Top
logo

Live Updates:ఈరోజు (జూలై-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు ఆదివారం, 06 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, పాడ్యమి (ఉ.09:21రకు), ఉత్తరాషాఢ నక్షత్రం (రా.11:12వరకు) సూర్యోదయం 5:47am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 6 July 2020 4:58 AM GMT

  పేకాట స్థావరాలపై దాడి

  కొండపి: కొండపి మండలము చోడవరం గ్రామ పంట పొలాల్లో పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40,100 రూపాయలు మరియు 6 మోటారు సైకిళ్ళు ,6 మొబైల్స్ సీజ్ చేయడమైనది. • 6 July 2020 4:54 AM GMT

  జగన్ మరో పథకం... పది వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణం

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న వ్యాపారం చేయువారికి వీధి వ్యాపారుల కోసం తోపుడు బండ్లపై గంపలలో పూలు తదితర వ్యాపారం చేసుకునే వారికి " జగనన్న తోడు " పథకాన్ని ఏపీ ప్రభుత్వం అక్టోబర్ నుండి ప్రారంభించనుంది చిన్న పాటు వ్యాపారాలు సాంప్రదాయ వృత్తులు చేసుకుని హస్త కళాకారులకు ఈ పథకం కింద పది వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు లబ్ధిదారులు గుర్తింపు కోసం నేటి జూలై 13 వరకు వాలంటీర్లు సర్వే నిర్వహిస్తుండగా జూలై 16 నుంచి 23వ తేదీ వరకు గ్రామ మరియు వార్డు సచివాలయం లో అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు

 • 6 July 2020 4:32 AM GMT

  నిరసన కార్యక్రమానికి సోషల్ డిస్టెన్స్ ఏర్పాట్లు పూర్తి చేసిన కాంగ్రెస్ నాయకులు

  కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి ఇష్టానుసారం విద్యుత్ చార్జీలను వసూలు చేయడాన్ని ఖండిస్తూ, టిపిసిసి పిలుపు మేరకు, సోమవారం ఉదయం10:45ని.కు కోర్టు చౌరస్తాలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీ లతో ప్రభుత్వానికి నిరసన తెలుపడం ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ నాయకులు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని గేటు ముందు మార్కింగ్ ఏర్పాట్లు చేసారు. • 6 July 2020 4:28 AM GMT

  జిల్లాలో 16.40 లక్షల టన్నుల ఇసుక నిల్వలు

  కాకినాడ: జిల్లాలోని పది ప్రభుత్వ యార్డుల్లో 16,40,190.70 టన్నుల ఇసుక నిల్వలున్నట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

  - జిల్లాలోని రేవుల నుంచి 23,204.50 టన్నుల ఇసుకను సేకరించగా, 22,834.50 టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు తెలిపారు.

  - డోర్‌ డెలివరీ కింద 9,928 టన్నులు, ప్రభుత్వ పనులకు 810 టన్నులు, ప్రైవేటు పనులకు 2,597 టన్నులు, నాడు-నేడు పనులకు 146 టన్నులు, ప్రభుత్వ యార్డులకు 9,353.50 టన్నులు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాలకు 2,228 టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు తెలిపారు. • 6 July 2020 4:26 AM GMT

  విశాఖ శారదాపీఠంలో చాతుర్మాస్య దీక్షలు

  విశాఖపట్నం: సనాతన హైందవ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చాతుర్మాస్య దీక్షలకు విశాఖ శారదాపీఠం శ్రీకారం చుట్టింది.

  - రిషికేష్​లోని పీఠానికి చెందిన ఆశ్రమంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ దీక్షలను చేపట్టారు.

  - సెప్టెంబరు రెండో తేదీ వరకు చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుంది. రిషికేశ్​లో ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరంలో గంగమ్మ తల్లికి పీఠాధిపతులు పూజలు చేశారు.

  - పూర్ణాహుతి అనంతరం వ్యాస పూజ నిర్వహించారు.

  - ఈ పూజలో శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తి సహా 45 మంది గురువులను ఆరాధిస్తూ అర్చన చేశారు.

  - వ్యాస పూజతో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన చాతుర్మాస దీక్షలు ప్రారంభమయ్యాయి. • 6 July 2020 4:23 AM GMT

  ఆరోగ్య కేంద్రం సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన

  మాడుగుల: మాడుగుల నియోజకవర్గం అప్పలరాజుపురంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య కేంద్రం, సామాజిక భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు శంకుస్థాపన చేశారు. - అప్పలరాజుపురం గ్రామానికి ఏడాదిలో దాదాపుగా రూ.కోటి నిధులు మంజూరు చేశామని

  - ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామన్నారు.

  - పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. • 6 July 2020 2:44 AM GMT

  కారుమంచి గ్రామంలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

  శావల్య పురం: మండలములోని కారుమంచి గ్రామములో ఎక్సైజ్ పోలీసులు 3,842 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

  - ఇందులో లారీ.. టాటా ఎసి ఆటో.. మూడు బైకులు, 09 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ ఏఐ మాధవి తెలిపారు.

  - ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని చెప్పటం విశేషం.

  - ముద్దాయిలు అందరూ శావల్య పురం మండలము కారుమంచి, వైకళ్ళు గ్రామాలకు చెందినవారు ఉన్నారు. • 6 July 2020 2:28 AM GMT

  డ్రోన్ కెమెరా ద్వారా తనిఖీలు, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

  విజయవాడ: స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లోని అజిత్ సింగ్ నగర్లో డ్రోన్ కెమెరా నేపథ్యంలో వాహనాలు తనిఖీలను పోలీసులు నిర్వహించారు.

  - కార్లు, ద్వి చక్ర వాహనాలు తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

  - తనిఖీల్లో సిఐ లక్ష్మీనారాయణ,ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

  - అదే విధంగా అజిత్ సింగ్ స్టేషన్లలో రౌడీ షీటర్లుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, రౌడీయిజం చేసినా,తేడా చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. • 6 July 2020 2:25 AM GMT

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండురోజుల కడప పర్యటన

  - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండురోజుల పాటు కడపలో పర్యటించనున్నారు.

  - వైఎస్ జయంతి వేడుకల సందర్భంగా రేపు ఎల్లుండి (జూలై 7,8) జరిగే వేడుకల్లో అయన పాల్గొంటారు 

  - ఇడుపులపాయలో నిర్వహించనున్న వేడుకల్లో అయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

 • 6 July 2020 2:15 AM GMT

  గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులు అరెస్ట్

  గుంటూరు: గుంటూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న 8 మంది డిగ్రీ విద్యార్థులను అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు.

  - ఆదివారం గుంటూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

  - విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన 8 మంది డిగ్రీ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి లిక్విడ్ బాటిల్స్ పెట్టి విక్రయిస్తున్నా రన్నారు.

  - వద్ద నుంచి 8 కేజీల గంజాయి, 30వేల నగదు, 55 గంజాయి లిక్విడ్ బాటిల్స్, 9 ఫోన్లు, ఒక ఎలక్ట్రానిక్ కాటా స్వాధీనం చేసుకున్నామన్నారు.

  - నిందితుల అరెస్టులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ఎస్పీ అమ్మిరెడ్డి రివార్డులు అందజేశారు.Next Story