Top
logo

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 23 Sep 2020 12:42 PM GMT

  Harish Rao Comments: పప్పులో చిటికెడు ఉప్పేసి.. పప్పంతా నాదే అన్నట్లుగా కేంద్ర బీజేపీ వ్యవహరిస్తోంది..ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు..

  మంత్రి హరీశ్ రావు కామెంట్స్:

  -పప్పులో చిటికెడు ఉప్పేసి.. పప్పంతా నాదే అన్నట్లుగా కేంద్ర బీజేపీ వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు.

  -బాయికాడ మీటర్లు రావొద్దన్నా.., విదేశీ మక్కలు రావొద్దన్నా.., మార్కెట్ యార్డులు రద్దు కావొద్దన్నా.. దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఏస్ అభ్యర్థిని లక్ష మెజారిటీతో   గెలిపించి బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలని నియోజకవర్గంలోని రేషన్ డీలర్లకు మంత్రి పిలుపునిచ్చారు.

  -మీ సంక్షేమం.. మా బాధ్యతగా చెప్పుకొచ్చారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబరు వన్ గా ఉన్నామని వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని,   దుబ్బాక  సంక్షేమం, దుబ్బాక అభివృద్ధి టీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందని ప్రజలకు తెలపండని కోరారు.

  -కేంద్రం NFSA కింద 40 లక్షల కార్డు దారులకు 5 కిలోల చొప్పున్న బియ్యం అందిస్తుందని, కానీ 90 లక్షల రేషన్ కార్డు దారులకు 6 కిలోల చొప్పున్న బియ్యం   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని.. బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ప్రజలకు తెలియజేయాలని కోరారు.

  -11వేల 700 కోట్లు పింఛన్ల కోసం రాష్ట్రం వెచ్చిస్తే.. కేవలం 200 కోట్లు కేంద్రం ఇస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించేలా తెలియజెప్పాలని కోరారు.

  -రేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా.. పరిష్కారం తీసుకుంటానని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు,     డీలర్లకు మేలు చేసిందని మంత్రి హరీశ్ రావు వివరించారు.

 • Hyderabad RTC updates: హైదరాబాద్‌ సిటీ బస్సులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
  23 Sep 2020 12:22 PM GMT

  Hyderabad RTC updates: హైదరాబాద్‌ సిటీ బస్సులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

  గ్రేటర్ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు..

  -తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు...

  -సిటీ శివార్లలో 290 సర్వీసులను ఈరోజు నుంచి నడుపుతున్నాం...

  -అన్ని డిపోలలో బస్సుల ను సిద్ధం చేసి ఉంచాం...

  -కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసాం...

  -ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం...

 • Telangana updates: సిబిఎస్‌ఇ, ఇంటర్మీడియట్ కోసం 30% సిలబస్‌ను తగ్గించడానికి అనుమతించిన ప్రభుత్వం: సయ్యద్ ఉమర్ జలీల్..
  23 Sep 2020 11:44 AM GMT

  Telangana updates: సిబిఎస్‌ఇ, ఇంటర్మీడియట్ కోసం 30% సిలబస్‌ను తగ్గించడానికి అనుమతించిన ప్రభుత్వం: సయ్యద్ ఉమర్ జలీల్..

  సయ్యద్ ఉమర్ జలీల్, సెక్రెటరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్

  - మొదటి & రెండవ సంవత్సరం సైన్స్, మ్యాథ్స్ సిలబస్ సిబిఎస్ఇ సూచించిన విధంగా తగ్గించబడ్డాయి

  - హ్యుమానిటీస్ విషయంలో, ఇంటర్మీడియట్ సిలబస్ మన స్టేట్ సిలబస్ ఆధారంగా ఉంది.

  - ప్రతి సబ్జెక్టు నిపుణుల కమిటీ చర్చించి సిఫారసులను చేసింది

  - తగ్గించబడిన పాఠ్యాంశాలు ఈ సంవత్సరానికి మాత్రమే.

  - జాతీయ వీరులు, సామాజిక సంస్కర్తలు, ప్రముఖ వ్యక్తులపై పాఠాలు తొలగించబడవు

 • Telangana updates: తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన తెలంగాణ జనసమితి అద్యక్షులు ఫ్రో,,కోదండరాం ...
  23 Sep 2020 11:20 AM GMT

  Telangana updates: తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన తెలంగాణ జనసమితి అద్యక్షులు ఫ్రో,,కోదండరాం ...

  -ఒకవైపు ఇంటిపార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుండగానే పార్టీ కార్యాలయానికి చేరుకున్న కోదండరాం..

  -ఇప్పటి పట్టబద్రుల ఎన్నికల మద్దతు కోసం వివిధ పార్టీ నాయకులను కలుస్తున్న టీజేఎస్..

  -తాను కూడా పట్టబద్రుల పోటీలో ఉన్నానని ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్...

  -ఈ ఇద్దరి సమావేశానికి ప్రాధాన్యత...

 • Hyderabad updates: సరూర్ నగర్ భూముల అక్రమణ పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...
  23 Sep 2020 11:03 AM GMT

  Hyderabad updates: సరూర్ నగర్ భూముల అక్రమణ పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...

  సరూర్ నగర్..

  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి...

  -సరూర్ నగర్ లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై వరదనీరు కాలనీల మధ్య పోవడం వల్లే నవీన్ కుమార్ కొట్టుకుపోయి మరణించాడు...

  -అక్కడ భూ ఆక్రమణలు జరగడం వల్లే ఇలా జరిగిందగని కాలనీ వాసులు చెప్తున్నారు...

  -బైరంగుడా పైన ఉన్న చేపల చెరువు ఆక్రమణకు గురవడం వల్ల రెడ్డి కాలనీ మధ్య వరద ప్రవహిస్తుంది...

  -రెడ్డి కాలనిలో అడ్డంగా గోడ నిర్మాణం ఉండడం వల్ల అక్కడే నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ అడ్డంగా ఉండడం వల్ల వర్షపు నీరు ఎక్కడికి వెళ్లడం లేదు...

  -ఫ్లై ఓవర్ తరువాత ఉన్న కాలువలు ఆక్రమణకు గురయ్యాయి 6 ఎకరాలు ఉన్న చెరువు 3 ఎకరాలు కబ్జాకు గురైంది..

  -సరూర్ నగర్ ,బైరామల్ గూడ చెరువులన్నీ సమగ్ర సర్వే చేపట్టి అక్రమ లే అవుట్ లపై చర్యలు తీసుకోవాలి..

  -నవీన్ కుమార్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి..

 • Ease of Doing Business: రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మరిన్ని సంస్కరణలు..కేటీఆర్..
  23 Sep 2020 10:48 AM GMT

  Ease of Doing Business: రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మరిన్ని సంస్కరణలు..కేటీఆర్..

  పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్..

  #రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపు పై పలు శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి కేటీఆర్ సమావేశం

  #ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు సైతం అనేక ప్రయోజనాలు

  #శాఖల పరంగా చేపట్టే సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు

  # పౌరులకి అన్ని సేవలని ఒకేచోట అందించేందుకు ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్మెంట్ పోర్టల్ కు ప్రతిపాదన

  #ఇదే సమావేశంలో టి ఎస్ బి పాస్ అమలుపై న చర్చ

  #చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసము.

 • 23 Sep 2020 10:36 AM GMT

  Telangana BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసమ్మతి నేతల ధర్నా..

  - మంగళవారం ప్రకటించిన నగర జిల్లా అధ్యక్షుల జాబితాలో ఉమమహేందర్ పేరు లేదు అని నిరసన..

  - గోశామహల్ - గోల్కొండ అధ్యక్ష పదవి పాండు యాదవ్ కు ఇవ్వడంపై నిరసన

  - ఉమమహేందర్ కు న్యాయం చేయాలని ఆయన అనుచరులు డిమాండ్..

  - సద్ది చెపుతున్న ఎమ్మెల్సీ రాంచందర్ రావు.

 • 23 Sep 2020 10:26 AM GMT

  ACB updates: మల్కాజిగిరి ఏసీపీ నరసింహరెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఎసిబి సోదాలు..

  -ఏసిబి సోదాలు..

  -హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు.

  -సికింద్రాబాద్ లో తన ఇంట్లో భారీగా బంగారం వెండి ఆభరణాలు గుర్తింపు.

  -భారీగా ఆస్తులు, ప్లాట్స్, వ్యవసాయ భూములు గుర్తింపు

  -ఏపి, తెలంగాణ, హైదరాబాద్ లో 12 చోట్ల కొనసాగుతున్న సోదాలు

  -ఈరోజు సాయంత్రం వరకూ సోదాలు కొనసాగే అవకాశం

  -కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు

  -ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేసే అవకాశం

  -మియాపూర్, బేగంపేట్, ఉప్పల్ సిఐగా చిక్కడపల్లి , మల్కాజిగిరి ఏసీపీ గా పనిచేసిన నర్సింహారెడ్డి

  -నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, భూ వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు

  -Acp నర్సింహారెడ్డి బంధువులకు సంబంధించిన ఇండ్లలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

  -జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం వడ్ఢిచెర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

 • 23 Sep 2020 10:20 AM GMT

  Warangal Urban updates: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్‌పెక్టర్ల ( సిఐల ) బదిలీలు..

  వరంగల్ అర్బన్..

  - వి.ఆర్ విభాగంలో వున్న కె. విజయ్ కుమార్ కు హన్మకొండ ట్రాఫిక్ ,

  - కె. రామకృష్ణ వి.ఆర్ నుండి సి.సి.ఆర్.బి కిబదిలీ.

  - ప్రస్తుతం హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ హన్నన్ వి.ఆర్ బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు

 • 23 Sep 2020 10:16 AM GMT

  Yadadri updates: భువనగిరి ఏరియా ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం...

  యాదాద్రి....

  - 10 రోజుల వయసు పసికందు 60 వేల రూపాయలకు విక్రయించిన తల్లి.

  - ఈనెల 12వ తేదీన ఏరియా ఆసుపత్రికి ప్రసవానికి వచ్చిన భువనగిరి మండలానికి చెందిన ఓ యువతి...

  - యువతి తల్లి 60 వేల రూపాయలకు ఘట్కేసర్ మండలానికి చెందిన వారికి విక్రయం

  - రెండు రోజుల క్రితం నేరేడ్మెట్ పోలీసులు ఓ కేసు విషయంలో ఓ ఇద్దరిని విచారించగా ఈ ఘటన వెలుగులోకి....

  - పూర్తి స్థాయి విచారణ చేపట్టిన భువనగిరి టౌన్ పోలీసులు...

  - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Next Story