Top
logo

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Amaravati updates: పోలీస్‌ సేవ యాప్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్‌..
  21 Sep 2020 10:28 AM GMT

  Amaravati updates: పోలీస్‌ సేవ యాప్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్‌..

  అమరావతి..

  సీఎం పాయింట్స్..

  -పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ పోలీస్‌ సేవ (సిటిజెన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌)‌‌యాప్‌ను     ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

  -పోలీసు ఫీల్డ్‌ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లు అందజేసిన సీఎం.

  -పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది.

  -సర్టిఫికెట్‌ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్‌ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం   లేదు.

  -మొబైల్‌ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్‌ పొందవచ్చు.

  -మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్‌ చేర్చారు. దిశ యాప్‌ కూడా అనుసంధానం చేశారు.

  --పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్‌ మీడియా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

  -దేశంలోనే తొలిసారిగా దిశ యాప్‌. ఇది ఎంతో సక్సెస్‌ అయింది. 11 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇది గర్వకారణం

  -దిశ యాప్‌ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 యఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము.

  -సైబర్‌ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్‌ నంబరు ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చాం.

  స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్నాలజీ.

  -రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి తెచ్చి రిమోట్‌ ఏరియా కమ్యూనికేషన్లు, వాహనాలకు జీపీఎస్, శాటిలైట్‌ ఫోన్ల వ్యవస్థ ఏర్పాటు చేశాం.

  -న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలోనే ‘ఇంటర్‌- ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌’.

  -ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది.

  -చాలా సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌ ద్వారా పొందవచ్చు.

 • Visakha updates: సింహాచలం లో భక్తులకు ఇవాళ నుండి ప్రత్యక్ష పద్దతిలో పూజల్లో పాల్గొనే అవకాశం..
  21 Sep 2020 10:19 AM GMT

  Visakha updates: సింహాచలం లో భక్తులకు ఇవాళ నుండి ప్రత్యక్ష పద్దతిలో పూజల్లో పాల్గొనే అవకాశం..

  విశాఖ..

  -కోవిడ్ నిబంధనలు పాటిస్తు పరిమిత సంఖ్యలో అనుమతి

  -ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి అనుమతి

 • 21 Sep 2020 10:13 AM GMT

  AP Congress Core Committee Meeting: ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరభవన్ లో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..

  ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..

  -హజరుకానున్న మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంచార్జీ ఉమించాంది , ఏపీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్ , ఇతర పార్టీ సీనియర్ నేతల.

  -చాలా రోజుల తరువాత పార్టీ మీటింగ్ కి హాజరవుతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. • Rajahmundry updates: ముద్రగడ నాయకత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుంది..ఏపీ కాపు జేఏసీ నేతలు..
  21 Sep 2020 10:08 AM GMT

  Rajahmundry updates: ముద్రగడ నాయకత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుంది..ఏపీ కాపు జేఏసీ నేతలు..

  తూర్పుగోదావరి -రాజమండ్రి..

  ఏపీ కాపు జేఏసీ నేతలు మీడియా సమావేశం

  రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ , ఆరేటి ప్రకాష్, చినిమిల్లి రాయుడు కామెంట్స్ ,,

  -ముద్రగడ నాయకత్వంలో ఐదేళ్ళు ఉద్యమం చేశాం

  -లేఖరూపంలో ముద్రగడ తన నిర్ణయం తెలిపారు

  -ముద్రగడ మనస్తాపం చెందివున్నారు

  -ఎమ్మెల్యే పదవికి రాజీనామా , జీవో 30 తేవడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఐదు శాతం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపడం ముద్రగడ ఉద్యమం వల్లే

  -కాపులు ఎపుడూ ముద్రగడ ను మరచిపోరు

  -రిజర్వేషన్లు ఫలితాలు సాధన, సంక్షేమంపై ఆయన పాత్ర లేనిదే మేము లేం

  -ఏదిఏమైనా ముద్రగడ బాటలోనే నడుస్తాం

  -ప్రతిజిల్లాలో కాపు జేఏసీ సమావేశాలు నిర్వహించి మళ్ళీ ముద్రగడ ను కలుస్తాం..కాపు రిజర్వేషన్లు సాధించితీరతాం

  -ముద్రగడ పద్మనాభం మనస్థాపం చెంది ఆయనను బుజ్జగింపుపైనే దృష్టి పెట్టాం

  -ముద్రగడ కు అండగా వున్నామని చెప్పడానికే ఈ సమావేశం ప్రాధాన్యం

 • National updates: పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరా: అనిల్ కుమార్ యాదవ్..
  21 Sep 2020 10:00 AM GMT

  National updates: పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరా: అనిల్ కుమార్ యాదవ్..

  జాతీయం..

  -కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి అనిల్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలు

  -పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని వినతి

  అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి..

  - రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు

  - వరదల సమయంలో నూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు

  - 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం

  - పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలి

  - నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు విడుదల చేస్తామన్నారు

  - కృష్ణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించాను

  - అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు

  - ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు

 • Guntur updates: గుంటూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి....అగ్రికల్చర్ జేడీ విజయభారతి....
  21 Sep 2020 8:57 AM GMT

  Guntur updates: గుంటూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి....అగ్రికల్చర్ జేడీ విజయభారతి....

  గుంటూరు...

  -హెచ్ఎంటివి తో గుంటూరు అగ్రికల్చర్ జేడీ విజయభారతి....

  -జిల్లాలో ప్రత్తి,మిరప,వరి,పసుపు పంటలు నష్టపోయాయి...

  -జిల్లాలో 9,600హెక్టార్లలో పంటలు నష్టపోయాయి.....

  -వాగులు పొంగిపొర్లడంతో పంటలకు నష్టం జరిగింది....

  -రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది....

 • 21 Sep 2020 8:47 AM GMT

  East Godavari updates: రాజోలు గాంధీ బొమ్మ సెంటర్ లో ఆందోళన చేపట్టిన బిజెపి యువమోర్చా సభ్యులు..

  తూర్పు గోదావరిజిల్లా.... రాజోలు..

  -హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని బర్తరఫ్ చేయాలంటూ ఆందోళన చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన   యువ మోర్చా సభ్యులు.

  -మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డా బీజేపీ యువ మోర్చా సభ్యులు.

  -150 కేజీల బరువున్న నాని ఒంట్లో నుంచి రెండు కేజీలు తీసేస్తే వాడికి ఏమైనా నష్టమా అంటూ మండిపడ్డారు

  -ఆందోళన చేస్తున్న యువ మోర్చా సభ్యులను అడ్డుకున్న పోలీసులు.

 • East Godavari updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు
  21 Sep 2020 8:27 AM GMT

  East Godavari updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

  తూర్పుగోదావరి..

  -అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయం లో

  -ఈనెల 25 వరకు భక్తులకు మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

  -కరోనా వ్యాప్తి నివారణ, పోలీసు బందోబస్తు నేపధ్యంలో తాజా నిర్ణయం తీసుకున్న అధికారులు

  -ఉదయాన్నే దర్శనాలకు అనుమతించినా ఆలయానికి రాని భక్తులు

 • Amaravati updates: రైతును..రాజును, పారిశ్రామిక వేత్తను చెయ్యడమే బీజేపీ పరిపాలనా ఉద్దేశం: సోము వీర్రాజు..
  21 Sep 2020 7:11 AM GMT

  Amaravati updates: రైతును..రాజును, పారిశ్రామిక వేత్తను చెయ్యడమే బీజేపీ పరిపాలనా ఉద్దేశం: సోము వీర్రాజు..

  అమరావతి...

  -సోము వీర్రాజు...ఏపీ బీజేపీ అధ్యక్షుడు..

  -ఇదే ఉద్దేశం తో రైతుల బిల్ ప్రవేశ పెట్టాము..

  -భారత దేశం లో రైతు పండించే పంట కు గిట్టుబాటు ధర లేదు..

  -రైతు కూడా తన పంట ఎక్కడైనా అమ్ముకోవాలి...

  -ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదు.

  -ఇప్పటివరకు దేశంలో దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోయారు.

  -మంత్రి కొడాలి నాని ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం లేదంటున్నారు.

  -ఏంటి..ఈ భాష, ఇది సభ్యత కాదు.

  -ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాష మాట్లాడించడం మంచిది కాదు...

  -బీజేపీ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..

  -సరైన భాష మాట్లాడడానికి కూడా చట్టబద్ధత ఉండాలి....

 • Amaravati updates: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక-కె.కన్నబాబు..
  21 Sep 2020 7:01 AM GMT

  Amaravati updates: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక-కె.కన్నబాబు..

  పిడుగు హెచ్చరిక..

  కృష్ణా జిల్లా..

  *కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్*

  -నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం.

  తూర్పుగోదావరి జిల్లా..

  -రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం

  -మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

  -పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.

  -సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

Next Story