Live Updates: ఈరోజు (22 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 22 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | అష్టమి - 22:53:39 వరకు తదుపరి నవమి | ధనిశ్ఠ - 11:09:53 వరకు తదుపరి శతభిష | వర్జ్యం 14:50:57 నుండి 16:15:16 | అమృత ఘడియలు 11:39:51 నుండి 12:24:49 | దుర్ముహూర్తం 16:09:39 నుండి 16:54:37 | రాహుకాలం 16:15:16 నుండి 17:39:34 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Nov 2020 6:16 PM IST
Visakha Updates: పద్మనాభం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు...
విశాఖ
*అనంతరం వెంకటాపురంలో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంచిన మంత్రి.
*మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్
*జిల్లా వ్యాప్తంగా 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.
*రైతులు 17 శాతం తేమతో ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి తీసుకు రావచ్చు.
*మద్దతు ధర గ్రేడ్ వన్ 1888 రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు.
*తుఫాన్ , వరదల వల్ల పంట ఎంత నష్టయిన పూర్తిగా నష్ట పరిహారాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
*సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూముల రైతులకు వైయస్ఆర్ జలకళ పథకం ఒక వరం లాంటిది.
*అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాము.
- 22 Nov 2020 6:12 PM IST
Nellore District Updates: తోటపల్లి గూడూరు (మం) వరకవిపూడి గ్రామంలో వివాదం..
నెల్లూరు...
- తోటపల్లి గూడూరు (మం) వరకవిపూడి గ్రామంలో చెరువు వేలం పాట నగదు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ....
- కత్తులతో పరస్పరం దాడులు.. పలువురికి తీవ్ర గాయాలు...
- బాధితులు నక్క పెంచాలయ్య, కోవూరు శ్రీను, పల్లం. ఆదిలక్ష్మి ల ను 108 వాహనం ద్వారా నెల్లూరుకి తరలింపు...
- మరో కొంతమంది స్వల్ప గాయాలు..
- గ్రామంలో పోలీస్ పికిటింగ్ ఏర్పాటు చేసిన ఎస్. ఐ ఇంద్రసేనా రెడ్డి....
- 22 Nov 2020 5:25 PM IST
Tirumala Updates: కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం..
తిరుమల
* ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం.
* కోవిడ్-19 నిబంధనలు మేరకు పార్వేటి మండపంలో ఏకాంతంగా నిర్వహించాం.
* కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 250 భక్తులతో కార్యక్రమం నిర్వహించాము.
* కార్తీకవన మహోత్సవం సందర్భంగా వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసాం.
* రేపటి నుండి భక్తులకు యధాతథంగా వర్చువల్ సేవలు వుంటాయి.
* ఏవి.ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈవో
- 22 Nov 2020 4:38 PM IST
Vijayawada Updates: శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు నిరాధారం...
విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయము రీజాయిండర్
సీపీ బి.శ్రీనివాసులు
* ఏ.ఆర్.హెచ్.సి. - 471, శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు నిరాధారం
* విజయవాడ నగర పోలీసులు ప్రతి నిత్యం ఎన్నో మానసిక, శారీరక ఒత్తిడులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు
* విజయవాడ పోలీసుల పని తీరుపైన, పోలీసు జాగిలాల పని తీరు, వాటి సామర్ధ్యం సరిగా లేదని చేసిన ఆరోపణలు నిరాధారం
* వి.ఐ.పి/వి.వి.ఐ.పి.ల రక్షణ దృష్యా, హత్య కేసులు, దొంగతనం వంటి కేసుల్లో పోలీసు జాగిలాల పాత్ర చాల కీలకమైనది
* వెటర్నరీ డాక్టరు నిరంతర పర్యవేక్షణలో, పోలీసు జాగిలాల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది
* కొంత కాలంగా శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగోనందున సిక్ లో ఉన్నారు
* ఆర్ముడు రిజర్వు హెచ్.సి.-471, శ్రీనివాసరావు 2005 నుండి డాగ్ హ్యాండలర్ గా విధులు నిర్వహిస్తున్నారు
* 15 సంవత్సరముల తర్వాత సాధారణ బదిలీలలో భాగంగా డాగ్ స్వాడ్ విధుల నుండి ఆర్ముడు రిజర్వు డ్యూటీలకు పంపడం జరిగింది
* అతను వాలంటరీ రిటైర్మెంట్ ఇంతవరకు కోరలేదు, ఏవిధమైన అభ్యర్థన సమర్పించలేదు
* అతని అభియోగాలన్ని సత్యదూరాలు
- 22 Nov 2020 4:31 PM IST
Amaravati Updates: టిడిపి ఎంపిటిసి అభ్యర్ధి భర్తపై హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు...
అమరావతి..
* ఫోన్ చేసి బాధితులను పరామర్శించిన చంద్రబాబు
* టిడిపి అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన చంద్రబాబు
- 22 Nov 2020 4:29 PM IST
Rajahmundry Updates: రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు...
తూర్పుగోదావరి-రాజమండ్రి..
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
- ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ యాదవ్ కు లేఖ ఇవ్వడంతో 22న సిపిఐ రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు
- పోలవరం చీఫ్ ఇంజనీరు సుధాకర్ బాబు కాల్ చేసి ఎలా వస్తున్నారు అని అడిగారు
- అనుమతి కోసం లెటర్ సానుకూలంగా స్పందిస్తే ఇపుడు పోలీసులుఎందుకు అడ్డుకుంటున్నారు
- రాష్ట్రంలో సిఎం జగన్ ప్రభుత్వమా, డిజీపి గౌతమ్ సవాంగ్ ప్రభుత్వం నడుస్తుందా
- జగన్ ప్రభుత్వం మాకు కన్పించడం లేదు. ఇరిగేషన్ మంత్రి మాటకు విలువలేదా
- ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి
- ఇలాంటి నిర్భంధం ఎందుకు చేస్తారు
- పోలవరం ప్రాజెక్టు కావాలని అందరూ కోరుకుంటున్న ప్రాజెక్టు
- పోలవరం ప్రాజెక్టు సందర్శించే వెళతాం..ఇందుకు ప్రభుత్వం స్పందించాలి
- పోలవరానికి వెళ్ళి అన్నిపరిశీలించాకే అక్కడ పరిస్థితులు ,ఎత్తు తగ్గింపులపై మాట్లాడతాను
- 22 Nov 2020 10:43 AM IST
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్...
తిరుమల
- సత్యకుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
- కరోనా మహమ్మారి నుంచి విశ్వ మానవాళికి విముక్తి జరగాలని ప్రార్ధించాను.
- టీటీడీ పవిత్రతను కాపాడాలి, ఆలయ భూములు ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోరుతున్నా..
- భక్తి భావంతో భక్తులు స్వామి వారిని సమర్పించే కానుకలు ధర్మపరిక్షణ కోసం ధార్మిక కార్యక్రమాల కోసమే వాడాలి.
- 22 Nov 2020 10:39 AM IST
Guntur District Updates: నరసరావుపేటలో వార్డు వాలంటీర్ పై భాను ప్రకాష్ అనే యువకుడి దాడి..
గుంటూరు ..
* నరసరావుపేటలో వార్డు వాలంటీర్ షేక్ మస్తాన్ వలి పై భాను ప్రకాష్ అనే యువకుడి దాడి.
* భాను ప్రకాష్ స్థానిక వైసిపి నేత తనయుడిగా గుర్తించి స్థానికులు.
* దాడిలో ధ్వంసమైన సచివాలయ ఫర్నిచర్.
* భాను ప్రకాష్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
- 22 Nov 2020 10:32 AM IST
Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు...
తిరుమల
// ఆలయ మర్యాదలతో ఉడిపి పెజవర్ పిఠాదిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ.
// బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్.
// ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి.
// మధ్యప్రదేశ్ మంత్రి ఆరవింద బహుదురియా.
// విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ.
// పోరుబందర్ పార్లమెంట్ సభ్యుడు రమేష్ బాయి దుడుకు.
- 22 Nov 2020 9:38 AM IST
Krishna Updates: వీరులపాడు నుండి అక్రమంగా మద్యం సీసాలు స్వాధీనం..
కృష్ణాజిల్లా..
* వీరులపాడు (మం) పెద్దాపురం వద్ద తెలంగాణ నుండి అక్రమంగా 500 మద్యం సీసాలు స్వాధీనం
* ఒక వ్యక్తి అరెస్టు చేసి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్న వీరులపాడు పోలీసులు













