Top
logo

Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శుక్రవారం, 03 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, త్రయోదశి (మ.01:16వరకు), జ్యేష్ఠ నక్షత్రం (రా.12:08 వరకు) సూర్యోదయం 5:46am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates

 • 3 July 2020 3:56 PM GMT

  ఏ రేవంత్ రెడ్డి ఎంపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ ద్వారా.

  #మీడియా నివేదికల ప్రకారం # covid19 టోర్నడో ప్రగతి భవన్‌ను పైనుంచి కిందికి తాకింది ..

  గురువారం రాత్రి కరోనా హెల్త్ బులెటిన్ లో18570 కేసులు చూపిస్తుంది ..

  కానీ లైవ్ డాష్‌బోర్డ్ 21393 కరోనా కేసులను చూపిస్తుంది .

  రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిస్థితిని ఇది చూపిస్తుంది.

  సరైన వివరాలతో కరోనా బులిటెన్ విడుదల చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను డిమాండ్ చేస్తున్నాం.

  కేసుల వివరాల్లోనే 3000 తేడాను చూపిస్తుంది

 • 3 July 2020 3:55 PM GMT

  తూర్పుగోదావరి:  తుని మం. సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసిన పోలీసులు..

  * విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్ర ను మధ్యలో ఆపి అరెస్ట్ చేసిన మప్టీ లో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు..

  * తుని నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో కొల్లు రవీంద్రను తీసుకువెళ్లిన పోలీసులు..

  * మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసిన పోలీసులు..

 • 3 July 2020 3:53 PM GMT

  ఆర్టీసీ లో శుభ కార్యములు , పెళ్లిళ్లు , విజ్ఞాన విహార యాత్రలకు ఇచ్చు అద్దె బస్సుల ఛార్జీలు భారీగా తగ్గడమే కాకుండా , అద్దెకు తీసుకొనే విధానాలను సరళీకృతం చేస్తూ , నిర్ణయం......

  *ఈ అవకాశాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని శ్రీ . బి . వరప్రసాద్ , రంగారెడ్డి రీజినల్ మేనేజర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.....

  *రీఫండబుల్ కాషన్ డిపాజిట్ రద్దు చేయబడినది . తద్వారా చెల్లింపులో రూ .4000 / ల నుండి రూ . 6000 / -ల వరకు లబ్ది చేకూరనుంది....

  *శ్లాబ్ విధానం రద్దు చేయబడినది తద్వారా అదనంగా చెల్లించ వలసిన కి.మీ. / సమయపు ఛార్జి రద్దు . కేవలం బస్సు తిరిగిన కి.మీ.లకు మాత్రమే ఛార్జీ వర్తింపు....

  " పికప్ మరియు డ్రాప్ " విధానం ద్వారా ప్రయాణ పరిధిని 200 కి.మీ. లోపు వరకు పెంపు ( రాను పోను కి.మీ.లు కలిపి ) . ప్రయాణీకుల బృందాన్ని కావలసిన చోట దింపి మరలా తిరుగు ప్రయాణినికి నిర్దేశించిన సమయానికి వచ్చి సేవలు అందించును....

  “ పికప్ మరియు క్రాప్ " విధానం " పల్లె వెలుగు " మరియు " ఎక్స్ ప్రెస్ " బస్సులకు వర్తింపు...

  " పికప్ మరియు క్రాప్ " విధానం లో ప్రయాణ దూరపు కి.మీ లకు మాత్రమే ఛార్జి . ఎటువంటి డిపాజిట్ లేదు . తిరిగిన కిలోమీటర్లకు సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై సాధారణ చార్టీలకు 50 % అదనం....

  *200 కి.మీ లు ఆపై దూర ప్రయాణమునకు ఎక్స్ ప్రెస్ బస్సునకు తిరిగిన కి.మీ. లకు వర్తించే సాధారణ ఛార్జీలు , సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై లెక్కింపు....

  *పల్లె వెలుగు బస్సులకు సాధారణ దార్జీలపై 10 % అదనపు ఛార్జీలు...

  *సూపర్ లగ్జరీ బస్సు అద్ది పార్టీల లెక్కింపు నకు గాను కనీస దూరం 300 కి.మీ.లు బస్సు తిరిగిన కి.మీ లకు వర్తించే సాధారణ ఛార్జీలు సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై లెక్కింపు...

  *ఏ.సి బస్సు అద్దె దార్జీల లెక్కింపు నకు గాను కనీస దూరం 400 కి.మీ.లు బస్సు తిరిగిన కి.మీ లకు వర్తించే సాధారణ చార్జీలు సీటింగ్ కెపాసిటీ ( 100 % ఓఆర్ ) పై లెక్కింపు...

  *నిర్ణీత సమయము మించి బస్సు అదనంగా వేచి వుండు సమయ ఛార్జీ ( వెయిటింగ్ ఛార్జీ ) గంటకు రూ .300 / - మాత్రమే....

 • 3 July 2020 3:51 PM GMT

  అమరావతి: యనమల రామకృష్ణుడు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత

  - కొల్లు రవీంద్రపై హత్యానేరం పెట్టడాన్ని ఖండించిన యనమల

  - ఎన్నడూ ఎటువంటి వివాదాల్లో లేని రవీంద్రను హత్యానేరంలో ఇరికించడం వైసిపి కుటిల రాజకీయానికి నిదర్శనం.

  - రాష్ట్రంలో బీసి నాయకత్వాన్ని లేకుండా చేయాలని వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.

  - టిడిపి బీసి నాయకులపై కక్ష సాధింపే ధ్యేయంగా పెట్టుకుంది.

  - అచ్చెన్నాయుడిపై, అయ్యన్నపాత్రుడిపై,తనపై పెట్టిన తప్పుడు కేసులు, కౌన్సిల్ లో బీదా రవిచంద్రపై దాడి అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.

  - కేసులు పెడితే బిసి నాయకత్వం బలహీన పడుతుంది అనుకోవడం భ్రమ.

  - కేసులు పెట్టిన కొద్దీ బీసి నాయకత్వం రాటుదేలుతుంది అనేది గుర్తుంచుకోవాలి.

  - బీసిలను టిడిపికి దూరం చేయడం అసాధ్యం.

  - వైసిపి ఎంత కక్ష సాధిస్తే బీసీలు టిడిపికి అంత దగ్గర అవుతారు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

  - టిడిపి నాయకులు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తేయాలి.

 • 3 July 2020 3:49 PM GMT

  దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మ రావు కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్

  - లాక్ డౌన్ సమయంలో కాంట్రాక్టర్ల వొద్ద 2 లక్షలు డిమాండ్ చేసిన పద్మ రావు

  - పద్మ రావు బ్లాక్ మెయిలింగ్ ఆడియోస్ ను కలెక్టర్ కు పంపిన కాంట్రాక్టర్

 • 3 July 2020 3:48 PM GMT

  విజయవాడ...

  టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవేంద్ర ను అదుపులోకి తీసుకున్న తుని పోలీసులు..రాజమండ్రి కి తరలింపు

 • 3 July 2020 3:41 PM GMT

  అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ రద్దు.

  విజయవాడ: TDP మాజీ మంత్రి MLA అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ ను ఏసిబి కోర్ట్ కొట్టేసింది .

  ESI మందుల కొనుగోలు వ్యవహారంలో ACB రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడు కు ప్రస్తుత పరిస్థితి లో బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. కాగా అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవల ఆయానున్న గుంటూరు GGH నుంచే విజయవాడ జిల్లా జైలుకు తరలించారు..అటూ ఆరోగ్యం కుడుటపదనప్పటికి అచ్చెన్నాయుడిని కావాలనే డిశ్చార్జ్ చేశారని TDP నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. • 3 July 2020 3:02 PM GMT

  నీట్ , JEE పరీక్షలు వాయిదా

  అంతా అనుకున్నట్లే జరిగింది . NEET , JEE మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది . NEET పరీక్షను సెప్టెంబర్ 13 కి వాయిదా వేసిన కేంద్రం .. JEE అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27 కి వాయిదా వేసింది .

  ఇక సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు JEE మెయిన్స్ నిర్వహిస్తామంది. కాగా చాలా విద్యా సంస్థలు క్వారెంటైన్ సెంటర్లుగా మారిన నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితి కనిపించడం లేదని కేంద్రం తెలిపింది. • 3 July 2020 7:04 AM GMT

  జనసేనాని చతుర్మాస దీక్ష!

  -  ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే గుణమున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. కరోనాతో నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని కోరుతూ ఈ దీక్షను చేపడుతున్నారు.

  - జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాతుర్మాస దీక్షను చేప‌ట్టారు. ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో అంద‌రూ బావుండాల‌ని, తిరిగి అంద‌రూ సాధార‌ణ జీవితాన్ని కొన‌సాగించాల‌ని ప‌వ‌న్ ఈ దీక్ష‌ను చేప‌ట్టారు. నాలుగు నెల‌ల పాటు ఈ దీక్ష కొన‌సాగుతుంది. దీక్ష‌లో భాగంగా ప‌వ‌న్‌ ఓ పూట మాత్ర‌మే భోజ‌నం చేస్తారు.

  - ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను న‌టిస్తోన్న‌ ‘వకీల్ సాబ్‌’ సినిమాతో పాటు క్రిష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు.

 • 3 July 2020 5:54 AM GMT

  తూర్పుగోదావరి జిల్లా.

  - చింతూరు మండలం లో భారీగా గంజాయి పట్టివేత

  - ఏజన్సీ డొంకరాయి వద్ద కంటైనర్ లారీ లో అక్రమంగా తరలిస్తున్న 64 లక్షల విలువ గల 2,164 కేజీల గంజాయి స్వాధీనం

  - కంటైనర్ సీజ్ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Next Story