Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 28 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం దశమి (ఉ. 10-59 వరకు) తదుపరి ఏకాదశి, మూల నక్షత్రం (మ. 3-46 వరకు) తదుపరి పూర్వాషాఢ, అమృత ఘడియలు (ఉ. 9-35 నుంచి 11-07 వరకు) వర్జ్యం (మ. 2-14 నుంచి 3-46 వరకు తిరిగి రాత్రి 1-12 నుంచి 2-46 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-16

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • CM Jagan: ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం జగన్
    28 Aug 2020 3:53 PM GMT

    CM Jagan: ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం జగన్

    అమరావతి: ఆంద్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ బోర్డు,  ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీ ఏర్పాటు

    ఏపీ పారిశ్రామిక

    కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మ‌న్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి

    ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సెక్రటరీ కరి కాల వలవన్.

  • 28 Aug 2020 3:50 PM GMT

    OSD SHAILAJA REDDY: ఓఎస్డీగా శైలజారెడ్డి పునర్నియామకం

    అమరావతి: రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శైలజారెడ్డిని ప్రోటోకాల్ విభాగం ఓఎస్డీగా పునర్నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

    ఈ ఏడాది జూలై 1 తేదీన ప్రోటోకాల్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన శైలజారెడ్డి

    ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయాల్లో ప్రోటోకాల్ విధులకు ఓఎస్డీగా శైలజారెడ్డిని నియమిస్తూ ఆదేశాలు

    ఆమె రెండేళ్లపాటు ప్రోటోకాల్ విభాగంలో ఓఎస్డీగా కొనసాగుతారని ఉత్తర్వులు నియామకం 

    జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ

  • 28 Aug 2020 3:41 PM GMT

    Srisailam Fire accident Updates: అగ్నిప్రమాదంపై గవర్నర్ కు లేఖ రాసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ.

    - శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు దగ్గర జరిగిన అగ్నిప్రమాదంపై గవర్నర్ కు లేఖ రాసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ....

    - శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు అగ్నిప్రమాదానికి గల కారణాలు ,ఆస్తి నష్టం పై ఇంకా స్పష్టత రాలేదు...

    - శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం నుండి అంధకారం నుంచి కాపాడి తొమ్మిది మంది మరణించారు...

    - మరణించిన ఉద్యోగులకు ప్రభుత్వం పరిహారం సరిగా లేదు, ఒక్కొక్కరికి రెండు కోట్లు చొప్పున పరిహారం చెల్లించి వారి కుటుంభం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..

    - శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పై నియమించిన విచారణ కమిటీ సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలి..

    - భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి...

  • 28 Aug 2020 3:40 PM GMT

    Chandrababu Naidu Tweet: ట్విట్టర్ లో టిడిపి అధినేత చంద్రబాబు...

    అమరావతి

    ట్విట్టర్ లో టిడిపి అధినేత చంద్రబాబు...

    ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు హైదరాబాద్ లోని ఫ్రీ ల్యాన్స్ జర్నలిస్టు శివ ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల ముందే కిడ్నాప్ చేసారు పోలీసులు. మానవ హక్కులు కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.ప్రతికాస్వేచ్ఛ ని హరించే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.

  • 28 Aug 2020 3:39 PM GMT

    Nizamabad Updates: కోవిడ్ బాధితులను పరామర్శించిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

    నిజామాబాద్:

    జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులను పరామర్శించిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ..

    జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది..

    ప్రజా వైద్యం పైన ఆసక్తి లేని ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు..

    కేసీఆర్ పాలనలో డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసిన పరిస్థితి లేదు..

    ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సెక్యూరిటీ గార్డ్ తో నెట్టి వేయించే పరిస్థితి నెలకొంది

    కేసీఆర్ తల దించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి..

    కరోనతో చనిపోయిన ప్రతి వ్యక్తి కి కారణం కేసీఆర్ ఏ..

    ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది..

    ప్రతి శాసనసభ నియోజకవర్గ నికి ఒక్క ఐ సొలేషన్ ఏర్పాటు చెయ్యలి.

    కరోనా తో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి..

    రాష్ట్రంలో ఎల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి..

    ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు సరైన వైద్యం అందించెందుకు కృషి చేయాలి.

  • 28 Aug 2020 3:38 PM GMT

    అఖిల పక్ష పార్టీల ఆన్లైన్ బహిరంగ సభ...

    - కరోనా కష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరశించాలి..

    - అఖిల పక్ష రాజకీయ పార్టీల(సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీ జే ఎస్, సీపీఐ ఎం ఎల్) సంయుక్త ఆధ్వర్యంలో ECIL లోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన "ఆన్లైన్ బహిరంగ సభలో" పాల్గొన్నారు..

    - బాల మల్లేష్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

    - కోవిడ్-19 వైరస్ ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వైఫల్యం చెందారని, ఈ విధానాలను వ్యతిరేకించి పోరాటం చేయాలి..

    - రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పోరాటం దిశగా చైతన్యవంతులని చేస్తాం..

    - అదేవిధంగా కోవిడ్-19 వైరస్ టెస్టులను వాడ వాడలా నిర్వహించడంలో అలసత్వం వహించారు....

    - ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ఊడిగం చేసేలా అనుమతులు ఇవ్వడం సిగ్గు చేటు అన్నారు..

    - వైరస్ పేరుతో వందల కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ను అధికార దుర్వినియోగం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు అప్ప్రజాస్వామికం..

    - కేంద్ర ప్రభుత్వం కాషాయకరణ విధానాలతో పాలన సాగుతోందని ఇది అత్యంత ప్రమాదకరం..

    - ప్రజాతంత్ర వాదులతో, భావ సారూప్యత కలిగిన మేధావులతో, సంఘ నిర్మాతలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, రానున్న రోజుల్లో ప్రజలతో మమేకమై సంఘటిత ఉద్యమాలు నిర్వహిస్తాం...

  • 28 Aug 2020 3:38 PM GMT

    Kala venkatrao News: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు..

    శ్రీకాకుళం జిల్లా..

    - టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు..

    - అచ్చెన్నాయుడు కు బెయిల్ రావడం ఆనందంగా ఉంది..

    - ఆలస్యం అయినా న్యాయం గెలిచింది..

  • 28 Aug 2020 2:04 PM GMT

    Amaravati Updates: మహిళా ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగించిన ఏపీ ప్రభుత్వం

    అమరావతి

    - సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతుల కార్యాలయాల మహిళా ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగించిన ఏపీ ప్రభుత్వం

    - హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరుల్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి 2021 జూన్ 31 తేదీ వరకూ ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగిస్తూ ఆదేశాలు

    - ఆగస్టు 1, 2020తో ఉచిత వసతి సౌకర్యం గడువు ముగియటంతో మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ

    - రెయిన్ ట్రీపార్కు లో ఉన్న 3 బెడ్ రూమ్ ఫ్లాట్ లలో 6గురు ఉద్యోగినులు, 2 బెడ్ రూమ్ ఫ్లాట్ లో 4గురు చొప్పున ఉండాలని స్పష్టం చేసిన ప్రభుత్వం

    - ప్రతీ మూడు నెలలకూ పరిస్థితిని అంచనా వేసి సదరు ఫ్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

  • 28 Aug 2020 1:35 PM GMT

    East Godavari District Updates: అక్రమంగా తరలిస్తున్న 2.5లక్షల విలువ గల 75కేజీ గంజాయి ను స్వాధీనం

    తూర్పుగోదావరి:

    - చింతూరు:చింతూరు మండలం దారకొండ నుండి ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న 2.5లక్షల విలువ గల 75కేజీ గంజాయి ను స్వాధీనం చేసుకున్న మోతుగూడెం పోలీసులు.

    - ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్, టాటా సుమో వాహనం సీజ్.

  • 28 Aug 2020 1:34 PM GMT

    Srisailam Dam: శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద

    కర్నూలు జిల్లా:

    - శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద

    - క్రస్ట్ గేట్లను మూసివేసిన అధికారులు

    - ఇన్ ఫ్లో : 65,061 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 68,474 క్యూసెక్కులు

    - పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

    - ప్రస్తుత : 884.60 అడుగులు

    - నీటి నిల్వ సామర్ధ్యం : 215.807 టిఎంసీలు

    - ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు

    - కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Print Article
Next Story
More Stories