Live Updates:ఈరోజు (జూలై-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు మంగళవారం, 07 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, విదియ్ (ఉ.09:02రకు), శ్రవణ నక్షత్రం (రా.11:56వరకు) సూర్యోదయం 5:47am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 7 July 2020 2:03 AM GMT

    నేడు కడపకు సీఎం జగన్‌

    రేపు వైఎస్‌ జయంతి సందర్భంగా ఘాట్‌ వద్ద నివాళి

    కడప: సీఎం జగన్‌ మంగళవారం తన సొంత జిల్లా కడపకు వెళ్లనున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకుని కడపకు చేరుకుని ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు వెళ్తారు.

    రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం వైఎస్‌ జయంతి వేడుకలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8.50 గంటలకు ట్రిపుల్‌ ఐటీకి చేరుకుని నూతన అకడమిక్‌ కాంప్లెక్స్‌, ఎండబ్ల్యూ సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.  సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ హరికిరణ్‌ పర్యవేక్షించారు. 

    రైతు భరోసా కేంద్రాలకు వైఎస్సార్‌ పేరు.

    అమరావతి: రైతు భరోసా కేంద్రాలను ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు’గా మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Print Article
Next Story
More Stories