Top
logo

Live Updates:ఈరోజు (జూలై-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు...

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శుక్రవారం, 10 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, పంచమి (ఉ.11:37 వరకు), పూర్వాభాద్ర నక్షత్రం (తె.05:33 వరకు) సూర్యోదయం 5:48am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 10 July 2020 10:42 AM GMT

  జనరల్ ఆస్పత్రిలో 13 కిలో లీటర్స్ సామర్థ్యం తో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు

  అనంతపురం : అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 13 కిలో లీటర్స్ సామర్థ్యం తో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

  - రోగులకు అత్యవసరమైన సమయంలో వైద్య సేవలకు వినియోగం కోసం, కోవిడ్ సమయంలో బాగా ఉపయోగపడుతున్న ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్ తెలిపారు.

  - గత నెల 25 వ తేదీ నుండి ఈ ఆక్సిజన్ ప్లాంట్ వినియోగం లోకి వచ్చిందన్నారు.

  - లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ల అవసరం తగ్గిందన్నారు.

  - త్వరితగతిన ఈ ప్లాంట్ ఏర్పాటయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల కోవిడ్ సమయంలో ఈ ప్లాంట్ హాస్పిటల్ కు బాగా ఉపయోగపడుతోందన్నారు.

  - కోవిడ్ పాజిటివ్ కేసులకు, ప్రసవాలు, పాము కాటు, విష సేవనం తదితర అన్ని శాఖలకు సంబంధించి ఆక్సిజన్ అవసరమైన అత్యవసర రోగులకు ఈ ప్లాంటు ద్వారానే ఆక్సిజన్ అందించడం జరుగుతోందని సూపరింటెండెంట్ వివరించారు.

  - దీంతో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 
 • తాడిపత్రిలో 50శాతం కరోనా కేసులు బయటనుంచి వచ్చిన వారివే: మున్సిపల్ కమిషనర్
  10 July 2020 10:38 AM GMT

  తాడిపత్రిలో 50శాతం కరోనా కేసులు బయటనుంచి వచ్చిన వారివే: మున్సిపల్ కమిషనర్

  తాడిపత్రి: పట్టణంలో వచ్చిన కరోనా కేసులలో 50% పైగా, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుండి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.

  - తాడిపత్రి పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి, తాడిపత్రి డిఎస్పి ఆర్ల శ్రీనివాసులు, అనంతపురం జిల్లా ఆర్డీఓ కులభూషణ్, తాడిపత్రి ఎమ్మార్వో అహ్మద్ ఒక సంయుక్త ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

  - తాడిపత్రి పట్టణంలో ఇప్పటి వరకు 96 కరోనా కేసులు నమోదయ్యాయని, అధికంగా కంటోన్మెంట్ జోన్ల ప్రాంతాల నుంచే వస్తున్నాయని, వాటిని నివారించడం కోసం కఠిన చర్యలు పాటించాల్సిన అవసరం ఉందని నరసింహ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

  - ఈ సమావేశంలో తాడిపత్రి డిఎస్పి ఆర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ... ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కోసం, కనీస స్వీయ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. - దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి, తాడిపత్రి ప్రాంతంలో కట్టుదిట్టంగా పోలీస్, మున్సిపల్ అధికారులు మూడు నెలలపాటు గ్రీన్ జోన్ లో ఉండే విధంగా కృషి చేశారని తెలిపారు.

  - ప్రస్తుత పరిస్థితుల్లో నానాటికీ పెరిగిపోతున్న కరోనా వ్యాధిని అరికట్టడం కోసం ప్రజలు ఖచ్చితంగా అధికారుల సూచనలు పాటించాల్సిందిగా డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు కోరారు. 

 • 10 July 2020 10:33 AM GMT

  అంబేద్కర్ గృహంలో వస్తువులను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి...

  వజ్రకరూరు: తహశీల్దార్ కార్యాలయం వద్ద గల బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలక రామాంజీనేయులు అధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులతో కలసి నిరసన తెలిపారు.

  - దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహానగరంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజగృహంలోని పూలకుండీలు, కీటీకీలు, సీసీ కెమెరాలు ఇతరత్రా వస్తువులను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలక రామాంజీనేయులు డిమాండ్ చేశారు.

  - ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బెంజమిన్, రామాంజీనేయులు, కోదండరాముడు తదితరులు పాల్గొన్నారు. • ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్ధలపై విచారణ జరిపించాలి అని డిమాండ్ చేసిన ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్
  10 July 2020 10:31 AM GMT

  ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్ధలపై విచారణ జరిపించాలి అని డిమాండ్ చేసిన ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్

  అనంతపురం: ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్ధలపై విచారణ జరిపించాలని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ డిమాండ్ చేసారు.

  - బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలతో పాటు పిఎం కేర్స్‌ నిధిపై కూడా విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ శైలజానాథ్‌ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

  - శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ట్రస్ట్‌లపై ఇడి, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం మోడీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమని తెలిపారు.

  - కాంగ్రెస్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు చైనా నుండి నిధులు వచ్చాయంటూ బిజెపి చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

  - బిజెపికే చైనా నిధులు వస్తున్నాయని, అందుకే చైనా చొరబాటుపై ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారని విమర్శించారు.

  - కరోనా సాకుతో సిబిఎస్‌ఇ సిలబస్‌ తగ్గించడంలో కేంద్రప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు. • ఏపీకి మద్యం తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్
  10 July 2020 4:23 AM GMT

  ఏపీకి మద్యం తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్

  ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం నాడు తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్ అయ్యారు.

  - పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా అక్రమ మద్యం తరలిస్తున్న పలువుర్ని అరెస్ట్ చేశారు.

  - అరెస్టయిన వారిలో కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సీఐ పులి హనుశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్.ఐ. విజయ కుమార్ (వీఆర్‌లో ఉన్నారు), ఏలూరుకు చెందిన నున్న కమల్, సంతోష్‌లు ఉన్నారు.

  - నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా.. మరో నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 • యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌!
  10 July 2020 2:42 AM GMT

  యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌!

  - ఉత్తర ప్రదేశ్ లో 8మంది పోలీసులను నిర్దాక్షిణ్యంగా చంపిన వికాస్ దుబే పోలీస్ ఎన్‌కౌంటర్‌ లో హతమయ్యాడు.

  - పోలీసులను చంపిన తరువాత వికాస్ దుబే తప్పించుకు తిరుగుతున్నాడు. 

  - అతని కోసం విస్తృతంగా గాలించిన పోలీసులు చివరకు నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని దేవాలయం వద్ద అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.

  - నిన్న రాత్రి వికాస్ దుబే ను పోలీసులు కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్ లోని ఒక వాహనం బోల్తాపడింది. 

  - ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవాలని వికాస్ దుబే ప్రయత్నిస్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వికాస్ దుబే హతమయ్యాడు. • విశాఖపట్నంలో పట్టాలు తప్పిన గూడ్స్
  10 July 2020 2:29 AM GMT

  విశాఖపట్నంలో పట్టాలు తప్పిన గూడ్స్

  పట్టాలు తప్పిన గూడ్స్..... విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ వద్ద లోడుతో వెళ్తున్న పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్....

  పట్టాల మీద నుంచి ఒరిగిన 4 బోగీలు ....

Next Story