Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha updates: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు..
    22 Sep 2020 12:25 PM GMT

    Visakha updates: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు..

    విశాఖ..

    -సంక్షేమ పథకాలు చంద్రన్న భీమా (ఇప్పుడు వైస్సార్ భీమా ), .భీమా అనేది గతంలో మాదిరిగా ప్రతి కుటుంబంలో పని చేసే ప్రతిఒక్కరికి అందాలి అంతే కానీ   ఇంటికి ఒక్కరికే అనే వైఖరి సబబు కాదు

    -మా ప్రాంతంలో మగవారు , ఆడవారు ఇద్దరు కూడా పనులకు వెళ్తారు, ఇంటి పెద్దకి మాత్రమే భీమా వర్తింపచేయాలని నిర్ణయం మార్చుకోవాలి

    -డ్వాక్రా గ్రూపులు విషయంలో వైస్సార్ ఆశ్ర పేరిట రుణ మాఫీ గతంలో మాదిరిగా అందరికి సమానంగా వర్తించకుండా కొన్ని గ్రూపులకు ఎక్కువ ,కొన్ని     గ్రూపులకు  త్రక్కువ చేసి రుణ మాఫీ చేసారు

    -మీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏర్పడిన కొత్త గ్రూపులకు ఈ సంక్షేమ పథకాలు ఇంకా వర్తించటంలేదు

    -ఇటీవల కాలంలో మొదట ఇసుక కొరత , విద్యుత్ చార్జీలు , కరోనా వలన అనేక పరిశ్రమలు చతికిలపడ్డాయి

    -ఇటువంటి సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఇప్పటికే మీకు రెండుమార్లు లేఖ వ్రాయడం జరిగింది

    -గత మూడు వారాలుగా రాష్టంలో రోజుకు కనీసం ఒక్కటి రెండు చోట్లయినా ప్రార్థన ప్రదేశాలపై దాడులు జరగడం దారుణం

    -ఒక్క బాధ్యులను శిక్షించకపోగా , ఇప్పుడు రాష్ట్ర మంత్రి స్థాయిలో ఇటువంటి సంఘటనలను వక్రీకరించి ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి

    -ఇదే ప్రభుత్వ వైఖరి అనే విధంగా మీ మౌనం సందేశం ఇస్తుంది

  • Vijayawada updates: వ్యవసాయ బిల్లులపై మోదీ సర్కారుకు ధన్యవాద తీర్మానం..
    22 Sep 2020 12:22 PM GMT

    Vijayawada updates: వ్యవసాయ బిల్లులపై మోదీ సర్కారుకు ధన్యవాద తీర్మానం..

    విజయవాడ..

    -రాష్ట్ర పదాధికారుల సమావేశం లో బీజేపీ తీర్మానాలు.

    -తిరుమల దర్శనం లో హోదాలకు సంబంధం లేకుండా, ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ తీర్మానం

    -హిందూ దేవలయాల రక్షణ విషయం లో పోరాటం కొనసాగించాలని సమావేశం లో నిర్ణయం

    -తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ- జనసేన తరుపున పోటీలో దిగాలని నిర్ణయం

    -తిరుపతి ఉప ఎన్నికను సవాల్ గా తీసుకోవాలని నిర్ణయం

    -టీటీడీ డిపాజిట్ లపైన బీజేపీ సమావేశం లో నిర్ణయం

    -Ttd డిపాజిట్ లు మల్లింపు ప్రభుత్వ ఎత్తుగడ గా అభిప్రాయ పడ్డ నేతలు.

  • 22 Sep 2020 12:16 PM GMT

    East Godavari updates: అనపర్తి సూర్య శ్రీ థియేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం..

    తూర్పుగోదావరి :

    -సీలింగ్ కు వ్యాపించిన మంటలు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చిన సిబ్బంది..

    -ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది..

  • Visakha updates: జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు ఉండగా ప్రభుత్వ పెద్దలు పనులు చేయడం కోసం కొత్తగా మూడో జె సి ని తీసుకువచ్చారు..అయ్యన్న పాత్రుడు..
    22 Sep 2020 12:13 PM GMT

    Visakha updates: జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు ఉండగా ప్రభుత్వ పెద్దలు పనులు చేయడం కోసం కొత్తగా మూడో జె సి ని తీసుకువచ్చారు..అయ్యన్న పాత్రుడు..

    విశాఖ..

    మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్

    -22 ఏ ప్రభుత్వ భూములు ఎన్ని ఫైలును ఇప్పటివరకు మీరు వచ్చిన తర్వాత నడిపించారు

    -జె సీ వేణుగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత జిల్లాలో ఎక్కడ ఇసుక దొరకలేదు

    -మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి ఆయనే స్వయంగా ఆ ప్రాంతాల సందర్శించి కొలతలు వేయడం వెనక మర్మమేమిటి

    -ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • Kodali Nani Comments: నేను ఎవరికీ అదరను, బెదరను..కొడాలి నాని..
    22 Sep 2020 12:04 PM GMT

    Kodali Nani Comments: నేను ఎవరికీ అదరను, బెదరను..కొడాలి నాని..

    విజయవాడ..

    హెచ్ఎంటీవీతో మంత్రి కొడాలి నాని ;

    -తిరుమలలో డిక్లరేషన్ పై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను..

    -6 కోట్ల ప్రతినిధిగా ముఖ్యమంత్రి జగన్ బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నారు తప్ప వ్యక్తిగతంగా కాదు...

    -స్వామి దర్శనానికి డిక్లరేషన్ అవసరమే లేదు

    -విగ్రహాల ధ్వంసం పై నేను చేసిన వ్యాఖ్యల్ని టిడిపి, బీజేపీలు వక్రీకరించాయి.

    -నేను హిందువుగా నా మతాన్ని అభిమానిస్తాను..ప్రజాప్రతినిధిగా ఇతర మతాల్ని గౌరవిస్తాను.

    -హిందూమతానికి ద్రోహం అంటూ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే.

    -చంద్రబాబు పూజలు చేయటం వల్లే అమరావతికి ఈ పరిస్థితి వచ్చింది.

    -రఘురామకృష్ణం రాజు లాంటి వ్యక్తులు నాలుక కోస్తామంటున్నారు..ఇక్కడెవరూ ఖాళీగా లేరు.

    -దుర్గగుడిలో సింహాల బొమ్మలు పోవటానికి అక్కడ సైకిల్ బెల్లులు ఎత్తుకెళ్లిన టిడిపి దొంగలే కారణం..

    -విపక్షాలు మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.

  • Vijayawada updates: కేశినేని నాని తమ్ముడి పేరిట మోసాలు..
    22 Sep 2020 11:48 AM GMT

    Vijayawada updates: కేశినేని నాని తమ్ముడి పేరిట మోసాలు..

    విజయవాడ..

    - ఎంపీ కేశినేని నాని తమ్ముడిని అంటూ డబ్బులు వసూలు చేసిన కేశినేని రమేష్

    - HRM ఫైనాన్స్ ఎండీ, గెట్ వే హోటల్ పార్ట్ నర్ అంటూ పలువురిని బురిడీ కొట్టించిన కేశినేని రమేష్

    - 3 కోట్లు రుణం పేరిట గుంటూరు జిల్లా నల్లపాడు స్థలంపై సేల్ డీడ్ చేస్తా అని దూడల ఋషికేశ్వర్ నుంచి 20 లక్షలు వసూలు చేసిన కేశినేని రమేష్

    - 80 లక్షలు చెల్లని చెక్కు ఇచ్చి పరారైన కేశినేని రమేష్

    - విజయవాడల పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు...

  • Vijayawada updates: విజయవాడ బీసెంట్ రోడ్డులో హాకర్స్ మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు...
    22 Sep 2020 11:45 AM GMT

    Vijayawada updates: విజయవాడ బీసెంట్ రోడ్డులో హాకర్స్ మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు...

    విజయవాడ..

    ఘర్షణ..

    - రాళ్లు విసురుకున్న ఇరు వర్గాలు...

    - జ్యుస్ దుకాణం, చెప్పుల వ్యాపారుల మధ్య ఈ ఉదయం చెలరేగిన ఘర్షన...

    - చెప్పులు వేసుకుని దుకాణంలోకి రావద్దని చెప్పుల దుకాణ దారుడిని అడ్డుకున్న పండ్ల రసాల వ్యాపారి...

    - ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం...

    - ఒకరికొకరు రాళ్ళ దాడి చేసుకోవడం తో రంగంలోకి దిగిన పోలీసులు...నలుగురికి గాయాలు...

    - ఇరువర్గాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

    - సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం సమీపంలో ఘటన...

  • Vijayawada-Durgamma updates: దుర్గమ్మ వెండి రథం ప్రతిమలు చోరీ కేసు..
    22 Sep 2020 11:42 AM GMT

    Vijayawada-Durgamma updates: దుర్గమ్మ వెండి రథం ప్రతిమలు చోరీ కేసు..

    విజయవాడ..

    -శివాలయం దగ్గర పనులు చేసిన వర్కర్ల ను విచారిస్తున్న పోలీసులు

    -పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీల నుంచి వర్కర్లను తీసుకువచ్చిన తాపీ మేస్త్రి

    -నలుగురు మెస్ర్టీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

    -లాక్ డౌన్ ముందు లాక్ డౌన్ తర్వాత 21 నెలల పాటు పనులు చేసిన కార్మికులు

  • Srikakulam updates: చంద్రబాబు పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..
    22 Sep 2020 11:37 AM GMT

    Srikakulam updates: చంద్రబాబు పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..

    శ్రీకాకుళం జిల్లా..

    తమ్మినేని సీతారాం..

    -గతంలో పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే కాళ్ళు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చేది..

    -ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..

    -పేదవాడి ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు అందేలా సీఎం జగన్ పాలన వికేంద్రీకరణ చేశారు..

    -30 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తే..

    -కళ్ళు, చెవులు లేని ప్రతిపక్షం కోర్టుకు పోయి అడ్డుకుంది..

    -26 కేసుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని చంద్రబాబు బ్రతుకుతున్నారు..

    -చంద్రబాబుని ఎప్పుడు మూసేస్తారో తెలియదు..

    -ఎంతకాలం స్టేలు తెచ్చుకుంటారు..

    -ఎంతకాలం 30 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వకుండా ఆపుతారు..

    -ఏదో ఒకరోజు ప్రజలు రోడ్డెక్కుతారు..

    -అందుకే బాధ్యతగా వ్యవహరించండి..

  • Vijayawada updates: రాష్ట్రం లో హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది..విష్ణువర్ధన్ రెడ్డి..
    22 Sep 2020 11:34 AM GMT

    Vijayawada updates: రాష్ట్రం లో హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది..విష్ణువర్ధన్ రెడ్డి..

    విజయవాడ..

    విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి

    -రాష్ట్రం లో దేవాలయాల పై దాడుల వెనుక కుట్ర కనపడుతోంది.

    -రుద్రాక్ష లతో ఒక స్వామీజీ గా మంత్రి కొడాలి నాని కనిపిస్తారు.

    -మేడిపండు చందంగా కొడాలి ఆహార్యం ఉంటుంది.

    -కొడాలి వ్యాఖ్యల వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడలేం.

    -అంతర్వేది ఘటనలో కేసులు ఎత్తివేసేంతవరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదు

    -కేంద్ర పధకాల పేర్లను మార్చి గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది

    -ఆంధ్రప్రదేశ్ ఎజెండానే బిజెపి ఎజెండా

Print Article
Next Story
More Stories