Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 30 Sep 2020 9:41 AM GMT

    బాబ్రీ మసీదు కేసు తీర్పు దురదృష్టకరం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

    అనంతపురం: బాబ్రీ మసీదు కేసు తీర్పు దురదృష్టకరం.

    - జడ్జీల తీర్పులు ప్రభుత్వాలకు అనుకూలంగా వస్తున్నాయి.

    - బాబ్రీ ని కూల్చిన రోజు ఉమాభారతి, మురళి మనోహర్ జోషి వంటి వారు డాన్స్ చేయలేదా...

    - సాక్షాలు లేవని కేసు కొట్టేయడం ఆశ్చర్యం..

    - జడ్జీలు రిటైర్డు అయ్యాక రాజ్యసభ సభ్యుల వంటి పదవులు పొందుతున్నారు

  • SRIKAKULAM:  శ్రీకాకుళం టీడీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు
    30 Sep 2020 9:34 AM GMT

    SRIKAKULAM: శ్రీకాకుళం టీడీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు

    శ్రీకాకుళం జిల్లా: పొందూరు మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు..

    - తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూన రవికుమార్ ఎన్నికైన విషయంలో సన్మానానికి సిద్ధం చేస్తున్న టీడీపీ నాయకులు..

    - అదే సమయంలో ఆ కార్యాలయం వద్దనే వైస్సార్సీపి కార్యాలయ ప్రారంభానికి సిద్ధం చేస్తున్న వైసీపీ నాయకులు..

    - గతంలో ఈ కార్యాలయంపై స్థానిక వైసీపీ నేత గుడ్ల మోహనరావు తమదే అంటూ పోలీసులకు ఫిర్యాదు..

  • TTD NEWS: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభ రాజు
    30 Sep 2020 9:29 AM GMT

    TTD NEWS: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభ రాజు

    అమరావతి: పద్మశ్రీ డాక్టర్ శోభ రాజును టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    - రెండు సంవత్సరాల పాటు ఆ స్థానంలో కొనసాగనున్న శోభ రాజు

  • TTD NEWS: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభ రాజు
    30 Sep 2020 9:29 AM GMT

    TTD NEWS: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డాక్టర్ శోభ రాజు

    అమరావతి: పద్మశ్రీ డాక్టర్ శోభ రాజును టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    - రెండు సంవత్సరాల పాటు ఆ స్థానంలో కొనసాగనున్న శోభ రాజు

  • Babri Masjid Case: బాబ్రీ కేసును కొట్టేయడం సంతోషదాయకం -స్వరూపానందేంద్ర
    30 Sep 2020 9:21 AM GMT

    Babri Masjid Case: బాబ్రీ కేసును కొట్టేయడం సంతోషదాయకం -స్వరూపానందేంద్ర

    బాబ్రీ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందన

    - ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది -స్వరూపానందేంద్ర

    - 28 ఏళ్ళ నిరీక్షణకు తెరపడటం ఆనందాన్నిచ్చింది -స్వరూపానందేంద్ర

    - ఈ తీర్పుతో బాబ్రీ వివాదానికి పూర్తిగా తెరపడింది -స్వరూపానందేంద్ర

    - కేసులో ఉన్నవారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా -స్వరూపానందేంద్ర

    - మోడీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం తరపున అభినందనలు -స్వరూపానందేంద్ర

  • kakinada News: కాకినాడ మడ అడవుల నరికివేత  పిటిషన్ పై విచారణ
    30 Sep 2020 9:17 AM GMT

    kakinada News: కాకినాడ మడ అడవుల నరికివేత పిటిషన్ పై విచారణ

    అమరావతి: కాకినాడ మడ అడవుల నరికివేత అంశంపై దాఖలైన పిటిషన్ పై విచారణ

    కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం

    రిప్లయ్ కౌంటర్ పిటిషన్ ధాఖలు చేసేందుకు సమయం కోరిన పిటిషనర్ తరుపు న్యాయవాది..

    విచారణ రెండువారాలు వాయిదా వేసిన హైకోర్టు..

  • 30 Sep 2020 9:14 AM GMT

    అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిందే: పశు సంవర్ధక‌ శాఖామంత్రి

    విజయవాడ: పశు సంవర్ధక‌ శాఖామంత్రి, సీదిరి అప్పల్రాజు

    - సచివాలయ పరీక్షల్లో పశు సంవర్ధక శాఖ పోష్టులు ఆ అర్హత ఉన్న వారికి రిజర్వు అయి ఉంటాయి

    - డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది లేదు

    - అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిందే

    - తొంభై శాతం ప్రశ్నలు సిలబస్ లో లేనివి వచ్చాయన్న ఫిర్యాదుపై చర్చిస్తాం

    - ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళతాను

    - పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న పరీక్షలు కనుక వారితో చర్చించి నిర్ణయిస్తాం

    - అభ్యర్ధులు అధైర్యపడవద్దు

    - గ్రేస్ మార్కులు కలపడంపై పరీక్షలు నిర్వహించే డిపార్ట్మెంట్ తో చర్చిస్తాం

  • Vishaka patnam: దేవాలయాలపై దాడులు అరిష్టం: శ్రీనివాస నంద స్వామి
    30 Sep 2020 7:57 AM GMT

    Vishaka patnam: దేవాలయాలపై దాడులు అరిష్టం: శ్రీనివాస నంద స్వామి

    విశాఖ: రాష్ట్రంలో దేవాలయాలు పై దాడులు జరగడం ను నిరసిస్తూ సాధుపరిషత్ స్వామిజీ శ్రీనివాసనంద శాంతి యజ్ఞం..

    - దేవతామూర్తులు విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు అగ్నికి ఆహుతి కావడం అరిష్టాం...

    - రాష్ట్రం సుభీక్షంగా వుండాలని కాంక్షిస్తూ శాంతి యజ్ఞం నిర్వహించాం..

    - దేవాలయ పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

  • బాపూజీ మ్యూజియం
    30 Sep 2020 7:54 AM GMT

    బాపూజీ మ్యూజియం

    విజయవాడ: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తో అత్యంత సుందరంగా సిద్ధం అయిన బాపూజీ మ్యూజియం

    - అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు నాయకులు.  

    - ఎప్పటికప్పుడు దగ్గర ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్న పురావస్తు కమిషనర్ వాణీమోహన్

    - త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చే ప్రారంభించనున్న బాపూ మ్యూజియం

  • Agriculture Bill: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సిపిఎం రిలే నిరాహారదీక్ష.
    30 Sep 2020 7:47 AM GMT

    Agriculture Bill: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సిపిఎం రిలే నిరాహారదీక్ష.

    శ్రీకాకుళం జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సిపిఎం రిలే నిరాహారదీక్ష..

    - దీక్షలో భాగంగా రైతు చైతన్య సదస్సు..

    - పాల్గొన్న మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు..

    - నగదు బదిలీ వద్దు.. ఉచిత విద్యుత్ రైతుల హక్కు అంటూ నినాదాలు..

    - 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్..

Print Article
Next Story
More Stories