Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 24 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి: రా.11-44 తదుపరి నవమి | మూల నక్షత్రం రా.11-36 తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.8-11 నుంచి 9-43 వరకు తిరిగి రా.10-04 నుంచి 11-36 వరకు | అమృత ఘడియలు: సా.5-26 నుంచి 6-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ.2-41 నుంచి 3-29 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-54

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 24 Sep 2020 2:52 PM GMT

    Vishnuvardhan Reddy: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కి కోవిడ్ పాజిటివ్

    విజయవాడ

    - ఈ రోజు బీజేపీ ధర్నా కార్యక్రమం అనంతరం పరీక్ష చేయించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి

    - కరోనా వచ్చినట్లు నిర్ధారణ, ఐసోలేషన్ కి విష్ణు

    - విష్ణు కు పాజిటివ్ రావడం తో బీజేపీ నేతల్లో గుబులు

    - నాలుగు రోజుల క్రితం బీజేపీ పదాడికారుల సమావేశం లో నేతలను కలిసిన విష్ణు.

    - ఎమ్మెల్సీ లు, ముఖ్య నేతలతో మీడియా సమావేశాలు పెట్టిన విష్ణువర్ధన్ రెడ్డి

    - ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి నిరసనలో పాల్గొన్నవారి లో ఆందోళన.

    ఉదయం నిరసనల సందర్భం గా కార్యకర్తలు, పోలీసు, మీడియా ప్రతినిధులను కలిసిన విష్ణు

  • Srisailam updates: శ్రీశైలంలో అన్యమతం పార్శిల్ కలకలం.
    24 Sep 2020 11:58 AM GMT

    Srisailam updates: శ్రీశైలంలో అన్యమతం పార్శిల్ కలకలం.

    కర్నూల్ జిల్లా..

    -శ్రీశైలంలోని ఒక కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపించిన క్రిస్టియన్ సంస్థ

    -శ్రీశైలం పర్యాటక శాఖ ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి వచ్చిన పార్శిల్

    -కార్గో ద్వారా వచ్చిన పార్శిల్ ను స్వాధీనం చేసుకున్న దేవస్థానం, పోలీస్ అధికారులు

    -శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో పార్శిల్ ఘటన పై విచారణ చేస్తున్న అధికారులు

    -పార్శిల్ చిరునామా కలిగిన వ్యక్తులను విచారిస్తున్న ఎస్సై హరిప్రసాద్, దేవస్థానం అధికారులు

  • Ongole updates: ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన ఒంగోలు   విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..
    24 Sep 2020 11:50 AM GMT

    Ongole updates: ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..

    ప్రకాశం జిల్లా..

    -మార్కాపురంలో పేసెంట్లనుండి అధిక ఫీజు వసూల్లు చేస్తున్నారనే సమాచారంతో ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన ఒంగోలు   విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.

    -పలు రికార్డులు స్వాధీనం.

    -కొనసాగుతున్న తనిఖీలు.

  • Tirumala-Tirupati updates: ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల అక్టోబర్ కోటా విడుదల.
    24 Sep 2020 11:37 AM GMT

    Tirumala-Tirupati updates: ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల అక్టోబర్ కోటా విడుదల.

    తిరుమల..

    -అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల కోటాను టిటిడి గురువారం ఆన్ లైన్లో విడుదల చేసింది.

    -అక్టోబర్ 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ రోజుల్లో కళ్యాణోత్సవం రద్దు

    -టికెట్లు బుక్ చేసుకునే గృహ‌స్తులకు ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు, క‌ల‌కండ‌ ప్ర‌సాదాన్ని త‌పాలా శాఖ ద్వారా వారి పంపిణీ

    -ఆన్‌లైన్‌ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్‌ బుక్‌ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశం

  • Kadapa updates: మీడియా ముందుకు ప్రొద్దుటూరు నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అసలు సూత్రధారి భాస్కర్ రెడ్డి..
    24 Sep 2020 11:29 AM GMT

    Kadapa updates: మీడియా ముందుకు ప్రొద్దుటూరు నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అసలు సూత్రధారి భాస్కర్ రెడ్డి..

    కడప :

    -నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు నా పనే ....

    -హోసూరులో సుబ్బిరామిరెడ్డి అనే వ్యక్తి ద్వారా సలహా మేరకే ఇలా చేశాను ...

    -హోసూరులో పనిచేస్తున్న సమయంలో సుబ్బిరామిరెడ్డి పరిచయం......

    -నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల ద్వారా డబ్బులు వస్తాయని చెయ్యమని చెప్పడం వల్లే చేశాను .....

    -ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చూసే అసిస్టెంట్ ద్వారా చెక్కుల సమాచారం తెలుసుకున్నా....

    -అసలు సూత్రధారి నేనే నని ప్రచారం జరుగుతుండటంతో లొంగిపోవాలని అనుకున్నాను....

    -పోలీసుల ఎదుట కూడా ఇదే చెబుతా ....

    -మూడు చెక్కులు మినహా నాకెలాంటి సంబంధం లేదు ....నన్ను ఎవ్వరు విచారించలేదు.... నేనే లొంగిపోతున్నా

  • Visakha updates: డిక్లరేషన్ ఇచ్చి సిఎం దర్శనానికి వెళ్లి వుండాల్సింది.
    24 Sep 2020 11:12 AM GMT

    Visakha updates: డిక్లరేషన్ ఇచ్చి సిఎం దర్శనానికి వెళ్లి వుండాల్సింది.

    విశాఖ..

    -Hmtv తో ఏపి సాధూ పరిషత్తు అధ్యక్షులు శ్రీనివాసంద స్వామి

    -డిక్లరేషన్ వ్యవహారం లో సిఎం హిందువు ల మనోభావాలు దెబ్బతీశారు

    -ధార్మిక సంస్థలను కించపరిచేలా మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని తన పదవికి రాజీనామా చేయాలి

    -దమ్ముంటే మళ్ళి పోటీ చేసి గెలవాలని సవాల్

    -భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  • Vizianagaram updates: సాలూరు మండలం చీపురువలసలో ఎమ్మెల్యే రాజన్నదొరకు చుక్కెదురు..
    24 Sep 2020 11:05 AM GMT

    Vizianagaram updates: సాలూరు మండలం చీపురువలసలో ఎమ్మెల్యే రాజన్నదొరకు చుక్కెదురు..

    విజయనగరం....

    -గెలిచాక తమ గ్రామాన్ని పట్టించుకోలేదని గ్రామం వద్ద అడ్డుకున్న గిరిజనులు.

    -గ్రామ సమస్యలు తీర్చకుంటే మళ్ళీ గ్రామానికి రానని హమీనిచ్చిన ఎమ్మెల్యే.

    -ఎమ్మెల్యే రాజన్న దొర వెళ్లిన త్రోవలో నిరసనగా మంటలు వేసిన గిరిజన యువకులు.

  • Guntur updates: ఏపిఈడబ్ల్యూఐడీసి డైరెక్టర్ సూరే బాలకృష్ణ తీరు పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం...
    24 Sep 2020 11:03 AM GMT

    Guntur updates: ఏపిఈడబ్ల్యూఐడీసి డైరెక్టర్ సూరే బాలకృష్ణ తీరు పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం...

    గుంటూరు ః

     ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి రఫీ .

    -తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.

    -తమ పట్ల బాలకృష్ణ అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు

    -కమిషనర్ ఆదేశాలను సైతం డైరెక్టర్ బాలకృష్ణ తుంగలో తొక్కుతున్నాడు.

    -దళిత ఉద్యోగుల పట్ల బాలకృష్ణ వివక్ష చూపుతున్నారు.

    -తన పద్దతి మార్చుకోకపోతే పోరాటం చేస్తాం

  • 24 Sep 2020 11:00 AM GMT

    Amaravati updates: మా నాయ‌కుడిపై ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తోంది..

    అమరావతి..

    ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కామెంట్స్...

    - ఇష్టానుసారంగా ఎల్లో మీడియా రాతలు రాస్తోంది

    - పిచ్చి రాత‌ల‌తో ఎల్లోమీడియా ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంది

    - హిందూ దేవాల‌యాల‌పై దాడుల వెనుక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఉంది

    - రాజ‌కీయ స్వార్థం కోసం రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు

    - త‌మ అనుకూల మీడియా ద్వారా వార్త‌లు ప్ర‌చారం చే‌సుకుంటున్నారు

    - ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసమే వేస్తున్న ఏకైక‌ నాయ‌కుడు సీఎం జ‌గ‌న్

    - హిందూ మ‌తంపై విశ్వాసంతో కాదు, అధికారంలో లేమ‌నే బాధ‌తో ప్ర‌తిప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి

    - అత్యంత భ‌క్తిభావంతో సీయం జ‌గ‌న్ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్నారు

    - సంక్షోభం సృష్టించాల‌న్న తాప‌త్రయ‌మే ప్ర‌తిప‌క్షాల్లో క‌నిపిస్తోంది

    - ఊహించ‌డానికి కూడా భ‌య‌ప‌డే అత్యంత భ‌యంక‌ర‌మైన ఆర్థిక సంక్షోభంలో కూడా విజ‌య‌వంతంగా ప‌రిపాలిస్తున్న స‌వ్య‌సాచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

    - ఏపీలో వ్య‌వ‌స్థ చాలా బాగుందని.. వాలంటీర్, గ్రామ స‌చివాల‌యాలు.

    - మంచి ఆలోచ‌న అని, ఇత‌ర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంద‌ని స్వయంగా ప్ర‌ధానే జగన్ ను మెచ్చుకున్నారు

  • 24 Sep 2020 10:56 AM GMT

    West Godavari updates: నిడదవోలులో ప్రముఖ వ్యాపారవేత్త పై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించిoది..

    పశ్చిమగోదావరి జిల్లా..

     👉నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త పై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించిoది.

    👉 నిడదవోలులోని ప్రముఖ వ్యాపార వేత్త , 28 కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు సత్తివేణుమాధవ్ రెడ్డి పై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేశారు.

    👉అనంత లక్ష్మీ నరసింహ రా రైస్ మిల్ వివాదంలో గత కొంత కాలం గా పాత కక్షలు నేపద్యంలో దాడికి పాల్పడినట్లు.. చెబుతున్న మాధవ రెడ్డి కుటింబుకులు.

    👉 దాడి నిర్వహణలో...చవ్వ సత్య కృష్ణ, శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు ప్రధానపాత్రపోషించినట్లు...చెబుతున్న చూపరులు.

    👉రంగంలోకి దిగిన పోలీసులు. చవ్వా

     👉 శ్రీధర్ ని అదుపులోకి తీసుకున్న సమిశ్రగూడెం పోలీసులు. పరారీలో చవ్వా సత్య కృష్ణ వారి కుటుంబీకులు.

    👉విషమ పరిస్థితిలో ఉన్న మాధవరెడ్డిని ఆసుపత్రికి తీసుకు వచ్చి వదిలేసి పారిపోయిన ప్రత్యర్ధులు.

    👉స్థానిక శేషగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవ రెడ్డి.

    👉 దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Print Article
Next Story
More Stories