Live Updates: ఈరోజు (22 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 22 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | అష్టమి - 22:53:39 వరకు తదుపరి నవమి | ధనిశ్ఠ - 11:09:53 వరకు తదుపరి శతభిష | వర్జ్యం 14:50:57 నుండి 16:15:16 | అమృత ఘడియలు 11:39:51 నుండి 12:24:49 | దుర్ముహూర్తం 16:09:39 నుండి 16:54:37 | రాహుకాలం 16:15:16 నుండి 17:39:34 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Nov 2020 10:49 AM GMT
Kamareddy Updates: కామారెడ్డిలో మూడవ రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
కామారెడ్డి:
* డిఎస్పీ కార్యాలయంలో నిన్న సాయంత్రం నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఏసీబీ విచారణ
* పలు అంశాలపై డిఎస్పీని విచారిస్తున్న ఏసీబీ అధికారులు
* పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం
* డిఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలతో ఆందోళనకు గురవుతున్న పోలీసు అధికారులు
- 22 Nov 2020 5:17 AM GMT
Adilabad Updates: నేరెడిగోండ మండలంలో రోడ్డు ప్రమాదం..
ఆదిలాబాద్//
* నేరెడిగోండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామునా కారుని ఢీకొన్న ట్యాంకర్ లారి...
* కారులో ప్రయానిస్తున్నా 5 గురికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు...
- 22 Nov 2020 4:54 AM GMT
Nalgonda Updates: ఇంకా జైల్లోనే ఉన్న గత ఫేక్ ఫేస్ బుక్ హాక్ చేసిన సైబర్ నేరగాళ్లు..
నల్లగొండ:
* నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేరిట మరోసారి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి ఫ్రెండ్ రిక్వెస్ట్,డబ్బులు వసూలుకు తెరలేపిన సైబర్ కేటుగాళ్ళు.
* సైబర్ టీమ్ ను అలెర్ట్ చేసిన ఎస్పీ, రెండు నెలల క్రితమే నకిలీ ఫేస్ బుక్ ఖాతాతో డబ్బులు పంపాలని చాటింగ్ చేసిన కేటుగాళ్ళు.
- 22 Nov 2020 4:51 AM GMT
Yadadri Bhuvanagiri Updates: జిల్లా కేంద్రంలో భారీగా పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లు...
యాదాద్రి-భువనగిరి జిల్లా:
- స్థానిక రామ్ నగర్ లో గల మార్వాడి షాప్ లో సుమారు 6లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.
- కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు.
- 22 Nov 2020 4:48 AM GMT
Kamareddy Updates: జిల్లా పోలీస్ శాఖను కుదుపేసిన ఐ.పి.ఎల్. బెట్టింగ్ వ్యవహారం..
కామారెడ్డి:
* బెట్టింగ్ వ్యవహారంలో తీగ లాగుతున్న ఏసిబి...
* ఈ పాటికె సి.ఐ. జగదీశ్ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు.
* రెండు రోజుల పాటు సి.ఐ. ఇంట్లో సోదాలు, నేడు కొనసాగే అవకాశం.
* కామారెడ్డి డిఎస్పీ, మరో ఎస్.ఐ., కానిస్టేబుల్ పాత్రపై ఏసీబీ అనుమానాలు...
* డిఎస్పీ కార్యాలయంలో రికార్డుల తనిఖీ.
* డబ్బులు వసూలు లో డి.ఎస్.పి. ప్రమేయం ఉందా? అనే కోణం లో విచారణ.
* బెట్టింగ్ రాయుళ్ల తో అంట కాగిన పోలీస్ అధికారుల్లో గుబులు.
* విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్న ఏసీబీ అధికారులు
- 22 Nov 2020 4:38 AM GMT
Nirmala updates: మామడలో ప్రియుని ఇంటిముందు ప్రియురాలి మౌన పోరాటం..
నిర్మల్ జిల్లా..
* ప్రియురాలిని తీవ్రంగా చితుకబాదిన ప్రియుడు..
* ప్రాణాపాయ స్థితిలో ప్రియురాలు..
* చికిత్స కోసం ప్రియురాలిని నిర్మల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
* కేసు నమోదు చేసిన విచారణ జరుగుతున్న పోలీసులు
- 22 Nov 2020 4:25 AM GMT
Nirmal District Updates: నిర్మల్ జిల్లా మామడలో దారుణం...
నిర్మల్ జిల్లా..
* పెళ్లి చేసుకోవాలని ప్రియుని ఇంటి ముందు మౌనపోరాటానికి దిగిన యువతి పై దాడి..
* సిగలో వెంట్రుకలు కట్ చేసి యువతి పై దాడి చేసిన ప్రియుడు, కుటుంబ సభ్యులు.
* దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియురాలు మంజు
* చికిత్స కోసం నిర్మల్ అసుపత్రికి తరలింపు.
* దాడి పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నా పోలీసులు