Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 28 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి మ.1-17 తదుపరి త్రయోదశి | పూర్వాభాద్ర నక్షత్రం ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha Updates: కూర్మన్నపాలేం లో విషాదం...
    28 Oct 2020 4:35 PM GMT

    Visakha Updates: కూర్మన్నపాలేం లో విషాదం...

    విశాఖ

    - ఎద్దు వెనుక నుంచి పొడవడంతో నల్లి వసంతరావు అనే వృద్దుడు మృతి

    - కూర్మన్నపాలేం వద్ద కొబ్బరిబొండాలు అమ్ముతుండగా ఘటన

    - ఆసుపత్రికి తరిలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టరు వెల్లడి

  • Nellore District Updates: నెల్లూరు జిల్లాలో వివాదంగా మారిన ఓ హెలికాప్టర్ ల్యాండింగ్...
    28 Oct 2020 4:33 PM GMT

    Nellore District Updates: నెల్లూరు జిల్లాలో వివాదంగా మారిన ఓ హెలికాప్టర్ ల్యాండింగ్...

    నెల్లూరు :--

    -అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో తమ బంధువుల వివాహానికి హెలికాప్టర్ లో వచ్చి హాజరైన హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం.

    -ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామంలోని హై స్కూల్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన విషయంపై సీరియస్ అయిన జిల్లా ఉన్నతాధికారులు.

    -హెలికాప్టర్ ల్యాండ్ అయిన రేవూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ మరియు హెలికాప్టర్ లో వచ్చిన వారిపై కేసు నమోదు చేసేందుకు విచారణ చేపట్టిన పోలీసులు..

  • Amaravati  Updates: క్యాంపు కార్యాలయంలో సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి వేణుగోపాలకృష్ణ...
    28 Oct 2020 4:31 PM GMT

    Amaravati Updates: క్యాంపు కార్యాలయంలో సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి వేణుగోపాలకృష్ణ...

     అమరావతి

    -బీసీ సంక్షేమ కృషీవలుడు సి.ఎం. జగన్మోహన్ రెడ్డి:

    -బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ

    - బీసీ కార్పోరేషన్లు, బీసీ సంక్షేమ పధకాలు, శాఖపరమైన సమస్యలపై చర్చించిన మంత్రి.

    -కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పోరేషన్లకు సంబంధించి సి.ఎం. జగన్మోహన్ రెడ్డితో చర్చించిన మంత్రి

    -వెనుబడిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు

    -56 బీసీ కార్పోరేషన్లకు 56 ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు కలిపి మొత్తం 720 మంది బీసీలకు ప్రభుత్వంలో సి.ఎం. జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కల్పించారు.

    -సి.ఎం జగన్మోహన్ రెడ్డి బడుగుబలహీన వర్గాల మనస్సులో చిరస్ధాయిగా నిలిచిపోతారు : మంత్రి వేణు

  • Krishna District Updates: అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత...
    28 Oct 2020 4:28 PM GMT

    Krishna District Updates: అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత...

    కృష్ణాజిల్లా

    - ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

    - ఏలూరు నుండి విజయవాడ వైపు తరలిస్తున్న గంజాయి

    - పోలీసులను చూసి భయంతో కారు వదిలి పరారైన దుండగులు

  • Amaravati Updates: వసంతవాడ వాగు ప్రమాదంపై స్పందించిన ఏపీ ప్రభుత్వo...
    28 Oct 2020 4:27 PM GMT

    Amaravati Updates: వసంతవాడ వాగు ప్రమాదంపై స్పందించిన ఏపీ ప్రభుత్వo...

     అమరావతి

    *ఒక్కోి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటన

    *వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ద్వారా ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.18 లక్షలు అందజేయనున్న ప్రభుత్వం

    *మృతి చెందిన ఆరుగురు కూడా విద్యార్థులు, యువకులు కావడంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని భరోసా...

    *జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, SP నారాయణ నాయక్, పోలవరం MLA తెల్లం బాలరాజు తో ఫోన్ లో మాట్లాడి ఘటన పై మంత్రి ఆళ్ల నాని ఆరా...

    *ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశం...

  • Amaravati Updates: ఎస్ఈసీ-సీఎస్ భేటీలో రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై చర్చ...
    28 Oct 2020 2:48 PM GMT

    Amaravati Updates: ఎస్ఈసీ-సీఎస్ భేటీలో రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై చర్చ...

    అమరావతి

    - వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు కరోనా బారిన పడ్డారని ఎస్ఈసీ లెక్కలతో వివరించిన సీఎస్.

    - కీలకమైన పోలీసు శాఖలో వేల సంఖ్యలో కరోనా కేసులున్నట్టు ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన సీఎస్.

    - ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహాణ అనేది కష్టమనే భావనను వ్యక్తం చేసిన సీఎస్ నీలం సాహ్నీ.

    - పరిస్థితులు కుదటపడగానే ఎస్ఈసీని సంప్రదిస్తామని వెల్లడి.

    - కరోనా పరిస్థితులను ఎస్ఈసీకి ఎప్పటికప్పుడు వివరిస్తామన్న సీఎస్.

  • Somu Veerraju: దళిత, బిసి రైతుల పై అక్రమంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి...
    28 Oct 2020 2:46 PM GMT

    Somu Veerraju: దళిత, బిసి రైతుల పై అక్రమంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి...

     అమరావతి

    * సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

    * రాజధాని ప్రాంత రైతులను‌ బేషరతుగా విడుదల చేయాలి

    * అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులు తమ గోడు చెప్పుకోవడాన్ని నేరంగా భావించడం సరి కాదు

    * ప్రజా స్వామ్యంలో తమ సమస్య లను చెప్పుకునే హక్కు అందరకీ ఉంటుంది

    * తీవ్రమైన నేరం చేసిన వారిలా.. ఉగ్రవాదుల్లా సంకెళ్లతో తీసుకెళ్లడం అప్రజాస్వామికం

  • Visakha updates: విశాఖ విద్యుత్ ,ట్రాఫిక్ సమస్యలు తీర్చే యోచనలో ప్రభుత్వం వుంది....
    28 Oct 2020 2:39 PM GMT

    Visakha updates: విశాఖ విద్యుత్ ,ట్రాఫిక్ సమస్యలు తీర్చే యోచనలో ప్రభుత్వం వుంది....

     విశాఖ

    - మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

    - త్వరలో ఎన్ ఏ. డి ఫ్లై ఓవర్ పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

    - బీచ్ కారిడార్ అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ద వుంది.

    - బీచ్ ట్రాఫిక్ తగ్గించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.

    - విశాఖ పరిపాలన రాజధానితో పాటు టూరిజం రాజధానిగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

  • Amaravati Updates: విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం...
    28 Oct 2020 2:08 PM GMT

    Amaravati Updates: విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం...

      అమరావతి

    // విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం

    // పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన పట్ల గవర్న ర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర     దిగ్ర్భాంతి

    // వసంతవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకోగా, ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం

    // భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లాగా, సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన       గొట్టుపర్తిమనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18) గల్లంతయ్యారు.

    // గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు.

    // విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరి చందన్

    // పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు

  • Srikakulam Updates: అధికారులు పై స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు..
    28 Oct 2020 1:58 PM GMT

    Srikakulam Updates: అధికారులు పై స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు..

       శ్రీకాకుళం జిల్లా..

    -- సంక్షేమ పథకాలు అమలులో అధికారులు అక్రమాలకు పాలపడితే తొక్కతీస్తాం అంటూ వార్నింగ్..

    -- అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే అధికారులకు తొక్కలూడతీస్తాం అంటూ హెచ్చరికలు..

    -- ప్రభుత్వ పథకాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలని ఆదేశం..

    -- టాంపరింగ్ లకు పాల్పడుతూ అర్హులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు..

Print Article
Next Story
More Stories