Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 Oct 2020 2:39 PM GMT
East Godavari Updates: ఎటపాక శివారులోని పేకాట శిబిరంపై దాడులు..
తూర్పుగోదావరి...
- ఎటపాక..
- 6 గురు అరెస్టు, వారినుంచి 53వేల 400 నగదు స్వాధీనం
- కేసు నమోదు
- 31 Oct 2020 2:37 PM GMT
Amaravati Updates: వచ్చేనెల రెండో వారంలో రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం...
అమరావతి:
* నవంబర్ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటన
* గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్న బృందం
* పంట, ఆస్తి నష్టం అంచనాలను సిద్దం చేస్తోన్న ప్రభుత్వం
* రెండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను సమర్పించనున్న అధికారులు
* వరదల కారణంగా 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా
* సుమారు రూ.10వేల కోట్ల మేర పంట నష్టం
* రోడ్లు, వ్యవసాయ, ఆక్వా ఉద్యాన పంటలు,విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు భారీగా నష్టం
* ఆర్అండ్ బీకి సుమారు రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లు సమాచారం
* దాదాపు 2.40 లక్షల రైతులు పై వరద ప్రభావం
* ఉభయగోదావరి జిల్లాల్లో దారుణంగా దెబ్బతిన్న ఆక్వారంగం
* ప్రభుత్వం రూపొందించినవరద నష్టం నివేదికను కేంద్ర బృందానికి అందచేయనున్న ప్రభుత్వం
* తక్షణ సాయంగా రూ.1000కోట్లు అడగాలని భావిస్తున్న అధికారులు
* రోడ్ల మరమ్మత్తులు, రైతులు ఇన్ పుట్ సబ్సిడీ కోసం అత్యవసరంగా రూ.1000 కోట్లు అవసరమని అధికారుల అంచనా
- 31 Oct 2020 2:29 PM GMT
Krishna District Updates: కృష్ణా దియేటర్ సెంటర్ లో త్రాచుపాము కలకలం...
కృష్ణాజిల్లా...
- తిరువూరు కృష్ణా దియేటర్ సెంటర్ మెయిన్ రోడ్ లో మోటార్ల రిపేరింగ్ షాపులో మరమ్మత్తు కోసం తెచ్చిన మోటార్ లో త్రాచుపాము
- చాకచక్యంగా పట్టుకున్న రెస్క్యూ టీం ఉయ్యూరు జయప్రకాష్
- పాముని తీసుకెళ్లి అడవిలో వదిలారు..
- 31 Oct 2020 1:23 PM GMT
Guntur District Updates: బీ.సీ. కార్పొరేషన్ చైర్ పర్సన్ లకు, డైరెక్టర్ లకు సన్మానం....
గుంటూరు జిల్లా...
*చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో బీ.సీ. కార్పొరేషన్ చైర్ పర్సన్ లకు, డైరెక్టర్ లకు సన్మానం....
*హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి రంగనాధ రాజు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, యం.పి. లావు శ్రీ కృష్ణ దేవరాయలు.....
- 31 Oct 2020 12:24 PM GMT
Raj Bhavan: రాజ్ భవన్ లో జాతీయ ఐక్యతా దినోత్సవం..
రాజ్ భవన్..
-సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్.
-ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ కు నివాళులు.
-భారత తొలి ఉప ప్రధాన మంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాజ్ భవన్ లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు.
-రాజ్ భవన్ ఆఫీసర్లు, సిబ్బందిచే రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు పాటుపడతామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
-ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను విలీనం చేసి భారత ఐక్యతకు చేసిన కృషి గవర్నర్ ఈ సందర్భంగా గుర్తుచేసి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.
- 31 Oct 2020 11:51 AM GMT
Kurnool District Updates: కర్నూలు జోహారపురంలో క్షుద్రపూజల కలకలం...
కర్నూలు జిల్లా...
// అర్థరాత్రి షాపు ఎదుట నిమ్మకాయలు, పుర్రె తో పూజలు..
// భయాందోళనలో స్థానికులు...
// గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందన్న ప్రజలు...
- 31 Oct 2020 11:49 AM GMT
Kurnool District Updates: గుమ్మనురు జయరాం ను అడ్డుకున్న డీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు......
కర్నూలు......
- కర్నూలు కలెక్టరేట్ వద్ద కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం ను అడ్డుకున్న డీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు......
- మేనేజ్మెంట్ కోటాలో, స్పాట్ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో,విద్యార్థి నాయకుల అరెస్టు.......
- 31 Oct 2020 11:44 AM GMT
Amaravati Updates: ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయ పూర్వక శుభాకాంక్షలు...
అమరావతి
* క్షేత్ర స్థాయికి అభివృద్ధి ఫలాలు: రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది
* ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్యం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలి.
* ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక వంటిదని ఆ మేరకు పాలన సాగాలని ఆకాంక్ష.
* రాబోయే రోజుల్లో పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ముఖ్య లక్షణంగా ఉండా లి
* సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలలో గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా
- 31 Oct 2020 11:40 AM GMT
Vizianagaram Updates: సాలూరు ఎమ్మార్వో ఆఫీసు వద్ద సీపీఎం శికపరువు గ్రామస్తుల ఆందోళన...
విజయనగరం..
* సాలూరు ఎమ్మార్వో ఆఫీసు వద్ద సీపీఎం నాయుకుల ఆద్వర్యంలో శికపరువు గ్రామస్తులు ఆందోళన.
* శికపరువు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వ్యతిరేకిస్తే కేసులు పెడతామని సిఐ సింహాద్రినాయుడు తమని బెదిరింపులు చేస్తున్నారంటూ ఆందోళన
* మైనింగ్ కి ఊరంతా అనుకూలంగా వుండాలని, లేనిచో ఇబ్బందులు తప్పవని హెచ్చరింస్తున్న సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రినాయుడు.
* తమ గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ లపై చర్యలు తీసుకోవాలని సాలూరు ఎమ్మార్వోని డిమాండ్.
- 31 Oct 2020 11:35 AM GMT
Vijayawada Updates: సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్ళు...
విజయవాడ
- సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
- నవంబరు 6 నాటికి సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్ళు
- దేశ చరిత్రలో తొలిసారిగా అన్ని రంగాలలో రికార్డ్ సృష్టించారు సీఎం జగన్
- సీఎం జగన్ దేశంలోనే అరుదైన రాజనీతిజ్ఞుడు
- చిన్న వయసులోనే నిజమైన ప్రజా నాయకుడుగా ఉన్నారు
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అభిమానులే కాకుండా రాష్ట్రమంతా ఒక మాఫియా ముఠాలాంటి పాలన నుంచీ బయటడ్డాయి
- చరిత్రలోనే ఒకే జాబితాలో 175 మంది ఎంఎల్ఏ లను ప్రకటించిన ఏకైక నాయకుడు సీఎం జగన్
- గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఒక విజయం
- బడుగు, బలహీన వర్గాలు, స్త్రీలు ఎక్కువ మంది సచివాలయాలలో ఉద్యోగులు
- ఇంగ్లీషు మీడియంలో చదువు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడే కుటుంబాలకు, ఇంగ్లీషు చదువు వచ్చింది
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ మహిళా పక్షపాతి
- అన్ని స్కూళ్ళనూ నాడు-నేడు లో భాగంగా అభివృద్ధి చేస్తున్నాం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire