Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 20 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి | అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు | అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 20 Oct 2020 5:21 AM GMT

    తమిళనాడు సీఎం పలనిస్వామి కి ఫోన్ చేసి రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.

    రాష్ట్రంలో పరిస్థితిని సీఎం ఫలని స్వామికి వివరించిన కేసీఆర్.

    నగదు సహాయంతో పాటు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నరని తమిళనాడు సీఎం ను అభినందించిన కేసీఆర్.

  • 20 Oct 2020 5:21 AM GMT

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    సరస్వతి బ్యారేజ్

    40 గేట్లు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 117.50 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 7.58 టీఎంసీ

    ఇన్ ఫ్లో 1,74,000 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో 1,80,000 క్యూసెక్కులు

  • 20 Oct 2020 5:20 AM GMT

    కరీంనగర్ : పోతిరెడ్డిపాడు యువకుడి హత్య ఘటన లో ప్రేమ వ్యవహారం : పోలీస్ లు

    అదే గ్రామానికి చెందిన అమ్మాయి తో ప్రణయ్ కి గత కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉంది

    ఆ విషయం లో ఊర్లో అమ్మాయి అన్న అనిల్ కి ప్రణయ్ కి గొడవలు ఉన్నాయ్

    రాత్రి ప్రణయ్ అనిల్ చెల్లలితో మాట్లాడుతుండగా చూసారు

    కోపం లో అతనిపై దాడి అనిల్ దాడి చేశారు

    ఆ దెబ్బలవల్లే ప్రణయ్ చనిపోయి ఉండొచ్చు ని అనిమానిస్తున్నాం

    ప్రేమ వ్యవహారం లో జరిగిన గొడవ కోణంలోనే విచారణ చేస్తున్నాం

  • 20 Oct 2020 5:20 AM GMT

    # అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహా రెడ్డి ని పరామర్శించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి..

    # నాయిని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లని అడిగి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

    #ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

  • 20 Oct 2020 5:19 AM GMT

    వరంగల్ అర్బన్.

    నేడు జిల్లాలో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.

    ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్న బండి సంజయ్..

    ఎలుకతుర్తి మండలం సురారం లో పర్యటించనున్న బండి సంజయ్..

  • 20 Oct 2020 5:19 AM GMT

    బ్రేకింగ్...

    హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ కలకలం

    సిటీ యూత్ ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు

    స్టూడెంట్ విసా మీద వచ్చి ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న డానియల్

    లంజర్ హౌజ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్.

    నిందితుడి నుండి 6 గ్రాముల కో కై న్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం

  • 20 Oct 2020 5:18 AM GMT

    కరీంనగర్ జిల్లా//

    వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి లో దారుణం.

    ప్రణయ్ అనే యువకున్ని హత్య చేసిన దుండగులు.

    హత్య కు ప్రేమ వ్యవహారం కారణమంటున్న గ్రామస్తులు.

    సోమవారం రాత్రి వరకు స్నేహితులతో ఉన్న మృతుడు ప్రణయ్ .

    అంబేద్కర్ భవన్ ముందు

    హత్య .

  • 20 Oct 2020 5:18 AM GMT

    నిర్మల్ // బాసర

    బాసర లో అంగ రంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ... నాల్గవరోజు కూష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న బాసర సరస్వతి అమ్మవారు....

  • 20 Oct 2020 5:18 AM GMT

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ప్రభుత్వ సాయం

    వరదల్లో ఇళ్ళు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, గోడలు కూలి పాక్షికంగా దెబ్బ తింటే యాభై వేలు, ఇంట్లోకి నీళ్ళు వస్తే 10 వేలు ఆర్ధిక సహాయం

    ఈరోజు నుంచే ఆర్థిక సహాయం అందించనున్న అధికారులు, కార్పొరేటర్లు

    ఇప్పటికే వరద బాధితుల వివరాలు సేకరించిన ghmc అధికారులు

  • 20 Oct 2020 5:17 AM GMT

    నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

    18 క్రస్టుగేట్లు 15 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..

    ఇన్ ఫ్లో :4,96,487లక్షల క్యూసెక్కులు

    అవుట్ ఫ్లో :4,96,497 క్యూసెక్కులు.

    పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

    ప్రస్తుత నీటి నిల్వ : 309.9534 టీఎంసీలు.

    పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

    ప్రస్తుత నీటిమట్టం: 589.30అడుగులు

Print Article
Next Story
More Stories