Top
logo

Live Updates: ఈరోజు (ఆగస్ట్-30) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (ఆగస్ట్-30) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 30 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ద్వాదశి (ఉ. 9-05 వరకు) తదుపరి త్రయోదశి, ఉత్తరాషాఢ నక్షత్రం (మ. 3-32 వరకు) తదుపరి శ్రవణ, అమృత ఘడియలు (ఉ. 9-05 నుంచి 10-42 వరకు తిరిగి తె. 5-19 నుండి) వర్జ్యం (రాత్రి 7-35 నుంచి 9-12 వరకు) దుర్ముహూర్తం (సా. 4-34 నుంచి 5-24 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-14

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 30 Aug 2020 8:13 AM GMT

  Nirmal district updates: బైంసాలో ‌ప్రారంభమైన గణేష్ నిమజ్జనం శోభాయాత్ర..

  నిర్మల్ జిల్లా....

  -బైంసాలో ‌ప్రారంభమైన గణేష్ నిమజ్జనం శోభాయాత్ర..

  -గణేష్ కు పూజలు నిర్వచించి, శోభయాత్రను ప్రారంభించిన ఎస్పీ విష్ణవారియర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి..

  -నిమజ్జనం సందర్భంగా ‌బారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..

 • 30 Aug 2020 7:04 AM GMT

  Hyderabad latest updates: ఇందిరా భవన్ లో మాజీ ప్రధాని పీవీ.నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు...

  -ఇందిరా భవన్ లో మాజీ ప్రధాని పీవీ.నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు...

  -పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రులు గీతారెడ్డి ,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,విహెచ్,కొండా విశ్వేశ్వర రెడ్డి తదితరులు..

  -జూమ్ యాప్ ద్వారా పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్,తెలంగాణ ఇంచార్జ్ ఆర్సీ .కుంతియా..

 • 30 Aug 2020 6:55 AM GMT

  Hyderabad latest news: పంజాగుట్ట యువతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు..

  -పంజాగుట్ట యువతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు

  -డాలర్ బాయ్ అలియాస్ రాజా శ్రీరెడ్డి కోసం వెతుకుతున్న సిసిఎస్ పోలీసులు

  -డాలర్ బాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేసిన సీసీఎస్ పోలీసులు

  -డాలర్ నిర్వహిస్తున్న కార్యాలయంలో కొంత మంది అమ్మాయిల సర్టిఫికెట్లు గుర్తించిన సిసిఎస్ పోలీసులు

  -ఆ సర్టిఫికెట్స్ ఈ కార్యాలయంలో కి ఎలా వచ్చాయి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  -సర్టిఫికెట్ లో ఉన్న అమ్మాయిల వివరాలు సేకరిస్తున్న సిసిఎస్ పోలీస్

  -డాలర్ బాయ్ కార్యాలయంలో పలు ఆడియో వీడియో టేపులను గుర్తించిన సీసీఎస్ అధికారులు

  -డాలర్ బాయ్ పై ఇప్పటికే పలు జిల్లాలో కేసులు నమోదు

  -డాలర్ బాయ్ వ్యవహారంలో బయటకొస్తున్న సంచలన విషయాలు

  -గతంలోనే సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన డాలర్ బాయ్ భార్య

  -రాజ శ్రీ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ పేరు చెప్పి మోసాలకు పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 • 30 Aug 2020 6:52 AM GMT

  Hyderabad Latest News: పాతబస్తీ లో మొహరం సంతాప దినాలు..

  హైదరాబాద్:

  పాతబస్తీ..

  మొహరం..

  -Covid-19 నిబంధనలు అనుసరించి డబిర్పుర నుండి ప్రారంభమైన బినిక అలం..

  -డీసీఎం లో 15 మంది సభ్యులతో బిబి కా అలం ఊరేగింపు నిర్వహించిన షియా మత పెద్దలు..

  -మొహరం సంతాప దినాలు సందర్భంగా వారీ వారి ఇండ్లలోనే మతాన్ని రక్తాన్ని సమర్పించిన షియా ముస్లిం..

  -పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ సాగుతున్న మొహరం సంతాపదినాలు..

  -పాల్గొంటున్న షియా ముస్లింలు..

 • Siddipet district updates: సిద్ధిపేట పట్టణంలో డ్రైడే పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు..
  30 Aug 2020 5:47 AM GMT

  Siddipet district updates: సిద్ధిపేట పట్టణంలో డ్రైడే పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు..

  సిద్ధిపేట:

  -సిద్ధిపేట పట్టణంలో డ్రైడే పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు.

  -పట్టణ ప్రగతిలో భాగంగా 20వ వార్డు ముర్షద్ గడ్డలో డ్రైడేలో పాల్గొని ఇంటింటా కలియ తిరిగిన మంత్రి.

  -ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి రాకుండా    చూడాలని ప్రజలకు మంత్రి సూచించారు.

  👉డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి.

 • 30 Aug 2020 4:10 AM GMT

  Karimnagar district updates: ఏలబోతారం లో ఎలుగుబంటి సంచారం...

  కరీంనగర్ :

  -కరీంనగర్ రూరల్ ఏలబోతారం లో ఎలుగుబంటి సంచారం

  -గ్రామం లో పలు మార్లు సంచరించిన ఎలుగుబంటి...

  -భయాందోళనలో గ్రామస్థులు ....

 • 30 Aug 2020 4:07 AM GMT

  Telangana updates: బీజేపీ రాష్ట్ర నూతన పదాధికారుల మొట్టమొదటి సమావేశం .

  తెలంగాణ..

  -బీజేపీ రాష్ట్ర నూతన పదాధికారుల మొట్టమొదటి సమావేశం .

  -11 గంటలకు పార్టీ అధ్యక్షుడు బండిసంజాయ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది.

  -ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన     కార్యదర్శి సౌధన్ సింగ్, బిజెపి రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణ దాస్, ఎన్.రామచందర్ రావు, రాజా సింగ్ లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు.

  -ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు , ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పైన చర్చ.

 • 30 Aug 2020 4:03 AM GMT

  Mulugu district updates: ప్రమాద కర స్థాయిలో పొంగిపొర్లనున్న గోదావరి..

  ములుగు జిల్లా..

  -ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద ప్రమాద కర స్థాయిలో పొంగిపొర్లనున్న గోదావరి.

  -ఎగువన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, చత్తీస్ గర్డ్ లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న భారీ వరద.

  -మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 12 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల,

  -ఏటూరునాగారం ,

  -రామన్నగూడెం, మంగపేట , అక్కినపల్లి మల్లారం పలు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించిన ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

 • 30 Aug 2020 3:53 AM GMT

  Sri Ram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

  నిజామాబాద్..

  -శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

  -ఇన్ ఫ్లో 12, 935 వేల క్యుసెక్కులు

  -ఔట్ ఫ్లో 6928 క్యూసెక్కుల

  -పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

  -ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులు

  -నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు

  -ప్రస్తుతం 82 టిఎంసీలు

 • 30 Aug 2020 3:49 AM GMT

  Nizamabad updates: వినాయక శోభాయాత్రకు అధికారుల అనుమతి

  నిజామాబాద్:

  -వినాయక శోభాయాత్రకు అధికారుల అనుమతి

  -వచ్చే నెల 1 న నగరం లో వినాయక నిమజ్జన శోభాయాత్ర.

  -కోవిడ్ నిబంధనల మేరకు శోభాయాత్ర : సార్వ జనిక్ గణేష్ మండలి.

Next Story