Live Updates: ఈరోజు (సెప్టెంబర్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 19 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ: మ.12-34వరకు తదుపరి తదియ | హస్తనక్షత్రం ఉ.8-00 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: మ.3-26 నుంచి 4-55 వరకు | అమృత ఘడియలు: రా.12-22 నుంచి 1-51 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-52 నుంచి 7-28 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-58
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతోహనం లాంచనంగా ప్రారంభం అయ్యాయి.
ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభం కానుంది.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Sept 2020 10:10 AM IST
Anantapur Updates: మడకశిర నియోజకవర్గ సరిహద్దు కర్ణాటక లోని సమయం లో రోడ్డు ప్రమాదం.
అనంతపురం:
- మడకశిర నియోజకవర్గ సరిహద్దు కర్ణాటక లోని సమయం లో చంద్రబాయి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం.
- ఆగివున్న లారీని ఢీకొన్న ఇన్నోవా.
- బెంగళూరు నుంచి పావగడ కు వెళ్తుండగా సంఘటన
- డ్రైవర్ గుడిబండ మండలం NR రొప్పం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు
- డ్రైవర్ ,ఒక మహిళ ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి.
- మృతులు ఇద్దరు పావగొడ చెందిన వారు గా గుర్తింపు
- క్షతగాత్రులను మాధుగిరి హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.
- 19 Sept 2020 10:06 AM IST
Amaravati Updates: కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీలో బార్లు తెరవడం అవసరమా?: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
అమరావతి
- ఈ ప్రభుత్వం కరోనాపై పోరాడుతున్న వైద్యులను గౌరవించకపోగా వారిపై వేధింపులకు, దాడులకు పాల్పడుతోంది.
- 6,09,558 కరోనా కేసులు, 5244 మరణాలు సంభవించాయి.
- ఇప్పటికే వైన్ షాపులకు అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోయి దేశంలో ఏపీ 2వ స్థానానికి చేరింది.
- ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను మాత్రమే అన్వేషిస్తోంది.
- అందులో భాగంగానే బార్లకు అనుమతిచ్చి 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం ఏఈఆర్టీ విధించింది.
- పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రు.1 చొప్పున సెస్సు విధించి, ప్రజలపై రు.600 కోట్లు భారం మోపింది.
- ప్రభుత్వం ఇప్పటివరకు రు.65 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపింది.





