Live Updates:ఈరోజు (జూలై-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శనివారం, 04 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, చతుర్దశి (ఉ.11:33రకు), మూల నక్షత్రం (రా.11:22వరకు) సూర్యోదయం 5:46am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 4 July 2020 3:41 AM GMT

    శ్రీవారి సేవలో ప్రముఖులు

    తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు.

    - విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    - రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నాను. శ్రీవారిని ప్రార్దించానని తెలిపారు.

    - ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేక పోతున్నారు.

    - అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు.

    - త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు.



  • మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు
    4 July 2020 3:38 AM GMT

    మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు

    - కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం. కావాలనే కక్షసాధింపుతోనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారు.

    - ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదు.

    - ప్రతిపక్షాలను ఇంతగా టార్గెట్ చేయలేదు. ఇంతమంది నాయకులను జైళ్లకు పంపలేదు.

    - బీసిలంటేనే వైసిపి పగబట్టింది. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.

    - ప్రతీకారేచ్ఛతో చేస్తున్న ఈ అరెస్ట్ లను ప్రతిఒక్కరూ ఖండించాలి. 

  • 4 July 2020 3:36 AM GMT

    కృష్ణాజిల్లా: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర గూడూరు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు.

    - మంత్రి పేర్నినాని సన్నిహితుడు భాస్కరరావు హత్య కేసులో నిన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో కొల్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    - ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారన్న ఉత్కంఠ నెలకొంది.

    - ప్రస్తుతం కొల్లు రవీంద్ర గూడూరు పీఎస్‌లో ఉన్నారు.

    - కాసేపట్లో ప్రభుత్వాస్పత్రిలో‌‌ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

    - వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

    - ఇదిలా ఉంటే ఉదయం 11 గంటలకు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    - భాస్కరరావు హత్య కేసులో కొల్లు ప్రమేయంపై జిల్లా ఎస్పీ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.



Print Article
Next Story
More Stories