Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧


ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Bhupalpally: కాటారం మండల కేంద్రంలో బీజేపీ నేతల రాస్తారోకో...
    27 Oct 2020 9:18 AM GMT

    Bhupalpally: కాటారం మండల కేంద్రంలో బీజేపీ నేతల రాస్తారోకో...

    // జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    // బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ రాస్తారోకో...

  • 27 Oct 2020 9:11 AM GMT

    Vikarabad Updates: వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం...

    వికారాబాద్... 

    //దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు

    //ఫాం హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపణ..

    //ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని విచారించిన పోలీసులు.

    //స్థానికులను బెదిరిస్తున్న ఫామ్ హౌజ్ నిర్వకులు.

    //ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ స్థానికులను బెదిరింపులు.

    //కాల్పుల ఘటన పైకీలక సమాచారం సేకరించిన పోలీసులు.

    //స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో దర్యాప్తు

    //ఆవు యజమానిని ఘటన జరిగిన మరుసటి రోజు బెదిరించిన ఫామ్ హౌజ్ నిర్వాహకులు

    //కొద్ది రోజులుగా ఫామ్ హౌజ్ ల పరిసరాల్లో పశువులను మేతకు తీసుకురావొద్దని గ్రామస్థులను హెచ్చరించిన ఫామ్ హౌజ్ నిర్వాహకులు

    //ఫామ్ హౌజ్ కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసుల ప్రాథమిక అంచనా.

  • 27 Oct 2020 9:05 AM GMT

    Mahabubnagar District Updates: తెలంగాణా చౌరస్తాలో కేసీఆర్, హరీష్ రావుల దిష్టిబొమ్మ సు దహనం...

    మహబూబ్ నగర్ జిల్లా :

    // బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో నిరసనలు, తెలంగాణా చౌరస్తాలో కేసీఆర్, హరీష్ రావుల దిష్టిబొమ్మ సు దహనం...

    // మహబూబ్ నగర్ పట్టణంలో నీ వీరన్న పేట, ఏర్రమన్ను గుట్ట ప్రాంతాలకు చెందిన లబ్దిదారులు తమకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయించాలని డిమాండ్   చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి. అనంతరం తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నాకు దిగిన లబ్దిదారులు.

  • Karimnagar District Updates: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల...
    27 Oct 2020 9:00 AM GMT

    Karimnagar District Updates: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల...

    కరీంనగర్ జిల్లా//

    // వీణవంక మండలం బేతుపల్లి గ్రామం లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

    // ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి వరి పంటలు సమృద్ధిగా పండిన కొంత అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు

     // వాటిని దృష్టిలో పెట్టుకుని రంగు మారిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

     // ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సూచనలు చేశారని మిల్లులలో ఎలాంటి దాన్యం కటింగ్ లు చేయవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ

  • 27 Oct 2020 7:38 AM GMT

    నారాయణపేట జిల్లా కేంద్రంలో నిన్న దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపి కార్యకర్తలు నారాయణపేట లో కేసీఆర్, హరీష్ రావుల శవ యాత్ర, అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో దగ్దం..

  • 27 Oct 2020 7:38 AM GMT

    ఫిలింనగర్ లో ప్రగతి భవన్ ముట్టడి చేయడానికి వచ్చిన బిజెపి నాయకులను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

  • 27 Oct 2020 7:38 AM GMT

    డిజిపి ఆఫీస్ ముట్టడి

    డిజిపి కార్యాలయాన్ని ముట్టడించిన బిజెవైఎం నాయకుడు.

    అరెస్ట్ చేసి నారాయనగూడా పోలీసు స్టేషన్ కి తరలించిన పోలీసులు.

  • 27 Oct 2020 7:37 AM GMT

    రాజన్న సిరిసిల్ల జిల్లా :

    కరీంనగర్ ఎంపీ., బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ముస్తాబాద్ మండల కేఃద్రంలో సి.ఎం. కెసిఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన బిజెపి శ్రేణులు, అడ్డుకున్న పోలీసులు.

  • 27 Oct 2020 7:37 AM GMT

    మినిష్టర్ క్వార్టర్స్ లో నాయని దివంగత నాయిని నర్సింహారెడ్డి సతీమణి ఆహల్య రెడ్డి పార్థివ దేహానికి నివాళి అర్పించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ తో కలిసి నాయిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

    ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.

  • 27 Oct 2020 7:36 AM GMT

    బండి సంజయ్ పై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహెడ లో బిజెపి నాయకులు రాస్తారోకో చేసి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు బీజేపీ నాయకుల పై జరిగే దాడులను ప్రభుత్వం మానుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన లు లు చేపడతామని హెచ్చరించారు బీజేపీ కార్యకర్తల పై పోలీసులు చేసిన లాఠీఛార్జి లను తీవ్రంగా ఖండించారు

Print Article
Next Story
More Stories