Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 Sept 2020 1:34 PM IST
నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు
కేటీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రమంత్రి, ట్విట్టర్ ద్వారా
- నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.
- జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది.
- ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం.
- కొన్ని మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది.
- 30 Sept 2020 11:36 AM IST
Nizamabad updates: రెంజల్ మండల అగ్రికల్చర్ ఏఈఓ భాగ్యశ్రీ ఆత్మహత్యాయత్నం..
నిజమాబాద్:
--ఇద్దరు యువకులు వేధింపులే కారణం అంటున్న బంధువులు
--బోధన్ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది...
- 30 Sept 2020 11:34 AM IST
Hyderabad updates: ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముట్టడి..
ఖైరతాబాద్..
-టాక్స్ రద్దు పై డిమాండ్ చేస్తూ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానుల ఆందోళన...
-భారీగా పోలీసుల మోహరింపు
-లాక్ డౌన్ సమయంలో మూడు నెలలుగా షెడ్ లకే పరిమితమైన టూర్స్ అండ్ ట్రావెల్స్ వాహనాలు
-మరో మూడు నెలలు అనుమతులు వచ్చిన ప్రజల వినియోగించుకోకపోవడం తో ఆర్థికంగా చితికిపోయామంటున్న ట్రావెల్స్ నిర్వాహకులు
- 30 Sept 2020 10:33 AM IST
Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
సరస్వతి బ్యారేజ్..
-20 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 117.00 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 6.63 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు
- 30 Sept 2020 10:27 AM IST
Lakshmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ప్రవాహం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
లక్ష్మీ బ్యారేజ్...
-46 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 92.60 మీటర్లు
ఇన్ ఫ్లో 1,67,700 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 2,29,200 క్యూసెక్కులు
- 30 Sept 2020 10:21 AM IST
Babri Masjid updates: నేడు బాబ్రీ మజీద్ కూల్చివేత తీర్పు..
పాత బస్తి..
-నేడు బాబ్రీ మజీద్ కూల్చివేత తీర్పు సంధర్భంగా తెలంగాణ లో పోలీస్ శాఖ అలర్ట్...
-పాత బస్తి పరిసర ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
-రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లలో ఆదనవు భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.
-తీర్పు నేపథ్యంలో ఎలాంటి నిరసనలు, ర్యాలీలు నిషేధం అన్న పోలీసులు..
-నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.
- 30 Sept 2020 8:42 AM IST
Kamareddy updates: జుక్కల్ మండలంలో చిరుత సంచారం..
కామారెడ్డి :
-జుక్కల్ మండలం హసన్ పల్లి, హెడ్ స్లయిస్ శివారులో చిరుత సంచారం
-భయాందోళన లో గ్రామస్థులు.
-హసన్ పల్లి శివారులో చిరుత పాద ముద్రలు గుర్తించిన గ్రామస్థులు
-అటవీ ప్రాంతానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలిలని అధికారుల సూచన.
- 30 Sept 2020 8:39 AM IST
Nizamsagar Project: నిజాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద ప్రవాహం..
కామారెడ్డి :
-ఇన్ ఫ్లో 5473 క్యూసెక్కులు
-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు 17 టి.ఎం.సీలు.
-ప్రస్తుతం నీటిమట్టం 1397 అడుగులు 8.642 టి.ఎం.సి.లు.
- 30 Sept 2020 8:32 AM IST
Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ గేట్ల మూసివేత..
నిజామాబాద్ :
-ఎగువ ప్రాంతాల నుంచి తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
-ఇన్ ఫ్లో 77118 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో. 51628 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 90.313 టి.ఎం.సి.ల సామర్ధ్యం
-ప్రస్తుతం 88.112 టి.ఎం.సి.లు.
-లక్ష్మీ, సరస్వతి, కాకతీయ కాలువలు, వరద కాలువకు కొనసాగుతున్న నీటి విడుదల.
- 30 Sept 2020 8:20 AM IST
Nizamabad Elections: స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఉప ఎన్నికలు..
నిజామాబాద్ :
-స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.ఉప ఎన్నికకు పోలింగ్ కేంద్రాలను పెంచుతూ.. ఎన్నికల సంఘం నిర్ణయం.
-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కు గతం లో నిర్ణయం. ..
-కోవిడ్ నేపధ్యం లో 50 కేంద్రాలు పెంచాలని జిల్లా అధికారుల నివేదిక, ఆమోదించిన ఎన్నికల సంఘం.









