Top
logo

Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 23 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం పంచమి: (రా. 9-32 వరకు) తదుపరి షష్టి, చిత్త: (రా. 10-15 వరకు) తదుపరి స్వాతి, అమృత ఘడియలు: (సా. 4-18 నుంచి 5-47 వరకు) వర్జ్యం: (ఉ. 7-22 నుంచి 8-51 వరకు తిరిగి తె. 3-27 నుంచి 4-57 వరకు) దుర్ముహూర్తం: (సా. 4-38 నుంచి 5-28 వరకు) రాహుకాలం: (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-47 సూర్యాస్తమయం: సా.6-19

రోజు తాజా వార్తలు

Live Updates

 • Thadiguda Waterfall: సెల్ఫీ తీసుకుంటూ జారిపడిన యువకుడు.
  23 Aug 2020 4:22 PM GMT

  Thadiguda Waterfall: సెల్ఫీ తీసుకుంటూ జారిపడిన యువకుడు.

  విశాఖ: అనంతగిరి మండలం తాడిగుడ జలపాతం పై నుంచి జారిపడి పర్యాటకుడి మృతి.

  మృతుడు హైదరాబాద్ వాసి పువ్వల రాణాప్రతాప్ 24.

  సెల్ఫీ తీసుకుంటూ జారిపడిన యువకుడు.

 • CM Jagans Daughter: ప్ర‌ముఖ బిజిసెన్ స్కూల్‌లో సీటు సంపాదించిన జ‌గ‌న్ పెద్ద కుమార్తె
  23 Aug 2020 4:18 PM GMT

  CM Jagan's Daughter: ప్ర‌ముఖ బిజిసెన్ స్కూల్‌లో సీటు సంపాదించిన జ‌గ‌న్ పెద్ద కుమార్తె

  అమరావతి: మంగళవారం మధ్యాహ్నం బెంగుళూరు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

  జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు రావడంతో బెంగుళూరుకు వెళ్తున్న సీఎం

  తన కుమార్తెను పారిస్‌ పంపించేందుకు మంగళవారం బెంగళూరు వెళ్లనున్న సీఎం జగన్‌

  26వ తేదీన బెంగుళూరులో తన సొంత నివాసంలో బస చేయనున్న సీఎం.

  27వ తేదీన తిరిగి మళ్ళీ తాడేపల్లి నివాసానికి రానున్న సీఎం.

 • Drunk Ambulance Driver Hulchul In Kakinada: కాకినాడలో అంబులెన్స్ డ్రైవర్ బీభత్సం
  23 Aug 2020 4:08 PM GMT

  Drunk Ambulance Driver Hulchul In Kakinada: కాకినాడలో అంబులెన్స్ డ్రైవర్ బీభత్సం

  తూర్పుగోదావరి : కాకినాడ భానుగుడి జంక్షన్ లో ప్రభుత్వ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ అంబులెన్స్ బీభత్సం..

  తప్పతాగి తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను నడుపుతున్న డ్రైవర్..

  రోడ్డు పై నడిచి వెళుతున్న మహిళను అంబులెన్స్ తో ఢీ కొట్టిన డ్రైవర్.. స్వల్ప గాయాలతో బయట పడ్డ మహిళ.

  పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో డివైడర్ ను ఢీ కొట్టిన అంబులెన్స్ డ్రైవర్.. అడ్డుకున్న స్థానికులు, పోలీసులు..

  మద్యం మత్తులో స్థానికులు, పోలీసులతో వాగ్వివాదంకు దిగిన అంబులెన్స్ డ్రైవర్..

  అంబులెన్స్ డ్రైవర్ కు దేహ శుద్ధిచేసిన స్థానికులు..

  ఆ సమయంలో అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు.

  అంబులెన్స్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న, విచారిస్తున్న ట్రాఫిక్ పోలీసులు..

 • Excise Enforcement Raids: కోరుకోండలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు.
  23 Aug 2020 3:59 PM GMT

  Excise Enforcement Raids: కోరుకోండలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు.

  తూర్పు గోదావరి జిల్లా: కోరుకోండలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు.. 60లీటర్ల నాటుసారా, ఒక బైక్ స్వాధీనం నలుగురు వ్యక్తులు అరెస్ట్..

 • రాష్ట్రాన్నిముక్కలు చేస్తే ద్రోహులుగా మిగిలిపోతారు: కిమిడి కళా వెంకట్రావు
  23 Aug 2020 3:56 PM GMT

  రాష్ట్రాన్నిముక్కలు చేస్తే ద్రోహులుగా మిగిలిపోతారు: కిమిడి కళా వెంకట్రావు

  అమరావతి: కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు

  అమరావతి రైతుల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవటం ఖాయం

  అక్రమంగా ఆస్తులు సంపాదించటం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్ తెలుసుకోవాలి

  3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే  రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు

 • 23 Aug 2020 3:53 PM GMT

  కులం పేరుతో దూషించాడంటూ వైకాపా నేత పై ఫిర్యాదు

  చిత్తూరు: చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం పద్మసరస్సు గ్రామంలో దారుణం

  రైతు పొలం లో మామిడి చెట్లు నరికించిన వైకాపా నేత త్యాగరాజ రాజు

  తన పై దౌర్జన్యానికి దిగి... తన పొలంలో మామిడి చెట్లు నరికించాడని వైకాపా నేతపై రైతు ఫిర్యాదు

  కార్వేటి నగరం పోలీస్ స్టేషన్ లో వైకాపా నేత పై ఫిర్యాదు చేసిన రైతు ముత్తుస్వామి

  పొలం ఆక్రమించుకునేందుకు ప్రయత్నం, కులం పేరుతో దూషించాడంటూ ఫిర్యాదు చేసిన ముత్తుస్వామి..

  సంఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు

  కేసు నమోదు చేసుకున్న కార్వేటినగరం పోలీసులు

 • Davaleshwaram Project Updates: ధవలేశ్వరం వద్ద తగ్గుతున్న వరద నీటిమట్టం
  23 Aug 2020 3:49 PM GMT

  Davaleshwaram Project Updates: ధవలేశ్వరం వద్ద తగ్గుతున్న వరద నీటిమట్టం

  తూర్పుగోదావరి - రాజమండ్రి: 

  ధవలేశ్వరం వద్ద తగ్గుతున్న వరద నీటిమట్టం

  కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

  ప్రస్తుతం నీటిమట్టం 17 అడుగులకు తగ్గిన నీటిమట్టం

  17లక్షల 90 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల

  కోనసీమలో గౌతమి,వశిష్ఠ,వైనతేయ గోదావరి పాయల మధ్య జలదిగ్భంధంలో వారంరోజులుగా లంకగ్రామాలు

  పది రోజులుగా జలదిగ్భంధంలోనే కొనసాగుతున్న ఏజన్సీ దేవీపట్నం మండలం

  26వేలకు పైగా వరదలో నానుతున్న ఇళ్ళు..

  82 గ్రామాల వరకూ జలదిగ్భంధంలోనే

  125 పునరావాస కేంద్రాలలో బాధితులకు పునరావాసం

  వరద ముంపు గ్రామాలలో పునరుద్దరణ కాని విద్యుత్

  వరద ముంచెత్తిన లంకల్లో విషసర్పాల విలయతాండవానికి అల్లాడిపోతున్న జనం..

  వరదల్లో కరోనా రోగులు ఇక్కట్లు...

  పదివేల ఎకరాలలో పంటనష్టం

 • 23 Aug 2020 3:47 PM GMT

  చిత్రచేడు ఘటన లో హెడ్ కానిస్టేబుల్ సహా ముగ్గురిపై కేసు నమోదు.

  అనంతపురం: పెద్దవడుగురు మండలం చిత్రచేడు ఘటన లో హెడ్ కానిస్టేబుల్ సహా ముగ్గురిపై కేసు నమోదు.

  నాటు సారా తీసికెళుతున్నాడన్న కారణం తో గ్రామానికి చెందిన నల్లయ్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పోలీసులు.

  రాత్రి ఇంటి వద్దకు వెళ్లి పోలీసులు చితక్కొట్టారని బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు

 • Sushant Singh Rajput death case: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో CBI, ఈడీల విచారణ
  23 Aug 2020 3:40 PM GMT

  Sushant Singh Rajput death case: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో CBI, ఈడీల విచారణ

  జాతీయం/ సినిమా: 

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కీలకంగా మారిన హైదరాబాద్ కు చెందిన సిద్దార్ద్ పితాని స్టేట్మెంట్

  సిద్దార్ద్ ను విచారించిన CBI, ఈడీ అధికారులు

  సుశాంత్ నివాసంలో ఆధారాలు సేకరించిన సీబీఐ

  ముంబైలో కొనసాగుతున్న విచారణ  

  14వ తేదీ రాత్రి సుశాంత్ తనతో నార్మల్ గానే మాట్లాడారని తెలిపిన సిద్దార్ద్

  రియా ఇంటినుండి ఎందుకు వెళ్లిపోయిందనే అంశంపై సిద్దార్ద్ ను ప్రశ్నించిన CBI 

 • Ganja Smuggling gang Arrest: గంజాయి ముఠా అరెస్ట్
  23 Aug 2020 3:34 PM GMT

  Ganja Smuggling gang Arrest: గంజాయి ముఠా అరెస్ట్

  ఏలూరు రూరల్ పోలీసుల అదుపులో గంజాయి ముఠా..

  నర్సీపట్నం నుండి కృష్ణ జిల్లా కు గంజాయి ని తరలిస్తున్న ఆరుగురు సభ్యులను..

  ఏలూరు ఆశ్రమం కాలేజి వద్ద అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు....

  మరో ఇద్దరు నిందుతుల పరారీ,గాలింపు చేపట్టిన పోలీసులు....

  నాలుగు వందల కేజీల గంజాయి,రెండు కార్లు,రెండు సెల్ ఫోన్స్ సీజ్..... అరెస్ట్ 

Next Story