలింగ్స్: నెల్లూరు కోవిడ్ హాస్పిటల్స్ లో నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించిన అధికారులు.

    - ఇద్దరూ నర్సులు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది సస్పెన్షన్,

    - ఇద్దరు వైద్యులు,మరో ముగ్గురు డ్యూటీ డాక్టర్లు మరో ఇద్దరు నిర్వాహకులకు క్రమశిక్షణ నోటీసులు.

    - రోజువారి డాక్టర్లకు నిబంధనలపై మెమోలు .

    - పారిశుధ్య నిర్వహణ లో సమూల మార్పులు.

    - భోజన సరఫరా దారుడికి హెచ్చరికలు,మెనూ పై నిర్దుష్ట ఆదేశాలు.

    - భోజనం లో నాణ్యతా ప్రమాణాలు,వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. జేసి-2 ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు

  • AP క్వారంటైన్ విధానంలో మార్పులు
    13 July 2020 2:29 PM GMT

    AP క్వారంటైన్ విధానంలో మార్పులు

    అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం

    - అన్ని జిల్లాల కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు

    - తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు

    - గతంలో ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు ప్రాంతంగా నిర్ధారించిన ప్రభుత్వం,

    - ప్రస్తుతం కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా గుర్తించిన ఏపీ

    - విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం విధించే 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కోన్న ప్రభుత్వం

    - గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం

    - విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్ లో ఉన్న వారికి 5 రోజు, 7రోజున కోవిడ్ టెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు

    - దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల నుంచి 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్ గా కరోనా టెస్టు చేయాలని ఆదేశం

    - విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా సూచనలు జారీ

    - వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని స్పష్టం

    - రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్ గా టెస్టులు చేయాలని , 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాల్సిందిగా ఆదేశాలు

    - రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలు

    - తెలంగాణా, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ చేయాల్సిందిగా ఆదేశాలు

    - ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఇ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపిన ప్రభుత్వం

    - రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు పరిచి కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సూచనలు

    - హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎం లు, గ్రామ వార్డు వాలంటీర్, సచివాలఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు

    - ఈమేరకు ఆదేశాలు జారీ చేసిన వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి

  • వైద్యం ఖర్చు రూ. వేయి దాటితే ఆరోగ్య శ్రీ
    13 July 2020 2:24 PM GMT

    వైద్యం ఖర్చు రూ. వేయి దాటితే ఆరోగ్య శ్రీ

    అమరావతి: వైద్యం ఖర్చు రూ. వేయి దాటితే ఆరోగ్య శ్రీ - మరో 6 జిల్లాలకు విస్తరణ

    - కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వర్తింపు

    - గురువారం నుంచి ఈ 6 జిల్లాల్లో సేవలు

    - ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశాలు

    - మొత్తంగా 2200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్య శ్రీ

    - గతంలో 1059 వైద్య ప్రక్రియలే, అదికూడా అరకొర సేవలు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు భారీగా బకాయిలు

Print Article
Next Story
More Stories