Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 31 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం త్రయోదశి (ఉ. 8-35 వరకు) తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం (మ. 3-53 వరకు) తదుపరి ధనిష్ఠ, అమృత ఘడియలు (ఉ. 6-57 వరకు) వర్జ్యం (రా. 8-02 నుంచి 9-42 వరకు) దుర్ముహూర్తం (మ. 12-25 నుంచి 1-15 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-44 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-13
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 Aug 2020 9:42 AM IST
Amaravati updates: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ..
అమరావతి..
-ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ.
-రాష్ట్రంలో దళితులపై దాడులు ప్రభుత్వంపై విమర్శలు నేపథ్యంలో నిరసన చేపట్టనున్న వైసీపీ.
-దళితులూ వర్సెస్ చంద్రబాబు పేరుతో నిరసనలకు పిలుపు.
-నిరసనలో పాల్గొననున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,ప్రజాప్రతినిధులు.
-దళితులపై జరిగే దాడులను రాజకీయ కోణంలో ప్రభుత్వానికి ముడి
-పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు.
-సెప్టెంబర్ మొదటి వారంలో దళితులపై దాడులు వాస్తవాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్న వైసీపీ.
- 31 Aug 2020 9:34 AM IST
Prakasam District updates: పెర్నమిట్ట లో జడ్పీ పాఠశాల లో నాడు నేడు కార్యక్రమంలో పనులు..
ప్రకాశం జిల్లా....
-పెర్నమిట్ట లో జడ్పీ పాఠశాల లో నాడు నేడు కార్యక్రమంలో పనులు పై ఆర్ టి యాక్ట్ పెట్టేందుకు వెళ్లిన దళితుడి పై అగ్రవర్ణాల మూకుమ్మడి దాడికి ప్రయత్నం..
-జిల్లా ఎస్పీ కి వాట్సప్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..
-దళితుడువు అంటూ విరుచుకు పడ్డ పెర్ణమిట్టా వైసీపీ నేత...
-పోలీసులు వైసీపీ నేత ఫిర్యాదు తో ఆర్ టి యాక్ట్ పెట్టేందుకు వెళ్లిన వెంకట్రావు పై కేసు నమోదు చేసేము అంటూ బేరింపు....
-రాష్ట్రంలో వరుసగా దళితులు పై వైసీపీ నేతలు దాడులు...
- 31 Aug 2020 9:16 AM IST
Kurnool District updates: మహానంది ఆలయంలో పూర్తిగా ఆంక్షల సడలింపు..
కర్నూల్..
-మహానంది ఆలయంలో పూర్తిగా ఆంక్షల సడలింపు
-ఆర్జిత సేవలు అన్నీ యదావిధిగా పునరుద్ధరణ
-స్వామివారి దర్శన సమయం కూడా గతంలో మాదిరిగానే ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగింపు
-గర్భాలయ ప్రవేశం స్వామివారి స్పర్శ దర్శనం తప్ప మిగిలిన సేవలన్నీ కొనసాగిస్తాం..ఈఓ మల్లికార్జున ప్రసాద్
- 31 Aug 2020 9:05 AM IST
Vijayawada updates: డీఎంహెచ్ఓ రమేష్ కు రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల పూర్తి..
విజయవాడ..
-డీఎంహెచ్ఓ రమేష్ కు రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల పూర్తి
-ఆయనను విధుల నుంచీ రిలీవ్ చేసిన ప్రభుత్వం
-గుంటూరు సీనియర్ మెడికల్ ఆఫీసరుగా ఉన్న టీ.వీ.ఎస్.ఎన్.శాస్త్రికి కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓ గా అదనపు బాధ్యతలు
-నేడు డీఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టనున్న టీ.వీ.ఎస్.ఎన్.శాస్త్రి
-స్వర్ణప్యాలెస్ ఘటనపై ఎఫ్ఐఆర్ లో అధికారుల పేర్లు చేర్చనందుకు హై కోర్టు స్టే నేపథ్యంలో డీఎంహెచ్ఓ రిటైర్మెంట్ కు ప్రాధాన్యత
-కోవిడ్ కేర్ సెంటర్లకు డీఎంహెచ్ఓ అనుమతులిచ్చారన్న ప్రైవేటు యాజమాన్యాలు
-డీఎంహెచ్ఓ రిటైర్మెంట్ పై సర్వత్రా చర్చ
- 31 Aug 2020 7:25 AM IST
Visakhapatnam updates: ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట..
విశాఖ..
-ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట..
-సీపీఎస్ రద్దు పై రాష్ట్ర వ్యాప్తంగా రేపు చేపట్ఠనున్న నిరసనలకు విశాఖ జిల్లా సభ్యులు మద్దతు
-ఈరోజు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్న ఉపాధ్యాయ సంఘాలు.
- 31 Aug 2020 7:12 AM IST
Anantapur District Updates: నేడు హిందూపురం లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన..
అనంతపురం:
-నేడు హిందూపురం లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన..
-హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు అందించనున్న ఎమ్మెల్యే
-స్థానికంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బాలకృష్ణ.
-హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలని కొనసాగుతున్న ఆందోళన.
-కరోనా వ్యాప్తి తో కొన్ని రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నా బాలయ్య.
-బాలయ్య రాకతో పార్టీ కేడర్లో నూతనోత్సాహం.









